KKR పై RCB విజయం:
RCB- Mallya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు శుభారంభం చేసింది. శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కలకత్తా.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కలకత్తా బ్యాటింగ్ కి దిగిన అనంతరం ఆరంభంలోనే క్వింటన్ డికాక్ వికెట్ ని నాలుగు పరుగుల వద్దే కోల్పోయింది.
Also Read: Pat Cummins: SRH 300 కొట్టడం పక్కా.. కమిన్స్ షాకింగ్ కామెంట్స్?
అనంతరం కెప్టెన్ అజింక్య రహానే {56}, సునీల్ నరైన్ {44} పరుగులతో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వరుస ఓవర్లలో వీరిద్దరూ పెవిలియన్ చేరారు. దీంతో కలకత్తా బ్యాటింగ్ కుదుపుకు లోనైంది. ఈ దశలో బెంగుళూరు స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేశారు. రఘువంశీ {30} పరుగులతో జట్టును కాస్త ఆదుకున్నాడు. ఇక మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఆర్సిబి బౌలర్లలో కృనాల్ పాండ్యా 29 పరుగుల కి మూడు వికెట్లను పడగొట్టాడు. ఇక జోష్ హెజిల్ వుడ్ 2, సుయాష్ శర్మ, రసిక్ సలామ్, యష్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు.
అజింక్య రహనే – సునీల్ నరైన్ దాటికి ఓ దశలో కలకత్తా జట్టు 220 ప్లస్ పరుగుల స్కోర్ చేసేలా కనిపించింది. కానీ వీరి జోడిని విడదీసి సంచలన బౌలింగ్ తో కలకత్తా జట్టిను సాధారణ స్కోరు కే పరిమితం చేశాడు కృనాల్ పాండ్యా. అనంతరం లక్ష చేదనకు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 16.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఆర్సిబి బ్యాటర్లలో విరాట్ కోహ్లీ {59*} ఫిల్ సాల్ట్ {56} ఆఫ్ సెంచరీలతో రాణించారు. అలాగే కెప్టెన్ రజత్ పటిదార్ {34} పరుగులతో దూకుడుగా ఆడాడు. దీంతో ఆర్సిబి తొలి మ్యాచ్ లోనే విజయం సాధించింది.
ఆర్సిబి బౌలింగ్ పై విజయ్ మాల్యా:
అయితే కలకత్తా పై విజయం సాధించిన ఆర్సీబీకి ఆ టీమ్ మాజీ ఓనర్ విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ {ట్విట్టర్} వేదికగా.. ” ఎట్టకేలకు ఆర్సిబి బాగా బౌలింగ్ చేసిందని కామెంటేటర్స్ చెప్పడం సంతోషంగా ఉంది. ఆర్సిబి బ్యాటింగ్ లైనప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు.
Also Read: RCB: తొలి విజయంతో టెన్షన్ లో ఆర్సీబీ… ఇక వరుసగా ఓటమిలేనా…!
అయితే బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా.. ప్రస్తుతం యుకెలో నివసిస్తున్నాడు. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్ ని ఆర్సిబి 10.75 కోట్లకు దక్కించుకుంది. కానీ కలకత్తా తో శనివారం రోజు జరిగిన తొలి మ్యాచ్లో అతనిని పక్కన పెట్టింది. ఆర్సిబి తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ ఈ మ్యాచ్ లో ఆర్సిబి విజయం సాధించడంతో ఊపిరిపీల్చుకున్నారు.
Congratulations to RCB for the emphatic win over KKR. Glad to hear the commentators finally say that RCB bowled well. The batting line up speaks for itself.
— Vijay Mallya (@TheVijayMallya) March 22, 2025