Children Health Tips: పెరుగుతున్న వేడి పిల్లల శరీరాలపై అనేక ప్రభావాలను చూపుతుంది. అందుకే ఎండాకాలంలో చిన్న పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. వారికి సరైన పోషకాహారం అందించడం ద్వారా మాత్రమే వారు మంచి , ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించగలుతారు.
రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పు చిన్న పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అంతే కాకుండా ఈ సమయంలో చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరాలు , జీర్ణ సమస్యలను ఎదుర్కొంటుూ ఉంటారు. ఇలాంటి సమస్యలు తరచుగా రాకుండా ఉండాలంటే.. తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఈ విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహారం:
మారుతున్న వాతావరణంలో.. పిల్లలు, పెద్దలు ఎవరైనా చాలా కాలం నిల్వ ఉంచిన ఆహారాన్ని తినకుండా ఉండాలి. చిన్నపిల్లలు ఎక్కువగా బయట తినడానికి ఇష్టపడతారు. ఇలాంటి సమయంలో ఉదయం లేదా రాత్రి వండిన ఆహార పదార్థాలను మరుసటి రోజు తినడం లేదా ఉదయం వండిన వాటిని రాత్రికి వడ్డించడం వంటివి చేస్తుంటారు. ఇలా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. చిన్న పిల్లలకు తీపి పదార్థాలు, వేయించిన ఆహారాలు, కూల్ డ్రింక్స్ , పాల ఉత్పత్తులను ఇవ్వడం మానుకోవాలి. చిన్న పిల్లలకు ఎల్లప్పుడూ తాజా, తేలికైన ఆహారం ఇవ్వాలి. కాబట్టి పోషకాహారాన్ని మాత్రమే ఎండాకాలంలో పెట్టడం మంచిది.
చల్లటి, ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం:
చిన్నపిల్లలు సమ్మర్‌లో చల్లని ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ తల్లిదండ్రులు ఎంత మోతాదులో పిల్లలకు వాటిని ఇవ్వలనే దానిని నిర్ణయించుకోవాలి. చిన్న పిల్లలకు చల్లని నీరు, కూల్ డ్రింక్స్ లేదాఫ్రిజ్ లో ఉంచిన పండ్లు ఇవ్వడం మానుకోండి. ఇలాంటి డ్రింక్స్ తాగడం వల్ల పిల్లలు కడుపునొప్పి, జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలకు గురవుతారు.
తీపి ఆహార పదార్థాలు:
తల్లిదండ్రులు తమ బిడ్డ ఏడవడం ప్రారంభించిన వెంటనే వారికి చాక్లెట్ లేదా రంగు రంగుల లాలీపాప్‌లు ఇవ్వడం అలవాటు చేస్తుంటారు. కానీ అది పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ పదార్థాలు పిల్లలను బలహీనపరుస్తాయి. అంతే కాకుండా పిల్లలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. లాలీ పాప్స్ తో పాటు చాక్లెట్ లను తయారు చేసేటప్పుడు కలర్స్ వాడుతుంటారు. ఇవి పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇలాంటి వాటికి బదులుగా ఆరోగ్య కరమైన ఆహార పదార్థాలు ఇవ్వడం చాలా మంచిది.
Also Read: ఇవి ఒక్క సారి వాడినా చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా !
వేయించిన ఆహారాలు:
చిన్నపిల్లలు లేస్, వేఫర్లు , ప్యాక్ చేసిన ఆహారాలు తినడానికి ఇష్టపడతారు . అయితే.. ఇది పిల్లలకు ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడదు. దీనివల్ల పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం ఉంది. గ్యాస్, అసిడిటీ, విరేచనాలు వంటి వ్యాధులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే వీలైనంత వరకు ఇలాంటి స్నాక్స్ కూడా పిల్లలకు ఇవ్వకూడదు.