Summer Face Packs: వేసవిలో తీవ్రమైన ఎండ, చెమట, కాలుష్యం వివిధ చర్మ సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి మన చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సీజన్‌లో, చర్మాన్ని చల్లబరచడానికి , రిఫ్రెష్ చేయడానికి సహజమైన ,ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ప్యాక్‌లు చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా, సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షణ కల్పించడం ద్వారా ముఖాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడతాయి.
చర్మ రకాన్ని బట్టి వివిధ ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. ఇవి ప్రతి ఒక్కరి చర్మాన్ని చల్లబరచడానికి, పోషించడానికి, మెరుపును ఇవ్వడానికి అనుకూలంగా ఉంటాయి. జిడ్డు చర్మం అయినా, సాధారణ చర్మం అయినా, లేదా పొడి చర్మం అయినా, వేసవిలో ఈ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించడం వల్ల చర్మానికి తాజాదనాన్ని , ప్రశాంతతను ఇస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న సమ్మర్ ఫేస్ ప్యాక్‌లను ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సమ్మర్‌లో తప్పకుండా వాడాల్సిన ఫేస్ ప్యాక్స్:
గంధం , రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ :
వేసవి రోజుల్లో చర్మాన్ని చల్లబరచడానికి , రిఫ్రెష్ చేయడానికి గంధం, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. గంధం చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా రోజ్ వాటర్ చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతే కాకుండా సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షణ అందిస్తుంది.
వాడే విధానం: తగిన మోతాదుల్లో గంధపు పొడి, రోజ్ వాటర్ కలిపి మందపాటి పేస్ట్ లాగా చేసి ముఖానికి అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత కడిగేయండి.
దోసకాయ, టమోటా ఫేస్ ప్యాక్ :
దోసకాయ, టమోటా ఫేస్ ప్యాక్ వేసవిలో జిడ్డుగల చర్మాన్ని చల్లబరచడానికి , అదనపు నూనెను నియంత్రించడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దోసకాయ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. టమోటాలలో ఉండే లైకోపీన్ చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఈ ప్యాక్ చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. మొటిమలను కూడా తగ్గిస్తుంది.
వాడే విధానం: కాస్త దోసకాయ, టమోటా రసం తీసి వాటిని కలిపి ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి.
3. పసుపు, శనగపిండి ఫేస్ ప్యాక్ :
పసుపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వేసవిలో వచ్చే మొటిమలను నయం చేయడంలో సహాయపడతాయి. శనగపిండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఈ ప్యాక్ సాధారణ చర్మానికి అనువైనది. ఎందుకంటే ఇది చర్మాన్ని శుద్ధి చేసి సహజమైన మెరుపును ఇస్తుంది.
వాడే విధానం: పసుపు, శనగపిండిని పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత శుభ్రం చేయండి.
4. వేప, పెరుగు ఫేస్ ప్యాక్ :
వేసవిలో మొటిమలు పెరుగుతాయి. ముఖ్యంగా చర్మంలో నూనె , ధూళి పేరుకుపోయినప్పుడు. వేపలో మొటిమలను తగ్గించడంలో సహాయపడే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. పెరుగు చర్మాన్ని మృదువుగా , హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఈ ప్యాక్ చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా మొటిమల నుండి ఉపశమనం ఇస్తుంది.
వాడే విధానం: : కాస్త వేప పేస్ట్‌లో పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి.
Also Read: కొబ్బరి నీళ్లు తాగితే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు !
5. బంగాళదుంప, తేనె ఫేస్ ప్యాక్ :
వేసవి రోజులో నిర్జీవంగా మారిన చర్మానికి బంగాళదుంప , తేనె ఫేస్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. బంగాళదుంప చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడే బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. తేనె చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా ఈ ప్యాక్ చర్మం కోల్పోయిన మెరుపును తిరిగి తెస్తుంది.
వాడే విధానం: 1 టేబుల్ స్పూన్ బంగాళదుంప రసంలో కాస్త తేనె కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేయండి.