Noida Man Viral News: అప్పడప్పుడు కొన్ని ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు పూరి గుడిసెకు లక్షల రూపాయల కరెంటు బిల్లు వచ్చిన ఘటనలు చూశాం. బడ్డీ కొట్టు పెట్టుకుని బతికే వ్యక్తి లక్షల రూపాయాలు కట్టాలంటూ ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, తాజాగా బ్యాంకింగ్ రంగంలోనే ఓ అరుదైన ఘటన జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో దేశం అంతా ఆశ్చర్యపోయే ఘటన జరిగింది. ఏకంగా ఓ యువకుడి ఖాతాల్లోకి ఏకంగా రూ. 10 లక్షల కోట్లు వచ్చిపడ్డాయి. ఒక్కసారిగా సదరు యువకుడు షాక్ కు గురయ్యాడు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
గ్రేటర్ నోయిడాకు చెందిన గాయత్రి దేవి అనే మహిళ రెండు నెలల క్రితం చనిపోయింది. ఆమెకు 19 ఏళ్ల కొడుకు ఉన్నాయి. తన తల్లి సెల్ ఫోన్ తనే వాడుతున్నాయి. ఆమెకు కొటాక్ బ్యాంక్ లో ఓ అకౌంట్ ఉంది. ఆదివారం రాత్రి అతడి తల్లి ఖాతాకు సంబంధించి వచ్చిన ఓ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చూసి ఒక్కసారి షాకయ్యాడు. తన తల్లి అకౌంట్ లో రూ. 10,01,35,60,00,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299 డబ్బులు జమ అయినట్లు ఆ మెసేజ్ లో ఉంది. ఎందుకైనా మంచిదని అతడి యూపీఐ చెక్ చేశాడు. నిజంగానే అంత అమౌంట్ చూపిస్తుంది. తన ఫ్రెండ్స్ కు విషయం చెప్తే, వారు కూడా నిజమే అని చెప్పారు.
नोएडा में 20 साल के दीपक के कोटक महिंद्रा बैंक खाते में 36 डिजिट की धनराशि आई है।
ये रकम 1 अरब 13 लाख 56 हजार करोड़ रुपए बैठती है।
मेरा गणित थोड़ा कमजोर है। बाकी आप लोग गुणा-भाग कर सकते हैं।
फिलहाल इनकम टैक्स विभाग जांच कर रहा है। बैंक खाता फ्रीज कर दिया गया है। pic.twitter.com/cLnZdMKozD
— Sachin Gupta (@SachinGuptaUP) August 4, 2025
విచారణ జరపుతున్న అధికారులు
మరుసటి రోజు బ్యాంక్ ఓపెన్ కాగానే వెళ్లి అధికారులను కలిశాడు. తన అకౌంట్ చెక్ చేసి డబ్బులు వచ్చింది నిజమే అని చెప్పారు. వెంటనే సదరు యువకుడి అకౌంట్ ను ఫ్రీజ్ చేశారు. బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని ఆదాయపు పన్ను అధికారులకు సమాచారం అందించారు. వెంటనే బ్యాంకుకు చేరుకున్న ఆదాయ పన్ను అధికారులు గాయత్రి దేవి అకౌంట్ లోకి అంత డబ్బు ఎలా వచ్చింది? అనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ డబ్బులు ఏదైనా బ్యాంకింగ్ సమస్య కారణంగా జరిగిందా? లేదంటే మనీలాండరింగ్ తో ఏమైనా సంబంధం ఉందా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు ఈ డబ్బులపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ కేసుపై ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? చనిపోయిన వ్యక్తి ఖాతాలోకి ఎందుకు జమ చేశారు? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే అసలు విషయాన్ని కనిపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన దీపక్
అటు ఈ విషయం నెమ్మదిగా ఊరంతా పాకడంతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, బంధువులు కాల్సి చేయడం మొదలుపెట్టారు. ఆ డబ్బు ఎలా వచ్చిందని అడగడం మొదలుట్టారు. ఈ ఫోన్ కాల్స్ తాకిడి తట్టుకోలేక, దీపక్ తన సెల్ ఫోన్ ను ఆఫ్ చేసుకున్నాడు.
Read Also: బెట్, ఈ బనానాను ఒక్కరే తినలేరు.. చరిత్రలో అత్యంత పెద్ద అరటి పండు పొడవు ఎంతో తెలుసా?