Perfume On Skin: అకేషన్ ఏదైనా పర్ఫ్యూమ్ వాడే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి రోజు పర్ఫ్యూమ్ వాడే వారు కూడా ఉంటారు. ముఖ్యంగా సమ్మర్ లో చెమట ఎక్కువగా వస్తుంది. దీనివల్ల శరీరం నుండి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. పెర్ఫ్యూమ్ ఈ వాసనను తొలగిస్తుంది.
చర్మంపై పెర్ఫ్యూమ్ పూస్తే.. దాని సువాసన ఎక్కువసేపు ఉంటుందని నమ్ముతారు. అందుకే చాలా మంది మణికట్టు లేదా మెడపై పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తారు. కానీ, చర్మంపై పెర్ఫ్యూమ్ స్ప్రే చేయడం ప్రమాదకరం. చర్మంపై పెర్ఫ్యూమ్ పూయడం వల్ల కలిగే నష్టాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మంపై పెర్ఫ్యూమ్ వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు :
అలెర్జీ వచ్చే అవకాశం:
చర్మంపై పెర్ఫ్యూమ్ రాసుకుంటే.. అందులో ఉండే రసాయనాలు చర్మపు దద్దుర్లు, దురద, ఎర్రటి మచ్చలు లేదా చికాకును కలిగిస్తాయి. కొన్నిసార్లు చౌకైన పెర్ఫ్యూమ్‌ల కారణంగా.. సమస్య చాలా తీవ్రంగా మారుతుంది. ఇలాంటి సమయంలో తప్పకుండా డాక్టర్లను సంప్రదించాలి. వీలైనంత వరకు చర్మంపై పెర్ఫ్యూమ్ రాసుకోవడం మానుకోండి.
డార్క్ స్పాట్స్ :
సాధారణంగా మనం రెడీ అయిన తర్వాతే పెర్ఫ్యూమ్ వేసుకుంటాము. ఇలాంటి పరిస్థితిలో.. మీరు మీ చర్మంపై పెర్ఫ్యూమ్ రాసుకుని వెంటనే బయటకు వెళితే.. ఫోటోసెన్సిటివ్ రియాక్షన్ ప్రమాదం ఉంటుంది. దీని కారణంగా.. చర్మంపై డార్క్ స్పాట్స్ కనిపించవచ్చు. పిగ్మెంటేషన్ కారణంగా మీ లుక్ కూడా చెడిపోవచ్చు. కాబట్టి.. మీరు చర్మంపై పెర్ఫ్యూమ్ రాసుకుంటే వెంటనే బయటకు వెళ్లకండి.
చర్మం పొడిబారడం పెరుగుతుంది:
తరచుగా మనం చర్మంపై పెర్ఫ్యూమ్ స్ప్రే చేసినప్పుడు ఆల్కహాల్ ఆధారిత పెర్ఫ్యూమ్ చర్మం నుండి సహజ తేమను బయటకు తీస్తుంది. దీని కారణంగా చర్మం పొడిగా మారుతుంది. అంతే కాకుండా చర్మం చాలా నిస్తేజంగా మారుతుంది. కాబట్టి.. చర్మంపై పెర్ఫ్యూమ్ పూయడం మానుకోండి.
చర్మంపై చికాకు ఉంటుంది:
చాలా మంది మెడ లేదా మణికట్టుపై పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో.. ఒకే చోట పదే పదే పెర్ఫ్యూమ్ స్ప్రే చేయడం వల్ల చర్మం ఎర్రగా, సున్నితంగా మారుతుంది. ఇది చికాకు లేదా మంటను కలిగిస్తుంది. కాబట్టి.. ప్రతిరోజూ ఒకే చోట చర్మంపై పెర్ఫ్యూమ్ పూయకుండా ఉండండి.
Also Read: ముక్కుపై బ్లాక్ హెడ్స్ తగ్గాలంటే ? ఈ టిప్స్ ట్రై చేయండి
వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి:
చౌకైన పెర్ఫ్యూమ్స్‌లో చర్మ కణాలను దెబ్బతీసే రసాయనాలు ఉంటాయి. ఈ మూలకాలు చిన్న వయస్సులో ముడతలు రావడానికి కారణం అవుతాయి. అందుకే వీటిని వాడటం వీలైనంత వరకు తగ్గించడం చాలా మంచిది.