History of Photos: ప్రస్తుత కాలంలో చాలా మందికి ఫోటోస్ పిచ్చి ఉంటుంది. ఎక్కడికి వెళ్లిన ఫోటోలు దిగడం ఒక అలవాటుగా మారిపోయింది. ఇంకా ఇప్పుడు స్నాప్ చాట్ అని ఒకటి వచ్చింది. దాంట్లో ఫోటోలు దిగడం ఫోస్ట్ చేయడం.. చేయ్యకపోతే ఏదో శిక్ష వేసినట్లు బాధపడటం చాలా మందికి అలవాటయ్యింది. ఎక్కడికైన వెలితే అక్కడ జరిగే సంఘటన చూడటం ఆపేసి మరి ఫోటోస్ దిగుతుంటారు. కొందరు అయితే ఫోటోలు దిగడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఫోటోస్‌లో మనకు తెలియని విశాయాలు చాలా ఉన్నాయి.
ఫోటోస్ ప్రత్యేకత:
ఏదైన సరే పంక్షన్ కానీ.. పెళ్లి కాని అవుతుంటే ఫోటోగ్రాఫర్ ఇటు చూడండి అని తన వైపు చూడమంటాడు. కానీ అలా చూడటం వల్ల అక్కడ జరిగే సంఘటన ఏం అర్ధమవుతుంది. అందరు ఫోటోలు అంటే ఏముంది.. గుర్తుకు వచ్చినప్పుడు మళ్లి చూసుకోవడానికి అనుకుంటారు. కానీ ఈ ఫోటోలు చూస్తే జరిగింది అంతా గుర్తుకు రావాలి.. అందుకే ఫోటోలు తీస్తారని సైన్స్ చెబుతుంది. అందరు అనుకుంటారు ఫోటోలు చూస్తే గుర్తుకు రాదా.. అని కానీ అక్కడే తీసే ఫోటోలో లైఫ్ ఉండదు. ఎందకంటే..
ఒక ఫోటో చూస్తే అది మనతో మాట్లాడాలి.. అంటే అక్కడ జరిగే ప్రతి తంతూ అతను న్యాచురల్‌గా తీయాలి. వాళ్ల ఎమోషన్స్‌ని ఫర్‌ఫెక్ట్‌గా పట్టుకోవాలి. ప్రస్తుతం పెళ్ళి గురించి తీసుకుంటే.. అందులో జరిగే ప్రతి విషయంలో ఒక అర్ధం ఉంటుంది. ఒక ఎమోషన్ ఉంటుంది. జీలకర్ర, బెల్లం పెట్టుకుంటూ ఒకరిని ఒకరు చూసుకోమంటారు. ఇకపై ఒకరి కోసం ఒకరనే భావన కలగలని జీవితాంతం అన్యోన్యంగా ఉండాలని.. అంటారు. అలా ఒకరొనొకరు చూసుకున్నప్పుడు ఒకరిపై ఒకరి ప్రేమ కనిపిస్తుంది. అప్పుడు ఫోటో తియ్యాలి. తాళి కట్టడం అంటే జీవితాంతం తనకు తోడుగా ఉంటానని అందరి ముందు ప్రమాణం చేయ్యటం.. దానికి అంగీకరిస్తూ తలదించుకుని కూర్చున్న అమ్మాయి ఫేస్‌లో అందమైన చిరునవ్వు ఉంటుంది. అది ఫోటో తియ్యాలి.. పిల్లల తలరాత బాగుండాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నప్పుడు.. ఆ తల్లిదండ్రుల కళ్లలో గొప్ప ఆనందం కనిపిస్తుంది. అది ఫోటో తియ్యడం.. అంతేగాని ప్రతి ముఖ్యమైన సమయంలో ఫోటో అతను తన వైపు చూడమంటే అందులో ఏముంటుంది. సందర్భం ఏదైనా సరే.. న్చాచురల్‌గా కాకుండా మనుషుల్ని కేమర వైపు తిప్పి ఫోటోలు తీస్తే అందులో వాళ్ల మోహాలు మాత్రమే వస్తాయి. వాళ్ల ఎమోషన్స్ రావు.. ఇది ప్రతి ఒక్క కేమర అతను గుర్తు పెట్టుకుంటే ప్రతి ఫంక్షన్‌లో ఒక ఎమోషన్ కనిపిస్తుంది.
Also Read: ఈ ఆయిల్ వాడితే.. 30 రోజుల్లోనే పొడవాటి జుట్టు మీ సొంతం
జ్ఞాపకాలు నిలుపుకోవడం:
ఫోటోలు న్యాచురల్‌గా తీస్తే ఆ జ్ఞాపకాలను జీవితంలో ముఖ్యమైన క్షణాలుగా శాశ్వతంగా నిలుపుకోవడం.. ఫోటోలు గడిచిన కాలాన్ని గుర్తు చేస్తుంది. అలాగే భవిష్యత్ తరాలకు కూడ ఆ జ్ఞాపకాలను అందిస్తుంది. అందుకే ఆస్థామానం ఫోటోలు దిగడం కాదు అందులో ఉండే అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం.