Sheet Mask Benefits: వేసవి కాలంలో తీవ్రమైన సూర్యకాంతి, చెమట, దుమ్ము, ధూళి మన చర్మానికి ఎక్కువ నష్టం కలిగిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో.. చర్మానికి చల్లదనం, తేమ, పోషణను అందించడానికి షీట్ మాస్క్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వాడటం కూడా చాలా సులభం. అంతే కాకుండా ఇది మీ అలసిపోయిన చర్మానికి తక్షణ శక్తిని కూడా అందిస్తుంది. చర్మాన్ని తెల్లగా మెరిసేలా కూడా చేస్తుంది. షీట్ మాస్క్‌ల వల్ల కలిగే ప్రయోజనాలు గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫేస్ షీట్ వల్ల కలిగే ప్రయోజనాలు :
చర్మానికి తక్షణ హైడ్రేషన్ అందిస్తుంది:
చర్మం డీహైడ్రేషన్ గరైనప్పుడు ముఖం నీరసంగా కనిపిస్తుంది. షీట్ మాస్క్‌లో ఉండే సీరం చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి తేమను అందిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని తక్షణమే హైడ్రేట్ చేసి మెరుస్తూ కనిపించేలా చేస్తుంది.
చర్మానికి చల్లదనం, ఉపశమనం:
ఎండ నుండి తిరిగి వచ్చిన తర్వాత చర్మం చికాకుగా అనిపిస్తున్నప్పుడు కోల్డ్ షీట్ మాస్క్ వేసుకోవడం వల్ల తక్షణమే ముఖానికి చల్లదనం లభిస్తుంది. ఇది చర్మాన్ని ప్రశాంతపరుస్తుంది. అంతే కాకుండా చికాకును తగ్గిస్తుంది.
పోషకాలు సమృద్ధిగా ఉంటాయి:
షీట్ మాస్క్‌లలో చర్మానికి పోషణనిచ్చే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి చర్మంపై వచ్చే ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
టానింగ్ , వడదెబ్బ నుండి ఉపశమనం:
ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల చర్మంపై టానింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కొన్ని షీట్ మాస్క్‌లు చర్మాన్ని ప్రశాంతపరిచే , టాన్‌ను తొలగించడంలో సహాయపడే పదార్థాలను కలిగి ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో వీటిని వాడటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
చర్మాన్ని ప్రకాశవంతంగా, తాజాగా చేస్తుంది:
వేసవిలో చర్మం తరచుగా నిస్తేజంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. షీట్ మాస్క్ చర్మానికి తాజాదనాన్ని , మెరుపును తెస్తుంది. అంతే కాకుండా ఇది ముఖాన్ని పూర్తిగా తాజాగా కనిపించేలా చేస్తుంది.
జిడ్డు చర్మాన్ని సమతుల్యం చేయడం:
జిడ్డు చర్మం ఉన్నవారు వేసవిలో సమతుల్యతను కాపాడుకోవడం కష్టం. షీట్ మాస్క్‌లు చర్మాన్ని తేమగా ఉంచుతూ అదనపు నూనెను నియంత్రిస్తాయి. అంతే కాకుండా చర్మాన్ని సమతుల్యంగా ఉంచుతాయి.
మొటిమల నుండి ఉపశమనం:
వేసవిలో చెమట, దుమ్ము కారణంగా మొటిమలు పెరుగుతాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగిన షీట్ మాస్క్‌లు మొటిమలను తగ్గించి చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా దీనిని తరచుగా వాడటం వల్ల కూడా ముఖంపై మొటిమలు కూడా రాకుండా ఉంటాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
Also Read: ఈ ఒక్కటి అప్లై చేస్తే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
సమయం ఆదా , ఉపయోగించడం సులభం:
వేసవిలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. అందుకే షీట్ మాస్క్‌లను 15-20 నిమిషాలు మాత్రమే అప్లై చేయాలి. దీని కోసం ఎటువంటి హడావిడి చేయాల్సిన అవసరం కూడా ఉండదు. తక్కువ సమయంలోనే దీనిని ముఖానికి ఉపయోగించవచ్చు.
వేసవిలో మీకోసం కొంత సమయం కేటాయించడం ముఖ్యం. షీట్ మాస్క్ వేసుకోవడం ద్వారా.. మీరు మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా మిమ్మల్ని మీరు రిలాక్స్‌గా కూడా చేసుకోవచ్చు.
Also Read: ముఖం తెల్లగా మెరిసిపోవాలా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే!