Jagapathi Babu : ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్ గా పేరు తెచ్చుకున్న సీనియర్ హీరో జగపతి బాబు (Jagapathi Babu) ఇప్పుడు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో గతంలో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
లైఫ్ ఛేంజింగ్ మూమెంట్
తాజా ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన ఓ లైఫ్ చేంజింగ్ మూమెంట్ గురించి వెల్లడించారు. “ఎవరైనా పోతున్నప్పుడు లేదా పోయినప్పుడు బాగా ఏడుపొస్తుంది, బాధగా అనిపిస్తుంది అని నమ్ముతాను నేను. కన్నీటికి వ్యాల్యూ చాలా ఎక్కువ. మనోహరం అనే సినిమా చేస్తున్నప్పుడు నేను నా కెరియర్ గురించి ఆలోచనలో పడ్డాను. దాదాపు కళ్లెమ్మట నీళ్లు పెట్టుకుని, షాట్ కోసం లిఫ్ట్ ఎక్కాను.
లిఫ్ట్ లో ఒక ఆవిడ చిన్న పాపను పట్టుకొని కనిపించింది. ఏమైందని అడిగాను. పాపకి క్యాన్సర్… కొన్ని నెలలు బ్రతుకుతుందో లేదో కొన్ని రోజులు బ్రతుకుతుందో కూడా తెలియని పరిస్థితి అని చెప్పిందావిడ. అప్పుడు నాకు బల్బు వెలిగింది. నన్ను నేను తన్నుకుని బుద్ధుందా లేదా నీకు? నీకు అసలు లైఫ్ లో ఏం ప్రాబ్లం ఉంది? ఇదొక ప్రాబ్లమేనా? ఆ పాపకు వచ్చిన ప్రాబ్లంతో కంపేర్ చేస్తే నీది అసలు ప్రాబ్లం కానే కాదు అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను.
ప్రతి ఒక్కరికి అదే చెప్తాను… అందరూ నాకే కష్టం వచ్చింది అని ఫీల్ అవుతారు. ఇంకొకడి లైఫ్ చూసి కష్టాలు ఏంటో తెలుసుకోండి. కొన్ని జీవితాలు కష్టాలను చాలా లోతుగా చూస్తున్నాయి. మనమే కష్టమని ఫీల్ అయితే సర్వైవ్ అవ్వలేము. యూజ్లెస్ అని అర్థం. మామూలుగానే నా మెంటాలిటీ ప్రకారం ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే ఛాలెంజింగ్ గా తీసుకుంటాను. కానీ ఆ అమ్మాయి గురించి తెలిసిన తర్వాత స్పార్క్ అయిపోయింది. నాకు ప్రాబ్లం వస్తే దాన్ని ఎక్స్పీరియన్స్ గా చూస్తాను. బాధ వచ్చినప్పుడు ప్రాబ్లం అనిపిస్తుంది.
ఏదైనా మూవీ హిట్ అయింది అంటే అదొక ఎక్స్పీరియన్స్, ప్లాప్ అయిందంటే అదొక ఎక్స్పీరియన్స్, డబ్బులు అయిపోయాయి, డబ్బులు అర్జెంటుగా కావాలి ఎవరినైనా అడగాల్సిన సిచువేషన్ వస్తే అదొక ఎక్స్పీరియన్స్. అంతే తప్ప జీవితంలో పెద్ద సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను అనుకోను” అంటూ తన లైఫ్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
హీరోయిన్లతో వాకీ టాకీలో…
ఇక ఇదే ఇంటర్వ్యూలో కెమెరా ముందు ఏఏ హీరోయిన్లతో టచ్ లో ఉన్నారు? గతంలో హీరోయిన్లతో వాకీ టాకీలో మాట్లాడేవారట కదా? అనే ప్రశ్నలకు జగపతి బాబు సమాధానం చెప్పారు. “ఓ మగాడు మగాడు మాట్లాడితే నా థింకింగే అతనికి ఉంటుంది. మగాళ్ళ గురించి ఆడాళ్ళకి, ఆడాళ్ళ గురించి మోగాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. నేచురల్ గా ఉండే వారికి దగ్గర అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగని అందరికీ దగ్గర కాలేను. ఇక వాకీ టాకీ విషయానికొస్తే… ఎప్పుడో సెట్ లో నేను, నా మేకప్ మ్యాన్ వాడాము. అది హీరోయిన్ తో జరిగిన సంఘటన కాదు. ఇక రమ్యకృష్ణ (Ramyakrishna), నేను మంచి ఫ్రెండ్స్. సినిమాకు ముందే హీరోయిన్ ఎవరు అని ప్రశ్నించడానికి, నేను దగ్గర అవ్వాలంటే హీరోయినే కానక్కర్లేదు కదా. అలాగంటే త్రిష (Trisha)తో నేనెప్పుడూ కలిసి వర్క్ చేయలేదు. కానీ ఆమె కూడా నాకు మంచి ఫ్రెండ్” అని క్లారిటీ ఇచ్చారు జగపతిబాబు.