E-Paper
Advertisement

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై హైకోర్టు నిషేధం

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై హైకోర్టు నిషేధం
Advertisement

Bandi Bhagirath: స్వేచ్ఛ బ్యూరో: పోక్సో కేసులో నిందితునిగా ఉన్న బండి భగీరథ్ కు హైకోర్టులో ఊరట దక్కింది. అతనిపై నమోదైన కేసు వివరాలు.. కంటెంట్​ ను ప్రసారం చేయవద్దంటూ వేర్వేరు టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా వేదికలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనకు బెయిల్‌ లభించినా తన, తన కుటుంబ సభ్యుల ప్రతిష్ఠ దెబ్బతినేలా సోషల్‌ మీడియాలో, కొన్ని టీవీ చానళ్లలో కంటెంట్‌ ప్రసారం చేస్తూనే ఉన్నారని బండి భగీరథ్​ ఇటీవల హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిని అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్​ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వేణుగోపాల్‌ ధర్మాసనం విచారణ జరిపింది.

కంటెంట్ ప్రసారాలపై నిషేధం

Advertisement

సాయి భగీరథ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ బండి భగీరథ్​ ప్రైవేటు ఫంక్షన్లకు హాజరైన ఫొటోలు, వీడియోలు తీసి పోక్సో కేసుకు అంటగడుతూ వ్యక్తిత్వ హననం చేసేలా కంటెంట్‌ రూపొందిస్తున్నారని చెప్పారు. కోర్టులో విచారణలో ఉన్న అంశంపై వ్యాఖ్యానాలు చేయరాదనే బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. మీడియా ట్రయల్‌ తో పాటు పిటిషనర్‌ పై ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారని తెలిపారు. పిటిషనర్‌ కేసుకు సంబంధించి ఎలాంటి ప్రసారాలు, కంటెంట్‌ అప్‌ లోడ్‌ చేయకుండా ఆయా మీడియా సంస్థలు, టీవీ చానెళ్లు, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌, ప్రైవేటు వ్యక్తులను అడ్డుకోవాలని కోరారు.

గూగుల్, మెటా, ఎక్స్‌లకు హైకోర్టు ఆదేశాలు

Advertisement

సదరు కంటెంట్‌ ను తొలగించేలా గూగుల్‌, మెటా, ఎక్స్‌ తదితర సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆయా ఖాతాల సమాచారం, డిజిటల్‌ ఆధారాలు, కంటెంట్‌ అప్‌ లోడింగ్‌ డేటా, హిస్టరీ, ఎలక్ట్రానిక్స్ రికార్డులు భద్రపర్చేలా గూగుల్‌, మెటా, ఎక్స్‌ సామాజిక వేదికలను ఆదేశించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి ఎలాంటి కంటెంట్‌ ప్రసారం చేయరాదని టీవీ చానళ్లు, ప్రైవేటు వ్యక్తులు, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ను ఆదేశించింది. ఆ కంటెంట్‌ను తొలగించడంతోపాటు ఆధారాలు భద్రపర్చాలని గూగుల్‌, మెటా, ఎక్స్‌ వేదికలకు ఆదేశాలు జారీ చేసింది. వివరణ ఇవ్వాలంటూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ, కేంద్ర ఎలక్ర్టానిక్స్ ఐటీ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, గూగుల్‌, మెటా, ఎక్స్‌ వేదికలు, ప్రైవేటు టీవీ చానళ్లు, కొందరు ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.

Also Read: చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లకు స్వస్తి చెప్పాలి: బొత్స సత్యనారాయణ

Tags

Related News

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?

సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

మరీ ఇంత ఘోరమా.. హుస్సేన్ సాగర్‌లో ఆరేళ్ల పాపను విసిరేసిన కన్నతల్లి..!

హరీశ్ రావు పరువు నష్టం దావా కేసు.. కాంగ్రెస్ అగ్రనేతలకు కోర్టు సమన్లు!

కాంగ్రెస్ మూడేళ్ల పాలన ఫెయిల్.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం: కవిత

ఒక్క వ్యక్తిని కాపాడేందుకే ఈ తాపత్రయమా? కేంద్ర ఎన్నికల సంఘంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సర్కార్ మరో సంచలన నిర్ణయం!

Big Stories

Advertisement
×