బోటి కూర రెసిపీకి కావలసిన పదార్థాలు
బోటి – అరకిలో
నూనె – మూడు స్పూన్లు
ఉల్లిపాయలు – రెండు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
టమాటాలు – రెండు
లవంగాలు – నాలుగు
మరాఠీ మొగ్గ – ఒకటి
దాల్చిన చెక్క – చిన్న ముక్క
ధనియాలు – ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు
జీలకర్ర – ఒక స్పూను
కారం – ఒకటిన్నర స్పూను
పసుపు – చిటికెడు
బోటి కూర రెసిపీ
1. బోటిని పరిశుభ్రంగా కడిగి నీటిలో వేసి ఉప్పు కలిపి బాగా శుభ్రపరచాలి.
2. ఇప్పుడు బోటీని ఒక గిన్నెలో వేసి మంచినీళ్లు వేసి ఉప్పు వేసి బాగా కలపాలి. దాన్ని స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి.
3. ఉడికిన తర్వాత బోటీలో ఉన్న వ్యర్థాలను పూర్తిగా తొలగించి శుభ్రం చేసుకోవాలి.
4. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేయాలి.
6. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
7. ఉల్లిపాయలు రంగు మారేవరకు వేయించాలి.
8. ఆ తర్వాత పసుపు వేయాలి. తరువాత బోటీ ముక్కలను వేసి బాగా కలపాలి.
9. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపాలి.
10. పైన మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ లోపు ధనియాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, జీలకర్ర మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
11. ఈ పొడిని కూడా కూరలోనే వేసి బాగా కలపాలి.
12. ఇది మొత్తం ఇగురు లాగా అవుతుంది.
13. ఇప్పుడు టమోటాలను చిన్న ముక్కలుగా తరిగి అందులోనే వేసి బాగా కలపాలి.
14. ఇప్పుడు ఇది ఉడకడానికి సరిపడా ఒక గ్లాసు నీళ్లను వేసి పైన మూత పెట్టి విజిల్ పెట్టేయాలి.
15. ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
16. మూత తీసాక బోటి కూర ఇగురు లాగా దగ్గరగా వచ్చేవరకు మళ్లీ ఉడికించాలి.
17. పైన కొత్తిమీర తరుగున చల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే బోటీ కూడా రెడీ అయినట్టే.