Food Pairings: మనం తెలీకుండా తినే కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ మన జీర్ణ శక్తిని దెబ్బతీస్తాయి. అయితే, ఈ కాంబినేషన్స్ లో ఫుడ్ తినడం వల్ల అందరికీ జీర్ణ సమస్యలు వస్తాయని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఏదైనా ఫుడ్ అది జీర్ణం అవ్వడం కాకపోవడం అనేది ఆ ఫుడ్ మీద ఎంత డిపెండ్ అయ్యి ఉంటుందో మన బాడీ, దాని ఇమ్యూన్ సిస్టం మీద కూడా అంతే డిపెండ్ అవుతుంది. అయితే కొన్ని ఫుడ్ ఐటమ్స్‌ను కలిపి తినడం వల్ల బాడీలో టాక్సిన్స్ ఏర్పడి జీర్ణ సమస్యలు రావచ్చని ఆయుర్వేద, మోడర్న్ న్యూట్రిషనల్ సైన్స్ చెబుతున్నాయి. అలాంటి కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
పాలు, చేపలు
పాలు, చేపలు కలిపి తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఏర్పడి చర్మ సమస్యలకు దారితీయవచ్చు. ఈ రెండూ వేర్వేరు జీర్ణ సమయాలను కలిగి ఉండడంవల్ల జీర్ణక్రియను దెబ్బతీస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పెరుగు, వేడి ఆహారం
పెరుగు చల్లని స్వభావం కలిగి ఉండడంవల్ల వేడి ఆహారాలతో కలిపి తినడం జీర్ణ సమస్యలను పెంచవచ్చు. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం, ఎసిడిటీ వంటివి రావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. పెరుగును వేడి అన్నం లేదా కూరలతో తిన్నప్పుడు జీర్ణ సమస్యలు తలెత్తవచ్చని అంటున్నారు.
పండ్లు, భోజనం
మనం రోజూ తినే భోజనం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. పండ్లను గోధుమలు, మాంసం, పప్పు వంటి వాటితో కలిపి తినడం వల్ల కడుపులో ఫెర్మెంటేషన్ జరిగి గ్యాస్ లేదా కడుపుబ్బరం వంటి సమస్యలు రావచ్చు. అరటిపండును పాలతో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగించి శరీరంలో టాక్సిన్స్ ను పెంచుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పాలు, నిమ్మకాయ
పాలను నిమ్మకాయ, టమాట లేదా వెనిగర్ తో కలిపి తీసుకోవడం వల్ల మనం తీసుకున్న పాలు కడుపులో పెరుగుగా మారి వాంతులు, వికారం వంటి సమస్యలను కలిగిస్తుంది. నిమ్మరసంతో పాలు తాగడం లేదా టమాటో సాస్ తో చీజ్ తినడం వంటివి మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మాంసం, తేనే
మాంసం, తేనే కలిపి తినడం వల్ల శరీరంలో ఉండే కెమికల్స్ కంట్రోల్ తప్పి జీర్ణ సమస్యలు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయుర్వేద పండితులు చెబుతున్నారు.
ఏదైనా ఆహార పదార్థాలను తినే ముందు వాటి స్వభావం, జీర్ణ సమయాన్ని గుర్తించాలి. ఒకే రకమైన స్వభావం ఉన్న ఆహారాలను కలిపి తినడం ద్వారా జీర్ణ సమస్యలను నివారించడమే కాకుండా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ కాంబినేషన్స్‌లో ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, కడపు ఉబ్బరం వంటి సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.