BigTV English

IND vs Pak: భారత్ గెలవాలని వారణాసిలో పూజలు… ఇక పాక్ చిత్తు చిత్తే !

IND vs Pak: భారత్ గెలవాలని వారణాసిలో పూజలు… ఇక పాక్ చిత్తు చిత్తే !

IND vs Pak: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా నేడు భారత్ – పాకిస్తాన్ పోరుకు సర్వం సిద్ధమైంది. దేశం మొత్తం క్రికెట్ ఫీవర్ తో ఊగిపోతుంది. ఎటు చూసినా టీమిండియా గెలవాలన్న నినాదమే వినిపిస్తోంది. టీమ్ ఇండియాకు ఎదురులేదని అభిమానులు ఢంకా భజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ లో భారత్ – పాకిస్తాన్ అమీతుమీ తెల్చుకోబోతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అవుతుంది.


 

ఈ మ్యాచ్ కోసం యావత్ భారతదేశం కళ్ళకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఎలాగైనా గెలవాలని అభిమానులు తమ ఇష్టదైవాలకు ప్రార్ధనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రజలు అనునిత్యం టచ్ లో ఉండే సోషల్ మీడియా టీమిండియా నామస్మరణతో మార్మోగుతుంది. ఏ ఫ్లాట్ ఫార్మ్ లో చూసినా టీమిండియాను ఉత్తేజపరిచే పోస్ట్ లే దర్శనమిస్తున్నాయి.


140 కోట్లకు పైగా భారతీయులు ఈ మ్యాచ్ లో విజయం భారత్ దే అని ధీమాగా ఉన్నారు. భారత ఆటగాళ్లు సైతం ఈసారి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక టీమ్ ఇండియా గెలవాలి అంటూ ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పలువురు పూజలు నిర్వహిస్తున్నారు. పోస్టర్లు, క్రికెట్ సామాగ్రిని పక్కన పెట్టుకొని యజ్ఞం చేశారు. పలు రాష్ట్రాలలోనూ ఇలాగే పూజలు చేస్తున్నారు. మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్ లో.. పాకిస్తాన్ పై భారత్ గెలవాలని నది ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దీంతో ఈ పూజకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ మ్యాచ్ పాకిస్తాన్ కి అత్యంత కీలకం. ఎందుకంటే పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సెమిస్ ఆశల్ని సజీవం చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు కసితో ఉంది. అలాగే భారత జట్టు కూడా ఈ మ్యాచ్ లో గెలవాలని పట్టుదలతో ఉంది. గత చాంపియన్ ట్రోఫీ 2017 ఫైనల్ లో పాకిస్తాన్ పై ఎదురైన ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని భావిస్తోంది భారత జట్టు.

 

అలాగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో సెమిస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. ఇక భారత ఓపెనర్ గిల్ అరివీర భయంకర ఫామ్ లో ఉన్నాడు. అలాగే రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, కె ఎల్ రాహుల్ సత్తా చాటుతున్నారు. మరోవైపు బౌలింగ్ లో మహమ్మద్ షమీ.. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత్ గెలుపుకు ఎటువంటి డోఖా అవసరం లేదని కామెంట్స్ చేస్తున్నారు భారత క్రీడాభిమానులు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ కి టీమ్ ఇండియా ఫైనల్ లెవెన్ లో ఎవరుంటారనే చర్చ మొదలైంది. బంగ్లాదేశ్ తో ఆడిన జట్టునే మళ్లీ కొనసాగిస్తారని విశ్లేషకులు అంటున్నారు. కానీ కుల్దీప్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని, హర్షిత్ రానా స్థానంలో యార్కర్ల స్పెషలిస్ట్ అర్షదీప్ ని తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related News

IND VS PAK Women: వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాక్ మ‌రో ఘోర ఓట‌మి.. టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sahibzada Farhan Bat: వీడికి ఇంకా బుద్ధి రాలేదు.. AK 47 బ్యాట్స్ తో ఇండియన్ గెలుకుతున్న పాక్ క్రికెటర్ !

IND VS PAK Women: అర్ధాంతరంగా ఆగిపోయిన పాకిస్తాన్ మ్యాచ్..స్ప్రే కొట్టిన కెప్టెన్ స‌నా

Liam Livingstone: పెళ్లి చేసుకున్న ఆర్సీబీ డేంజ‌ర్ ప్లేయ‌ర్ లివింగ్‌స్టన్..ఫోటోలు వైర‌ల్

IND VS PAK Toss: టీమిండియాకు అన్యాయం.. టాస్ ఫిక్సింగ్ చేసిన పాక్, అంపైర్ తో క‌లిసి !

Krishnamachari Srikkanth: ఈ ద‌ద్ద‌మ్మ‌ల‌తో పోతే 2027 WC గెలవడం మర్చిపోవాల్సిందే..! గంభీర్ ఇజ్జత్ పాయే

IND VS PAK Women: టాస్ ఓడిన భారత్… షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానం.. నేలకు ముఖం వేసుకొని వెళ్లిపోయిన పాక్ కెప్టెన్

Harshit Rana: సిరాజ్ కంటే హర్షిత్ రాణా పోటుగాడా…ఆ పాచీ ముఖానికి కెప్టెన్సీ కూడా ఇచ్చి త‌గ‌లెట్టండి

Big Stories

×