BigTV English

Side Effects Of Ice Cream: నైట్ టైమ్‌లో ఐస్‌క్రీం తింటున్నారా ? అయితే ఈ సమస్యలు ఖాయం !

Side Effects Of Ice Cream: నైట్ టైమ్‌లో ఐస్‌క్రీం తింటున్నారా ? అయితే ఈ సమస్యలు ఖాయం !

Side Effects Of Ice Cream: ఐస్ క్రీం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా ఐస్ క్రీం తింటూ ఉంటారు. ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్, పుట్టినరోజు వేడుకలు జరిగితే తప్పకుండా ఐస్ క్రీం ఉండాల్సిందే. ఇదిలా ఉంటే కొంతమందికి రాత్రిపూట ఐస్ క్రీం తినడం అలవాటు ఉంటుంది. భోజనం చేసిన తర్వాత ఒక ఐస్ క్రీం తిని పడుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట ఐస్ క్రీం తినడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


నిద్ర నాణ్యత తగ్గుతుంది:
ఐస్ క్రీంలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. దీనిని రాత్రి పూట తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. ఫలితంగా నిద్ర నాణ్యత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
బరువు పెరుగుతారు:
ఐస్ క్రీంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. మీరు రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఐస్‌క్రీం ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. 2020 లో అప్‌ఫెట్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం రాత్రిపూట ఐస్ క్రీం తినడం వల్ల నిద్ర నాణ్యత తగ్గడంతో పాటు బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పరిశోధన అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. నైట్ ఐస్ క్రీం తినడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుందని అంతేకాకుండా బరువు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

జీర్ణ సమస్యలు:
రాత్రిపూట ఐస్ క్రీం తీసుకోవడం వల్ల కొంతమందిలో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
దంత సమస్యలు:
ఐస్ క్రీం లో చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల దంత సమస్యలు వస్తాయి. నైట్ ఐస్ క్రీం తినడం వల్ల దంతక్షయానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకూ రాత్రిపూట ఐస్ క్రీం తినకుండా ఉండడం మంచిది.
మధుమేహం:
ఇన్సులిన్ హార్మోన్ మనిషి శరీరంలో లేదా రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఆరోగ్యవంతులు ఆహారం తీసుకున్నప్పుడు ఎక్కువగా తీసుకోవడం వల్ల తక్కువగా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రమంగా ఉత్పత్తి కాని పక్షంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహానికి ఇది దారితీస్తుంది. ఐస్ క్రీంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. నైట్ టైమ్‌లో ఐస్ క్రీం తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.


Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×