Pepper and Milk: మన శరీరానికి పాలు చాలా ముఖ్యమైనవి. వీటి ద్వారా మన శరీరానికి అన్ని పోషకాలు లభిస్తాయి. ప్రతి రాత్రి పడుకునే ముందు పాలు తాగడం చాలా మంచిదని చెబుతుంటారు.
నల్ల మిరియాలు, పాలు కలిపి తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా? మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ మిరియాల పాటు చాలా సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి వివిధ వ్యాధులు రాకుండా నివారిస్తాయి. మిరియాల పాల వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల మిరియాలు కలిపిన పాలలో ఉండే పైపెరిన్ మూలకం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా మీరు జలుబు, దగ్గు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను రాకుండా ఉంటాయి.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది:
మిరియాల పాలు జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తాయి. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది అజీర్ణం, గ్యాస్ , ఇతర కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
మిరియాల పాలలో ఉండే పైపెరిన్ మూలకం శరీర జీవక్రియను పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
జలుబు, దగ్గు నుండి ఉపశమనం:
మిరియాల పాలలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గును తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. అంతే కాకుండా శరీరాన్ని లోపలి నుండి వేడి చేయడంతో పాటు కఫాన్ని తగ్గిస్తుంది.
నిర్విషీకరణ:
మిరియాల పాలు శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇది శరీరం డీటాక్స్ చేసి సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.
నిద్రను మెరుగుపరుస్తుంది:
రాత్రి పడుకునే ముందు పాలు నల్ల మిరియాలతో కలిపి తాగడం వల్ల బాగా నిద్రపడుతుంది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ మూలకం మనస్సును ప్రశాంతపరుస్తుంది. అంతే కాకుండా నిద్రను కూడా మెరుగుపరుస్తుంది. నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు మిరియాల పాటు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఎముకలను బలోపేతం చేయడం:
పాలలో ఉండే కాల్షియం, నల్ల మిరియాలలో ఉండే మూలకాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది. అంతే కాకుండా ఎముకల సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
Also Read: బియ్యం పిండిని ఇలా కూడా.. వాడొచ్చు తెలుసా ?
చర్మానికి ప్రయోజనాలు:
నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సౌందర్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇది ముడతలను తగ్గించడంలో , చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తరచుగా మిరియాలు కలిపిన పాలు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది, అంతే కాకుండా ఇవి చర్మ సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది.
నల్ల మిరియాల పాలు రాత్రి పూట తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ,లోపల నుండి బలంగా ఉంచడానికి సహాయపడుతుంది.