Vitamins For Skin: చర్మాన్ని అంతర్గతంగా పోషించడానికి.. అవసరం అయిన పోషకాలను అందించడం చాలా ముఖ్యం. చర్మం యొక్క రకాన్ని బట్టి వారి శరీరం యొక్క పనితీరును నిర్ణయించవచ్చు. చర్మం మీ ఆరోగ్యానికి అద్దం లాగా పని చేస్తుంది. మీరు అనారోగ్యానికి గురైనప్పుడల్లా దాని ప్రభావం చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది.
మనలో కొంత మందికి సహజంగానే మంచి కాంతివంతమైన చర్మం ఉంటుంది. కానీ మరికొందరు మాత్రం అనేక చర్మ సమస్యలతో బాధపడుతుంటారు. మీ చర్మ రకం ఏదైనా పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. పోషకాహారం తీసుకోవడంతో పాటు కొన్ని లైఫ్ స్టైల్ మార్పులతో మీరు మీ చర్మాన్ని ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఇది మిమ్మల్ని యవ్వనంగా, అందంగా కనిపించేలా చేస్తుంది.
1. విటమిన్ ఇ:
విటమిన్ ఇ చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలు ఆరోగ్యకరమైన చర్మానికి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. విటమిన్ E లు వేరుశనగ, బాదం, గోధుమ గింజలు, ఆకుకూరలు , ఆలివ్ ఆయిల్ నుండి లభిస్తుంది.
2. విటమిన్ ఎ:
విటమిన్ ఎ కణాల మరమ్మత్తులో సహాయపడుతుంది. అంతే కాకుండా కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తగ్గిస్తుంది. ఈ విటమిన్ మనకు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు, మొక్కల నుండి వచ్చే కూరగాయల నుండి లభిస్తుంది. ఇది చర్మంపై ముడతలు, గీతలు, వృద్ధాప్యం యొక్క ఇతర సంకేతాలను తగ్గిస్తుంది.
విటమిన్ ఎ యొక్క ప్రధాన వనరులు.. ఆకుకూరలు, గుడ్డు, పాలు, క్యారెట్, గుమ్మడికాయ తేలికపాటి సూర్యకాంతి.
3. విటమిన్ సి:
విటమిన్ సి మీ చర్మాన్ని యవ్వనంగా, మృదువుగా మార్చడంతో సహాయ పడుతుంది. దీంతో పాటు.. ఇది మీ చర్మాన్ని బిగుతుగా కూడా చేస్తుంది. అందుకే మీ చర్మానికి విటమిన్ సి వాడండి. ప్రతిరోజూ మీ ఆహారంలో విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలు చేర్చుకోండి. విటమిన్ సి యొక్క ప్రధాన వనరులు నిమ్మ, నారింజ, సీజనల్ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీ, ఉసిరి, మొలకెత్తిన ధాన్యాలు, జామ , బ్రోకలీ, కాలీఫ్లవర్, టమాటో వంటి కూరగాయలు.
4. విటమిన్ కె:
కళ్ళ కింద నల్లటి వలయాలను తొలగించడంలో విటమిన్ కె సహాయపడుతుంది. ఇది హృదయనాళ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మానికి బాగా అవసరమైన విటమిన్ కూడా. విటమిన్ కె ఎముకలను బలంగా చేస్తుంది. అంతే కాకుండా ,ముఖం కాంతివంతంగా కనిపించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ యొక్క మూలాలు ఆకుకూరలు, కివి, అవకాడో, ద్రాక్ష, మాంసం, టర్నిప్, బ్రోకలీ, క్యాబేజీ, ఆస్పరాగస్, ఆవాలు మొదలైనవి.
Also Read: పొడవాటి జుట్టు కోసం.. వీటిని తప్పకుండా తినాలి ?
రోజుకు మూడు లీటర్ల నీరు, 8 గంటల నిద్ర, వ్యాయామం, యోగా, ధ్యానం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా గ్లోయింగ్ స్కిన్ కోసం తప్పకుండా అవసరం.