BigTV English

Sugarcane Juice: చెరకు రసం ఆ విధంగా తాగడం హానికరం.. ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి

Sugarcane Juice: చెరకు రసం ఆ విధంగా తాగడం హానికరం.. ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి

Sugarcane Juice| వేసవిలో పండ్ల రసాలు తాగడం ఆరోగ్యకరం. ఈ పండ్ల రసాల్లో చాలా మంది చెరకు రసం తాగడానికి ఇష్టపడతారు. చెరకు రసం అంటే షుగర్ కేన్ జ్యూస్ వేసవిలో శరీరానికి చల్లగా ఉంచుతుంది. అంతేకాదు చెరకు రసంలో చాలా పోషకాలు కూడా ఉన్నాయి. ఈ పోషకాలు శరీరంలో నీటి నిల్వలను పెంచి శక్తినిస్తుంది. కానీ చెరకు రసం తాగే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది చెరకు రసం తాగే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. దాని వల్ల అది ఆరోగ్యానికి మేలు చేసే బదులు హాని కలిగిస్తుంది.


చెరకు రసం పిండగానే తాగేయాలి… ఎందుకంటే?
చెరకు నుంచి జ్యూస్ పిండగానే దాన్ని తాగేయాలి. ఎందుకంటే చెరకును పిండగానే దాని రసంలో ఆక్సిడేషన్ ప్రారంభవుతుంది. ఆక్సిడేషన్ అంటే చెరకు జ్యూస్ లో దాని రుచి, కలర్, పోషకాల్లో త్వరగా మార్పు జరుగుతూ ఉంటుంది. అందుకే చెరకు రసం పిండిన వెంటనే తాగేయాలి. చెరకులోని ఎన్‌జైమ్స్, షుగర్ జ్యూస్ గా మారగానే వాతావరణంలోని ఆక్సిజెన్ తో కలిసి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఈ ప్రక్రియని ఆక్సిడేషన్ అంటారు. ఇలా జరిగిన వెంటనే దాని రంగు మారిపోతూ ఉంటుంది.

చెరకు రసం త్వరగా చెడిపోతుంది.. ఎంత సమయంలో తాగేయాలి?
చెరకు రసం పిండిన తరువాత 15 నుంచి 20 నిమిషాల్లో అందులో ఆక్సిడేషన్ జరిగి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అందుకే దాని రంగు మారిపోతుంది. ముఖ్యంగా వేసవిలో అయితే గరిష్టంగా ఒక గంట లోపు అది చెడిపోతుంది. అందుకే చెరకు నుంచి జ్యూస్ చేయగానే వెంటనే తాగేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


షుగర్ కేన్ జ్యూస్‌ని నిలువ ఉంచకూడదు.. ఎందకంటే?
చెరకు రసంలో నేచురల్ షుగర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇందులో బ్యాక్టీరియా త్వరగా చేరే అవకాశం ఉంది. అందుకే ఈ జ్యూస్ ని నిలువ చేస్తే.. అందులో త్వరగా కెమికల్ రియాక్షన్ జరిగి అది విషపూరితంగా మారుతుంది.

Also Read: ఒత్తిడి వల్ల నిద్ర పట్టడం లేదా?.. ఈ టెక్నిక్‌తో నిమిషాల్లో గాఢమైన నిద్ర

చెరకు రసం ఫ్రిజ్ లో పెట్టవచ్చా?
ఒకవేళ చెరకు రసం చేసిన వెంటనే తాగే అవకాశం లేకుంటే దాన్ని ఫ్రిజ్ లో పెట్టవచ్చు. కానీ అందుకు కూడా చాలా తక్కువ సమయం ఉంది. కేవలం 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే ఫ్రిజ్ లో ఉంచాలి. కానీ అప్పటికే దాని రుచి మారిపోతుంది, అందులోని పోషకాలు తగ్గిపోతాయి. అయితే జ్యూస్ లో ఐస్ వేసుకోవచ్చు. దాని వల్ల ఆక్సిడేషన్ ఆలస్యంగా జరుగుతుంది. ఈ జ్యూస్ ని ప్లాస్టిక్ బాటిల్స్ లో నిలువ చేయకూడదు.

చెరకు రసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
కామెర్లు, తీవ్ర అలసట, మూత్రంలో ఇన్‌ఫెక్షన్, డిహైడ్రేషన్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి చెరకు రసం చాలా మంచింది. పైగా ఇది లివర్ ని డిటాక్స్ చేస్తుంది. ఇందులో అల్లం, నిమ్మరసం కలిపితే ఇది మరింత రుచికరంగా మారుతుంది. పైగా చెరకు జ్యూస్ లో ఆక్సిడేషన్ కూడా ఆలస్యంగా జరుగుతుంది.

ఏ టైమ్ లో చెరకు రసం తాగడం ఉత్తమం?
ఉదయం వేళ ఖాళీ కడుపున లేదా మధ్యాహ్నం భోజనానికి ముందు చెరకు రసం తాగితే ఆరోగ్యానికి లాభదాయకం. ఇది శరీరానికి శక్తినిస్తుంది, జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×