BigTV English

High Cholesterol: మహిళల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. కనిపించే లక్షణాలివే !

High Cholesterol: మహిళల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. కనిపించే లక్షణాలివే !

High Cholesterol: ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా అధిక కొలెస్ట్రాల్ సమస్య చాలా మందిలో సర్వసాధారణంగా మారింది. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ లు ఉంటాయి. మొదటిది మంచి కొలెస్ట్రాల్, రెండవది చెడు కొలెస్ట్రాల్. పేరుకు తగ్గట్టుగానే చెడు కొలెస్ట్రాల్ శరీరానికి చాలా హానికరం.


శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు.. అది సిరల్లో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఫలితంగా సిరలు మూసుకుపోతాయి. దీని కారణంగా.. గుండెపోటు, స్ట్రోక్ , కరోనరీ హార్ట్ డిసీజ్‌ల వంటి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలలో కొన్ని మన ముఖంపై కూడా చూడొచ్చు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కళ్ళు:
మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం ప్రారంభించినప్పుడు.. మన కళ్ళు , కనురెప్పల చుట్టూ చిన్న పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. చర్మం కింద కొవ్వు పేరుకుపోవడం వల్ల పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. మీలో కూడా ఇలాంటి లక్షణాలను ఉన్నట్లయితే.. డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.


శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే.. మన ముఖంలోని కొన్ని భాగాలలో చిన్న చిన్న గడ్డలు ఏర్పడటం ప్రారంభిస్తాయి. ఇవి మొటిమల్లా కనిపిస్తాయి. కానీ ఇది పెరిగిన కొలెస్ట్రాల్ యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటి కావచ్చు. కాబట్టి ఈ లక్షణాలను లైట్ తీసుకునే బదులు.. మీరు మీ కొలెస్ట్రాల్ స్థాయిని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ముఖంపై వాపు:
ముఖం మీద వాపుగా అనిపిస్తే.. కొలెస్ట్రాల్ స్థాయిని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు.. చాలా సార్లు మన ముఖం కూడా ఉబ్బుతుంది. నిజానికి, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల ముఖం మీద వాపు వస్తుంది.

Also Read: థైరాయిడ్ ఉన్న వాళ్లు ఏం తినాలి ? ఏం తినకూడదు ?

చర్మం పాలిపోవడం:
ముఖంపై పసుపు రంగు మచ్చలు అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం కావచ్చు. ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు.. రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీని కారణంగా.. చర్మంపై పసుపు రంగు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు అలాంటి లక్షణాలను గమనించినట్లయితే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చెక్ చేయించుకోండి.

పొడిబారడం, దురద:
అధిక కొలెస్ట్రాల్ విషయంలో.. ముఖం పొడిబారడం, దురద సమస్య వంటి సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. నిజానికి.. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చర్మంలో డీహైడ్రేషన్ సంభవించవచ్చు. దీని కారణంగా చర్మం పొడిగా మారుతుంది. మీ చర్మంపై కొంతకాలంగా డై స్కిన్, దురద వంటి సమస్యలు ఎదుర్కుంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×