Young Professionals Scheme : మంచి విద్యా, ఉపాధీ అవకాశాలు అందుకోవాలనుకునే ఆశావాహులకు యూకే స్వాగతం పలుకుతోంది. తమ దేశంలోని అధికారికంగా ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తుంది. ఇందుకోసం.. యుకే-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ 2025 ను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద యూకేలో రెండేళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నివసించేందుకు, చదువుకునేందుకు… ఇండియా నుంచి 3 వేల మంది అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక యునైటెడ్ కింగ్ డమ్ వెబ్సైట్ ద్వారా ఉచితంగా అప్లై చేసుకోవచ్చని ఆహ్వానిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకున్న అభ్యర్థులందరి జాబితాను బ్యాలెట్ విధానంలో రూపొందించనున్నారు. వారిలో మొదటి 3 వేల మందిని ఈ స్కీమ్ కింద అర్హతలు కల్పించనున్నారు.
దేశం నుంచి యూకేకు ఏటా లక్షల మంది విద్యార్థులు వెళ్లాలని అప్లై చేసుకుంటుంటారు. అలాంటి వారిలో యూకే అధికారికంగా తెలిపిన అర్హతలున్న వాళ్లు ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకుంటే.. సులువుగా అమెరికా చేరుకోవచ్చని అంటున్నారు. ఆన్లైన్ బ్యాలెట్ ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 2:30 (IST)కి ప్రారంభమై ఫిబ్రవరి 20న మధ్యాహ్నం 2:30 (IST)కి ముగుస్తుంది. అన్ని దరఖాస్తులను ర్యాండమ్ పద్దతిలో ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియను బ్యాలెట్ ముగిసిన రెండు వారాల్లోపు ముగించి.. ఎంపికైన వాళ్లకు తెలియజేస్తారు.
యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ 2025- అర్హతలు
ఈ పథకానికి అర్హత సాధించడానికి, దరఖాస్తుదారులు ఈ క్రింది ప్రమాణాలను కచ్చితంగా కలిగి ఉండాలని అధికారులు తెలుపుతున్నారు.
1. నిర్దేశించిన తేదీల్లో అభ్యర్థులు 18-30 ఏళ్ల వయస్సు కలిగిన భారతీయ పౌరుడై ఉండాలి.
2. UK-గుర్తింపు పొందిన బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ అర్హతను కలిగి ఉండాలి.
3. ఆర్థిక సహాయం కోసం కనీసం £2,530 యూరోలు (సుమారు రూ. 2,70,824) వ్యక్తిగత పొదుపును ఖాతాలో చూపించగలగాలి.
4. అభ్యర్థుల బ్యాంకు ఖాతాలో వరుసగా 30 రోజుల పాటు కనీసం రూ. 2,50,000 బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి.
5. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలు ఉండి, అభ్యర్థులపై ఆధారపడి ఉండకూడదు.
6. బ్యాలెట్‌లోకి ప్రవేశించే ముందు అన్ని అర్హత ప్రమాణాలను పరిశీలించుకుని అప్లై చేయాలి.
7. ముఖ్యంగా.. యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా కలిగి ఉన్న వ్యక్తులు అర్హులుకారు.
బ్యాలెట్-దరఖాస్తు ప్రక్రియ
బ్యాలెట్ ఎంట్రీ ప్రక్రియ సరళంగా ఉంటుందని చెబుతున్న అధికారులు.. ఇది పూర్తిగా ఉచితం అంటున్నారు. దరఖాస్తుదారులు పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్ట్ సమాచారం, ఫోన్ నంబర్, ఈమెయిల్ తో సహా వారి వ్యక్తిగత వివరాలను, వారి పాస్‌పోర్ట్ స్కాన్ చేసిన కాపీతో పాటు సమర్పించాలి. ర్యాండమ్ డ్రాలో ఎంపికైన వారికి మాత్రమే వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ-మెయిల్ ఆహ్వానం అందుతుంది. ఆ తర్వాత దరఖాస్తుదారులు 90 రోజుల్లోపు ఆన్‌లైన్ వీసా దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ ధృవీకరణను పూర్తి చేసి, అవసరమైన రుసుములను చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసే సమయంలో వీసా రుసుము కింద £298 (రూ. 32,487), ఆరోగ్య సంరక్షణ సర్‌ఛార్జ్ కింద £1,552 (రూ.1,69,885) చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వెరిఫికేషన్ సమయంలో అప్లికేషన్ తిరస్కరిస్తే.. దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించరు. ఈ వీసా 24 నెలల వరకు యూకేలో ఉండేందుకు అనుమతిస్తుంది. ఈ సమయంలో అభ్యర్థులు.. యూకేలోకి స్వేచ్ఛగా ప్రవేశించవచ్చు, తిరిగి వచ్చేయవచ్చు. వీసా పొందిన తర్వాత 31 సంవత్సరాలు నిండిన వారు.. దాని చెల్లుబాటు పూర్తయ్యే వరకు యూకేలోనే ఉండొచ్చని అధికారులు తెలుపుతున్నారు.
Also Read :మస్క్‌కు అంతమంది పిల్లలా? 13వ బిడ్డపై వీడని సస్పెన్స్.. ఆమె ఆరోపణలు నిజమేనా?
ఈ వీసాతో అభ్యర్థులు స్వేచ్చగా చదువుకోవచ్చు, అయితే..కొన్ని కోర్సులకు అకడమిక్ టెక్నాలజీ అప్రూవల్ స్కీమ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. చాలా ఉద్యోగాలలో పని చేయవచ్చు, నిర్దిష్ట ఆర్థిక, ఉపాధి పరిమితులలో వ్యాపారాన్ని కూడా ప్రారంభించే అవకాశం దక్కుతుంది. అయితే, వీసా హోల్డర్లు దేశంలో ఉండే సమయాన్ని మరింత పొడిగించుకునేందుకు వీలవదని అధికారులు తెలుపుతున్నారు. కుటుంబ సభ్యులను వారి దరఖాస్తు కిందకు తీసుకు వచ్చేందుకు వీలవదని, ప్రొఫెషనల్ క్రీడాకారులుగా పని చేయలేరని యూకే అధికారులు వెల్లడిస్తున్నారు.