Jabardasth Aadi..హైపర్ ఆది (Hyper Aadi) .. అదిరే అభి (Adire Abhi)సహాయంతో జబర్దస్త్ (Jabardast) లోకి అడుగుపెట్టిన ఆది, అక్కడ తన కామెడీతో, పంచ్ డైలాగ్ లతో అందరిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులతో ఆది వేసే పంచ్ లు బాగా పేలేవి. ఇక ఆ కామెడీ తోనే అటు సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకొని, స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు జబర్దస్త్ ఆది. జబర్దస్త్ ద్వారా గుర్తింపు సొంతం చేసుకున్న ఈయన.. శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలకి హోస్ట్ గా వ్యవహరిస్తూ.. భారీగానే క్రేజ్ దక్కించుకున్నారు. ఇకపోతే ఆది తోటి వారంతా వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ఆరంభిస్తుంటే.. ఈయన మాత్రం బ్యాచిలర్ గానే ఉండిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆది ఎప్పుడు వివాహం చేసుకుంటారు అంటూ అభిమానులంతా కూడా తెగ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆది తన లవ్ స్టోరీ మొత్తం చెప్పేసి, పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు.
వారు పెళ్లి చేసుకున్నాకే నా పెళ్లి..
హైపర్ ఆది ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ..” నేను బీటెక్ లో ఒక అమ్మాయిని ప్రేమించాను. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయాము. అయితే ఆ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకొని, పిల్లపాపలతో హాయిగా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి పేరు బయటకు తీసి ఆ అమ్మాయి కాపురంలో నిప్పులు పోయదలుచుకోలేదు” అంటూ తెలిపాడు ఆది. ఇక తర్వాత ఇప్పటివరకు మరే అమ్మాయి ప్రేమలో మీరు పడలేదా? అని ప్రశ్నించగా.. “మరో రెండేళ్ల పాటు నేను వివాహం చేసుకోవాలని అనుకోవట్లేదు. అది కూడా పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటాను.. ఇప్పటివరకు నా లైఫ్ లోకి ఇంకో అమ్మాయిని రానివ్వలేదు” అంటూ క్లారిటీ ఇచ్చారు హైపర్ ఆది. అంతేకాదు తన తోటి నటులైన సుధీర్(Sudheer ), ప్రదీప్ (Pradeep) వివాహం చేసుకున్నాకే, తాను వివాహం చేసుకుంటానని చెప్పి అటు అభిమానులను కూడా ఆశ్చర్యపరిచారు. ఇక ప్రస్తుతం ఆది చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి మరో రెండేళ్లలోనైనా సరే హైపర్ ఆది పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా..? లేక ఈ రెండేళ్లలో మనసు మార్చుకొని.. ఎవరైనా అమ్మాయి నచ్చితే ఆమెను ప్రేమించి ,వివాహం చేసుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే తనకు కొంతమంది అమ్మాయిలని చూసినప్పుడు ఫీలింగ్స్ కలిగినా.. వాటిని కంట్రోల్ చేసుకొని తన కెరియర్ లో సక్సెస్ అవ్వాలనే దిశగా అడుగులు వేశానని, ప్రస్తుతం అందులో భాగంగానే తాను ఈ స్థాయికి చేరుకున్నాను అని కూడా తెలిపారు ఆది.
ALSO READ:Bollywood Actor: 55 ఏళ్ల సినీ కెరియర్ లో ఒకే ఒక్క లిప్ లాక్..!
జబర్దస్త్ కి వారే మెయిన్ పిల్లర్స్..
ఇక ఇదే ఇంటర్వ్యూలో భాగంగా అనసూయ(Anasuya ) , రష్మీ (Rashmi) గురించి మాట్లాడుతూ.. “అనసూయ, రష్మీ ఇద్దరూ కూడా జబర్దస్త్ కి మెయిన్ పిల్లర్స్ లాంటివాళ్ళు.జబర్దస్త్ ఇంకా కొనసాగుతోంది అంటే దానికి కారణం వీళ్లు కూడా..గత తొమ్మిది ,పది సంవత్సరాలుగా జబర్దస్త్ కి హోస్ట్గా వ్యవహరిస్తూ.. షోని మరింత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లడంలో వీరిద్దరి పాత్ర ఉంటుంది. అటు ఇద్దరూ కూడా చాలా స్పోర్టివ్ గా ఏ విషయం అయినా తీసుకొని ముందుకు వెళ్తారు” అంటూ ఆ ఇద్దరి యాంకర్స్ పై కూడా ఆది ప్రశంసలు కురిపించారు.