BigTV English

Headphones: హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా.. ? అయితే చెవుడు గ్యారంటీ !

Headphones: హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా.. ? అయితే చెవుడు గ్యారంటీ !

Headphones: ఈ రోజుల్లో హెడ్‌ఫోన్‌ల వాడకం చాలా వరకు పెరిగింది. ఆఫీసులో పని చేస్తున్నా, సాంగ్స్ వింటున్నా లేదా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నా ఎక్కువ మంది హెడ్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. కానీ హెడ్‌ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ వినికిడి శక్తి దెబ్బతింటుందని మీకు తెలుసా ? ఎక్కువసేపు హెడ్‌ ఫోన్‌లను ఫుల్ వాల్యూమ్‌లో ఉపయోగించడం వల్ల వినికిడి సామర్థ్యం క్రమంగా బలహీనపడుతుంది. అంతే కాకుండా శాశ్వతంగా చెవుడు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.


హెడ్‌ఫోన్‌ వాడటం వల్ల కలిగే నష్టాలు :

ఓ అధ్యయనం ప్రకారం, దాదాపు 65% మంది ఇయర్‌ బడ్స్,  లేదా హెడ్‌ఫోన్‌ల ద్వారా సాంగ్స్, పాడ్‌ కాస్ట్‌లు లేదా మరేదైనా వింటున్నప్పుడు వాల్యూమ్‌ను 85 DB కంటే ఎక్కువగా ఉంచుతున్నారు. ఇది చెవి లోపలి భాగానికి చాలా హానికరం.


ఇయర్‌ ఫోన్‌లు లేదా ఇయర్‌ బడ్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే ధ్వని తరంగాలు మన చెవులను చేరుకుంటాయి. దాని కారణంగా కర్ణభేరి కంపించడం ప్రారంభమవుతుంది. ఈ కంపనం చెవిలోని కోక్లియాకు చేరుకుంటుంది.

కోక్లియా అనేది మానవ చెవి లోపలి భాగంలో ఉన్న ఒక బోలు ముడి ఆకారపు ఎముక. ఇది వినికిడి ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇయర్‌ ఫోన్‌ల నుండి వచ్చే శబ్దం వల్ల వినికిడి కణాలు కూడా దెబ్బతింటాయి. ఇది వినికిడి కణాలకు నష్టం కలిగిస్తుంది. మీరు వాడే వాల్యూమ్‌ దీనిపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ సేపు ఇయర్ బర్డ్స్ సహాయంతో సాంగ్స్ వినడం వల్ల వినికిడి లోపం ఏర్పడుతుంది. అలాగే, చెవి ఇన్ఫెక్షన్ లేదా చెవిటి తనం వస్తుంది. దీనిని మళ్ళీ నయం చేయలేము.

హెడ్‌ ఫోన్‌లను అతిగా వాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎక్కువసేపు హెడ్‌ఫోన్‌లను అధిక వాల్యూమ్‌లో ఉపయోగించడం వల్ల తలనొప్పి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

వినికిడి సామర్థ్యం తగ్గడం:
చాలా ఎక్కువ సౌండ్ తో సాంగ్స్ వినడం వల్ల చెవుల లోపల ఉండే సున్నితమైన కణాలు ప్రభావితమవుతాయి. ఇది క్రమంగా వినికిడి సామర్థ్యాన్ని బలహీన పరుస్తుంది. ఇలా ఎక్కువసేపు వాడటం వల్ల ఒక వ్యక్తి చెవిటివాడు కూడా కావచ్చు.

టిన్నిటస్ సమస్య:
నిరంతరం ఎక్కువ వాల్యూమ్‌లో హెడ్ ఫోన్స్ వాడటం వల్ల చెవుల్లో రింగింగ్ లేదా ఈల శబ్దం వస్తుంది. దీనిని టిన్నిటస్ అంటారు. ఈ పరిస్థితి తాత్కాలికమే కావచ్చు.. కానీ ఇది ఎక్కువ కాలం కొనసాగితే, శాశ్వత సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంటుంది.

చెవి నొప్పి:

ఎక్కువసేపు హెడ్‌ ఫోన్‌లను ఉపయోగించడం వల్ల చెవి నొప్పి వస్తుంది. ఇది కాకుండా, హెడ్‌ ఫోన్‌లను శుభ్రంగా ఉంచకపోతే, చెవి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.

మైగ్రేన్, తలనొప్పి:

హెడ్‌ ఫోన్‌లను అధిక వాల్యూమ్‌తో ఉపయోగించడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. అంతే కాకుండా ఇది తలనొప్పి, మైగ్రేన్‌కు కారణమవుతుంది.

ఎంత సమయం హెడ్ ఫోన్స్ వాడాలి ?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, హెడ్‌ ఫోన్‌లను ఉపయోగించడానికి 60/60 నియమాన్ని పాటించాలి.

60 నిమిషాల కంటే ఎక్కువసేపు హెడ్‌ ఫోన్‌లను ఉపయోగించకూడదు.

వాల్యూమ్ స్థాయిని 60 శాతం కంటే ఎక్కువగా ఉంచకూడదు.

ఎక్కువసేపు హెడ్‌ ఫోన్‌లను ఉపయోగించాల్సి వస్తే, మధ్యలో విరామం తీసుకొని మీ చెవులకు కొంత సమయం విశ్రాంతి ఇవ్వండి.

Also Read: ఇలా చేస్తే.. ఇంట్లో ఒక్క బొద్దింక కూడా ఉండదు !

సరైన హెడ్‌ఫోన్‌ను ఎలా ఎంచుకోవాలి ?

నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న హెడ్‌ ఫోన్‌లను ఎంచుకోండి: ఈ హెడ్‌ ఫోన్‌లు బయట నుండి వచ్చే శబ్దాన్ని తగ్గిస్తాయి. తక్కువ వాల్యూమ్‌లలో కూడా స్పష్టమైన ధ్వనిని అందిస్తాయి.

హెడ్‌ ఫోన్‌లను ఇలా ఎంచుకోండి: చెవిలో పెట్టుకునే హెడ్‌ ఫోన్‌లు చెవులపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. వీటిని ఎక్కువ సమయం ఉపయోగించడానికి కూడా అనుకూలంగా ఉంటాయి.

Related News

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Big Stories

×