Telugu Woman Accident in UK: ఉద్యోగ రీత్యా లండన్ కు వెళ్లిన హైదరాబాద్ యువతి దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ లోని యువతి బంధువులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం సదరు యువతి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు ఆరాతీస్తున్నారు.
హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్, మారుతి నగర్ కు చెందిన హిమబిందు ఉద్యోగరీత్యా లండన్ కు వెళ్లారు. కాగా ప్రతిరోజు వాకింగ్ చేసే అలవాటు గల హిమబిందు రోజువారి మాదిరిగానే శుక్రవారం కూడా రహదారిపై వాకింగ్ ప్రారంభించారు. ఈ తరుణంలో అదే మార్గం గుండా వస్తున్న ఓ ట్రక్ లారీ హఠాత్తుగా హిమబిందును ఢీకొంది. ఈ ప్రమాదం బాంబర్ బ్రిడ్జి వద్ద జరగగా, తీవ్ర గాయాల పాలైన హిమబిందును స్థానికులు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న హిమబిందు, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also Read: Bandi Sanjay: కేసిఆర్ రెస్ట్.. కేటీఆర్ యాక్టింగ్.. బీఆర్ఎస్ ఖాళీ ఖాయం.. జోస్యం చెప్పిన బండి సంజయ్