E-Paper
Advertisement

Personal Skills: మీ నుంచి ఎవరూ దొంగలించలేని నిజమైన సంపద ఏమిటో తెలుసా?

Personal Skills: మీ నుంచి ఎవరూ దొంగలించలేని నిజమైన సంపద ఏమిటో తెలుసా?
Advertisement

Personal Skills: మన జీవితంలో డబ్బు, ఆస్తి, హోదా.. ఇవన్నీ ఒకరోజు ఉండొచ్చు, ఇంకోరోజు ఉండకపోవచ్చు. ఎందుకంటే.. కాలం మారితే పరిస్థితులు కూడా మారిపోతాయి. కానీ అవి మన చేతుల్లో ఉండవు. కానీ మనలో ఉన్న కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఎవరూ వాటిని మన నుంచి లాక్కోలేరు కూడా. అవే మన నిజమైన బలం, మనల్ని నిరంతరం కాపాడే  రక్షణ కవచం. ఆ అమూల్యమైన నైపుణ్యాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శారీరక శ్రమ:

రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యమూ బలపడుతుంది. వ్యాయామం అనేది క్రమశిక్షణను అలవాటు చేస్తుంది. మన రోజూవారి జీవనశైలిని మెరుగుపరుస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మీ జీవిత కాలంలో 7 ఏళ్ల ఆయుష్షు పెరుగుతుంది.

ఆలోచనా విధానం:

Advertisement

మీ ఆలోచనా విధానమే మీ వ్యక్తిత్వాన్ని స్పష్టంగా చూపిస్తుంది. దీంతోపాటు సవాళ్లను భయపడకుండా స్వీకరించే మనస్తత్వం పెంపొందించుకోవాలి. ఏ విషయం గురించి అయినా సరే ధైర్యంగా ఆలోచించడం విజయానికి దారి చూపుతుంది. మానసిక స్థైర్యమే ప్రతి సమస్యకు పరిష్కారం అని బలంగా నమ్మాలి.

నిశ్శబ్దమే నిజమైన బలం:

జీవితంలో ఎంతటి ఒత్తిడి ఉన్నా.. ప్రశాంతంగా ఉండగలగడం గొప్ప లక్షణం. ఎలాంటి భావోద్వేగాల పైనైనా పట్టు సాధించడమే నాయకత్వానికి పునాది. ఏ విషయంలో అయినా ఆవేశాన్ని కాదు.. ఆలోచనను ముందుకు నడపాలి. అప్పుడే నిజమైన నాయకులుగా ముందుకు సాగుతారు.

నిరంతర నేర్చుకోవడం:

Advertisement

జ్ఞానం సంపాదించాలంటే నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి. ఏ పని చేసినా ఇవి భవిష్యత్తులో ఉపయోగపడుతుందా, లేదా? అని ఆలోచించడం ఎంతైనా అవసరం. దీంతోపాటు కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే కాలానికి తగ్గట్టు నీ ఎదుగుదలలోనూ మార్పులు వస్తాయి.

జీవిత దిశను మార్చే అలవాట్లు:

మన వ్యక్తిత్వంతో పాటు మంచి అలవాట్లే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. పనిపై దృష్టి పెరిగితే ప్రొడక్టివిటీ సహజంగా పెరుగుతుంది. సమాజంలో గౌరవంగా నిలవడానికి ఇవి తోడ్పడతాయి. రోజువారీ అలవాట్లే భవిష్యత్తును నిర్మిస్తాయి. కాబట్టి.. జీవితంలో మంచి అలవాట్లను అలవర్చుకోవడం చాలా ముఖ్యం.

నియమం, నిబద్ధత:

ఎలాంటి పనినైనా నియమబద్ధంగా, నిబద్ధతతో చేయాలి. మీరు చేసే పని మీద ఉన్న ఇష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అలా కాకుండా ఏదో చేయాలి కదా అని ఉద్యోగం/ పని చేయకూడదు. మీకంటూ లక్ష్యాలలను ఏర్పరచుకోకపోతే ఫలితం శూన్యమే. కష్టపడి చేసే పని ఎప్పుడూ వృథా కాదని గుర్తుంచుకోవాలి.

నిరంతరం కష్టపడేతత్వం:

జీవితంలో నిరంతరం ఏదోఒకటి నేర్చుకోవాలనే తాపత్రయం ఉండటం ఎంతో అవసరవ. కష్టపడాలనే తపన మనల్ని చురుగ్గా ఉంచుతుంది. ఈ లక్షణాలు జీవితాంతం ప్రయోజనం చేకూరుస్తాయి. అలాగే మన అభివృద్ధికి ఆగని ప్రయత్నమే అసలైన రహస్యం.

Related News

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

Big Stories

Advertisement
×