BigTV English

Singapore open 2024 sindhu won: సింగపూర్ ఓపెన్, సింధు శుభారంభం

Singapore open 2024 sindhu won: సింగపూర్ ఓపెన్,  సింధు శుభారంభం

Singapore open 2024 sindhu won(Sports news headlines): సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో భారత షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. మహిళల సింగల్స్ విభాగంలో పీవీ సింధు.. డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ హోజ్‌మార్క్‌పై సునాయాశంగా విజయం సాధించింది.


బుధవారం మధ్యాహ్నం వీరిద్దరి మధ్య మ్యాచ్ మొదలైంది. తొలిసెట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది సింధు. సెకండ్ సెట్లో ప్రత్యర్థి హోజ్‌మార్క్‌ పుంజుకుంది. కానీ పీవీ సింధు అనుభవం ముందు ఆమె తలవంచింది.

ఫస్టాప్ దూకుడుగా ఆడిన సింధు, ఆ తర్వాత స్లో అయ్యింది. ఈలోగా ప్రత్యర్థి హోజ్‌మార్క్‌ పుంజుకోవడం తో ఆమె సర్వీస్‌ను డౌన్ చేసింది. చివరలో ఆమెకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో రెండు సెట్లను 21-12, 22-20 తేడాతో గెలిచి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది పీవీ సింధు.


ALSO READ: ఆ రోజులు తలచుకుంటే.. ఇప్పటికీ భయమేస్తుంది : పంత్

పురుషుల సింగల్స్ విభాగంలో ఇండియా ఆటగాడు లక్ష్యసేన్‌కు చుక్కెదురైంది.  డెన్మార్క్ ప్లేయర్ ఆక్సెల్సెన్‌తో నువ్వానేనా అన్నరీతిలో పోరు సాగింది. తొలిసెట్ పొగొట్టుకున్న సేన్, రెండో సెట్‌లో మాత్రం ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఆది నుంచి దూకుడుగా ఆడాడు. దీంతో మూడో సెట్ ఇరువురు ఆటగాళ్ల మధ్య పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. ఫస్టాప్ ఆధిక్యంలోకి దూసుకెళ్లిన ఆక్సెల్సెన్, చివరి వరకు అదే కంటిన్యూ చేశాడు. దీంతో 21-13, 16-21, 21-13 తేడాతో ఓటమిపాలయ్యాడు.

 

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×