మధ్యప్రదేశ్ లోని రత్లామ్ లో షాకింగ్ ఘటన జరిగింది. రాత్రి భోజనం సమయంలో దోసకాయ తిన్న 5 ఏండ్ల బాలుడు చనిపోయాడు. అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు పిల్లలు ఆస్పత్రి పాలయ్యారు. రాత్రి భోజనం సమయంలో సలాడ్ గా ఆఫ్రికన్ ఖీరా అని పిలువబడు బాలమ్ దోసకాయలను కుటుంబం సభ్యులు తిన్నారు. కాసేపట్లోనే తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ తో బాధపడ్డారు. ముగ్గురు వాంతులు చేసుకున్నారు. వెంటనే వారిని హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలో బాలుడు చినిపోయాడు. మరో ఇద్దరు పిల్లలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇంతకీ వాళ్లకు దోసకాయ తినడం వల్ల ఎందుకు ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యారు? డాక్టర్లు ఏం చెప్పారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సాల్మొనెల్లా పాయిజనింగ్ ఎఫెక్ట్!
చనిపోయిన బాలుడిని పరిశీలించిన వైద్యులు సాల్మోనెల్లా పాయిజనింగ్ కారణంగా చనిపోయినట్లు వెల్లడించారు. మిగతా ఇద్దరు పిల్లలకు కూడా సాల్మోనెల్లా కారణంగానే ఫుడ్ పాయిజన్ అయినట్లు చెప్పారు. పచ్చికూరగాయల మీద సాల్మోనెల్లా అనే బాక్టీరియా ఉంటుందని, సరిగా శుభ్రం చేయకుండా తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని తెలిపారు. సాల్మోనెల్లా పాయిజనింగ్ అనేది శరీరంలోని వాటర్, ఎలక్ట్రోలైట్స్ ను తగ్గిస్తుందన్నారు. సాధారణంగా కొన్ని రోజుల్లో దానంతట అదే తగ్గిపోయినప్పటికీ, వ్యాధి నిరోధక శక్తి స్థాయిలను బట్టి కొద్ది మందిలో ఈ ఇన్ఫెక్షన్ తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుందన్నారు. అత్యంత అరుదుగా ప్రాణాపాయం కలిగిస్తుందని వైద్యులు తెలిపారు.
సాల్మొనెల్లా పాయిజనింగ్ అంటే ఏంటి?
సాల్మానెల్లా పాయిజనింగ్ అనేది సాల్మోనెల్లా బ్యాక్టీరియా కారణంగా ఏర్పడుతుంది. ఈ బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లిన తర్వాత తీవ్రమైన విరేచనాలు, కడుపునొప్పికి కారణం అవుతుంది. దీనిని గ్యాస్ట్రోఎంటెరిటిస్ అని కూడా పిలుస్తారు. కాస్మోనెల్లా రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుని అనారోగ్యానికి గురి చేస్తుంది. పేగు కణాల మీద దాటి చేసి నాశనం చేస్తుంది. శరీరానికి అవసరమైన నీటిని తీసుకోకుండా అడ్డుకుంటుంది. కడుపులో తిమ్మిరికి కారణం అవుతుంది. శరీరంలోని నీటిని విరేచనాలు, వాంతులు రూపంలో బయటికి వెళ్లేలా చేస్తుంది. గత ఏడాది దేశంలో 11, 269 సాల్మోనెల్లా పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయి.
సాల్మొనెల్లా పాయిజనింగ్ లక్షణాలు
సాల్మోనెల్లా సోకవడం వల్ల వాంతులు విరోచాణాలతో పాటు పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం..
⦿ మలంలో రక్తం
⦿ అధిక జ్వరం
⦿ కడుపులో తిమ్మిరి
⦿ వికారం
⦿ తీవ్రమైన తలనొప్పి
⦿ ఆకలి లేకపోవడం
సాల్మొనెల్లా పాయిజనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఎవరి మీద ఉంటుంది?
సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఎవరి శరీరంలోకైనా ప్రవేశించే అవకాశం ఉంటుంది. వయస్సు, లైఫ్ స్టైల్, అనారోగ్య పరిస్థితులను బట్టి ఈ బ్యాక్టీరియా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులు ఉంటే సాల్మోనెల్లా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.
⦿ కోళ్లు, బాతులు లాంటి హై రిస్క్ ఉన్న జంతువులను చుట్టూ నివసించడం వల్ల సాల్మోనెల్లా ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది.
⦿ తరచుగా యాంటాసిడ్లు, యాంటీబయాటిక్స్ తీసుకునే వారిలోనూ సాల్మోనెల్లా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది.
⦿ జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారిలో ఈ బ్యాక్టీరియా ఎక్కువ ముప్పు కలిగించే అవకాశం ఉంటుంది.
⦿ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారి మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది.
⦿ సికిల్ సెల్ వ్యాధి ఉన్నవారిలో సాల్మోనెల్లా ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
Read Also: నాన్ వెజ్ తినే రాష్ట్రాల్లో అదే టాప్.. ఏపీ, తెలంగాణ ఏ ప్లేస్ లో ఉన్నాయో తెలుసా?