Sea water: సముద్రంలో చిక్కుకున్నప్పుడు లేదా అత్యవసర సమయాల్లో సముద్రపు నీళ్లు తాగాలనిపిస్తుంది. కానీ, ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్రపు నీటిలో ఉండే ఉప్పు మన శరీరానికి హాని చేసి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, కొన్నిసార్లు ప్రాణాంతకమైన పరిస్థితులకు దారి తీస్తుంది. సముద్రానికి దగ్గర్లో ఉండేవాళ్ళు ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
సముద్రపు నీళ్లు ఎందుకు హానికరం?
సముద్రంలో 3.5% ఉప్పు ఉండడం వల్ల దీనిని మన శరీరం జీర్ణించుకోలేదు. ఈ నీరు తాగితే నీటి, ఎలక్ట్రోలైట్ సమతుల్యత చెడిపోవడమే కాకుండా రక్తంలో సోడియం స్థాయిలను పెంచి ప్రమాదకర సమస్యలకు దారి తీస్తుందని వైద్యుల హెచ్చరిక.
డీహైడ్రేషన్: సముద్రపు నీళ్లు తాగడం వల్ల మన కిడ్నీలు శరీరంలో చేరిన ఉప్పును బయటకు పంపడానికి ఎక్కువ నీటిని వాడడం వల్ల మన శరీరంలో నీరు ఇంకా త్వరగా ఎండిపోతుంది. దీనివల్ల శరీర కణాల నుంచి కూడా నీరు తీసుకోబడుతుంది.
కిడ్నీ సమస్యలు: ఎక్కువ ఉప్పును తట్టుకోలేని కిడ్నీలు ఒత్తిడికి గురై దీర్ఘ కాలంలో అవి పాడవ్వచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మెదడు సమస్యలు: సోడియం ఎక్కువైతే గందరగోళం, మూర్ఛలు కొన్ని సార్లు కోమా లేదా మరణం కూడా సంభవించవచ్చు.
కడుపులో అసౌకర్యం: సముద్రపు నీళ్లు తాగితే వాంతులు, డయేరియా వంటివి వచ్చి శరీరంలోని నీటిని మరింత తగ్గిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పూర్వకాలంలో ఓడలు మునిగిన సందర్భాల్లో చాలా మంది సముద్రపు నీళ్లు తాగి చెడిపోవడం వంటి సమస్యలతో చనిపోయారని చరిత్ర చెబుతుంది.
ప్రమాదాన్ని ఎలా తప్పించుకోవాలి:
సముద్రం దగ్గర ఉండేవాళ్ళు సురక్షితంగా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం.
బోటింగ్ , చేపలు పట్టడానికి వెళ్లే వాళ్ళు రోజుకు కనీసం 4 లీటర్ల తాజా నీటిని తీసుకుని వెళ్ళాలి.
పొరపాటున సముద్రపు నీళ్ల్లు తాగేస్తే ఎం చేయాలి?
పొరపాటున సముద్రపు నీళ్లు తాగిన వాళ్ళు వెంటనే ఉప్పు శరీరంలోకి చేరుకోకుండా వెంటనే ఆ నీటిని తాగడం ఆపేయాలి.
తాజా నీరు దొరికితే కొంచెం కొంచెం మోతాదులో తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం షాక్‌కు గురవుతుంది.