Mumbai rains news today(Live tv news telugu): ముంబైని వరుణుడు షేక్ చేశాడు. ఆదివారం అర్థరాత్రి తరువాత నుంచి సోమవారం ఉదయం ఏడు గంటలవరకు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకధాటిగా వర్షం కురవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమ్యాయి. జనజీవనం అస్తవస్త్యంగా మారింది.
కేవలం ఆరు గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోవండీ ప్రాంతంలో అత్యధికంగా 3.15 సెం.మీ, పోవాయ్‌లో 3.14 సెం.మీ వర్షపాతం నమోదైంది. ముంబై వాసులు ఎక్కువగా వినియోగించే సబర్బన్ రైళ్లకు బ్రేక్ పడింది. సెంట్రల్ రైల్వే పరిధిలోని చాలా రైళ్లు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పట్టాలపై వర్షపు నీరు నిలిచిపోయింది.
నగరంలో భారీ వర్షం కురవడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 50కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. పలు విమానయాన సంస్థలు సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులను అలర్ట్ చేశాయి. అటు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం అందరికీ సెలవు ప్రకటించింది.
#WeatherUpdate: Due to bad weather (heavy rain) in Mumbai (BOM), all departures/arrivals and their consequential flights may get affected. Passengers are requested to keep a check on their flight status via https://t.co/VkU7yLjZly.
— SpiceJet (@flyspicejet) July 8, 2024
#6ETravelAdvisory: Due to weather and subsequent air traffic congestion, flights to/from #Mumbai are impacted. Do keep a tab on your flight status at https://t.co/CjwsVzFov0. To explore alternate flights or request a full refund, visit https://t.co/ucmaFEO80X. https://t.co/QOMwUyHZZ7
— IndiGo (@IndiGo6E) July 7, 2024
ముంబైలోని కుర్లా,ఘట్‌కోపర్ ప్రాంతాలలో అలాగే రాష్ట్రంలోని థానే, వసాయి (పాల్ఘర్), మహద్ (రాయ్‌గడ్), చిప్లున్ (రత్నగిరి), కొల్హాపూర్, సాంగ్లీ, సతారా, సింధుదుర్గ్‌లతో సహా ఇతర ప్రాంతాలలో జాతీయ విపత్తు బృందాలను మోహరించినట్లు అధికారులు స్పష్టం చేశారు.