E-Paper
Advertisement

రెస్టారెంట్ స్టైల్ చికెన్ వేపుడు..ఇలా చేసారంటే టేస్ట్ అదిరిపోద్ది

రెస్టారెంట్ స్టైల్ చికెన్ వేపుడు..ఇలా చేసారంటే టేస్ట్ అదిరిపోద్ది
Advertisement

Telangana style chicken fry recipe: నాన్-వెజ్ లవర్స్‌కు తెలంగాణ వంటకాల రుచే వేరు. అందులోనూ.. నోరూరించే మసాలాలతో చేసే ‘తెలంగాణ రెస్టారెంట్ స్టైల్ చికెన్ వేపుడు’ పేరు వింటేనే. నోట్లో నీళ్లూరుతాయి. పల్లె టూరి ఘాటైన రుచులు, హోటల్ స్టైల్ అరోమాతో తయారయ్యే ఈ చికెన్ ఫ్రై వేడి వేడి అన్నంలోకి, సాంబార్‌తో లేదా రసంతో నంజుకోవడానికి అద్భుతంగా ఉంటుంది. బయట రెస్టారెంట్లకు వెళ్లకుండా.. ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో ఈ స్పెషల్ చికెన్ వేపుడును రుచి కరంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

చికెన్: అర కిలో (శుభ్రంగా కడిగిన ముక్కలు)

Advertisement

ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)

పచ్చిమిర్చి: 4-5 (నిలువుగా చీల్చినవి)

Advertisement

అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2 స్పూన్లు

పసుపు: అర స్పూన్

కారం: 2 స్పూన్లు (రుచికి సరిపడా)

ధనియాల పొడి: 1 స్పూన్

గరం మసాలా లేదా చికెన్ మసాలా: 1 స్పూన్

జీలకర్ర-మిరియాల పొడి: అర స్పూన్ ( తెలంగాణ సీక్రెట్ మసాలా)

నూనె: 4-5 స్పూన్లు

కరివేపాకు: రెండు రెమ్మలు

కొత్తిమీర: సన్నగా తరిగింది

తయారీ విధానం :

1. మొదటగా శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసు కోవాలి. అందులో.. కొద్దిగా పసుపు, అర స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ అల్లం- వెల్లుల్లి పేస్ట్ , ఒక స్పూన్ కారం వేసి బాగా కలిపి కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు ముక్కలకు బాగా పట్టి చికెన్ జ్యూసీగా వస్తుంది.

2. ఇప్పుడు ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కాక, మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను అందులో వేయాలి. మూత పెట్టకుండా.. మీడియం మంటపై నీరంతా ఇగిరిపోయే వరకు ఉడికించాలి. చికెన్ లోని నీరు పూర్తిగా ఆవిరైపోయి నూనె పైకి తేలే వరకు వేయించాలి.

3.వేరొక కడాయిలో 3 స్పూన్ల నూనె వేగాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి , కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత మిగిలిన అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే.. వరకు కలపాలి.

4. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఈ ఉల్లి పాయ మిశ్రమంలో వేయాలి. దీనికి తోడు ధనియాల పొడి, గరం మసాలా, జీల కర్ర-మిరియాల పొడి, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. మంటను తక్కువగా ఉంచి, చికెన్ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించాలి.

5. చివరగా సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర, కొన్ని కరివేపాకులను చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఘుమఘుమలాడే తెలంగాణ రెస్టారెంట్ స్టైల్ చికెన్ వేపుడు రెడీ!

ఈ చికెన్ వేపుడును వేడి వేడి అన్నంతో, పప్పు చారుతో లేదా బగారా ఖానాతో తింటే.. ఆ రుచే వేరు. వీకెండ్స్‌లో మీ కుటుంబ సభ్యులకు ఈ రెసిపీని చేసి పెట్టి మీ అందరినీ ఆశ్చర్యపరచండి!

Related News

అస్సలు చేదు రాకుండా..కరకరలాడే కాకరకాయ వేపుడు!

15 నిమిషాల్లోనే..నోట్లో కరిగిపోయే కమ్మని రవ్వ బర్ఫీ చేయండిలా!

39 ఏళ్ల వయసులోనూ 22 ఏళ్ల బయోలాజికల్ ఏజ్ సాధించిన మహిళ.. యంగ్ లుక్స్ కోసం ఆమె ఏం చేసిందంటే

ఒక్కసారి ఇలా షెజ్‌వాన్ చికెన్ నూడుల్స్ చేసి చూడండి.. రుచి మామూలుగా ఉండదు!

పురుషులు ఎప్పటికీ బయటికి చెప్పరు.. రిలేషన్‌షిప్‌లో ఈ 9 విషయాలు కోరుకుంటారు

పైకి నవ్వుతున్నా లోపల ఆందోళనా.. ఈ 5 సంకేతాలు మీలో ఉంటే బీ కేర్ ఫుల్!

ఘుమఘుమలాడే రెస్టారెంట్ స్టైల్ మటన్ పెప్పర్ మసాలా.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు!

Big Stories

Advertisement
×