Hair Care: చలికాలంలో మన జుట్టు, చర్మంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం. మన చర్మాన్ని ఎలాగోలా చూసుకుంటాం, కానీ జుట్టును సరిగ్గా చూసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం.
చలికాలంలో వచ్చు ఈ చల్లని గాలులు చర్మాన్ని పొడిగా, నిర్జీవంగా మారుస్తాయి. ఇలా జరగడం వల్ల జుట్టు సహజమైన మెరుపు కూడా దూరమవుతుంది. చలికాలంలో జుట్టును ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవాలనుకునే వారు కొన్ని రకాల టిప్స్ తప్పకుండా పాటించాలి. ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు కోసం చలికాలంలో పాటించాల్సిన కొన్ని రకాల టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనె, తేనె హెయిర్ మాస్క్:
మీ జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే మీరు ఈ హెయిర్ మాస్క్‌ని తప్పకుండా ఉపయోగించాలి. ఇది మీ జుట్టులోకి లోతుగా చొచ్చుకుపోతుంది. అంతే కాకుండా జుట్టు పొడిబారడం, చివర్లు చీలిపోవడం వంటి సమస్యల నుండి మీకు ఉపశమనం అందిస్తుంది. తేనె జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది.
ఈ హెయిర్ మాస్క్‌ను తయారు చేయడానికి, మీరు రెండు చెంచాల కొబ్బరి నూనెను వేడి చేసి, అందులో ఒక చెంచా తేనె కలపాలి. కొబ్బరినూనె మరీ వేడిగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పదార్థాలను కలపి మిక్స్ చేయండి. ఈ పేస్ట్‌ను జుట్టు మూలాల నుండి చివర్ల వరకు పూర్తిగా అప్లై చేయండి. అరగంట పాటు అలాగే ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో పాటు షాంపూతో వాష్ చేయండి.
అరటి పండు గుజ్జు, ఆలివ్ ఆయిల్ తో హెయిర్ మాస్క్:
ఈ హెయిర్ మాస్క్‌ను సిద్ధం చేయడానికి, మీరు ఒక చిన్న కప్పు పండిన అరటిపండు గుజ్జులో 2 చెంచాల ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి.తర్వాత వాటిని మెత్తని పేస్ట్ లాగా తయారు చేయండి. ఇప్పుడు మీరు ఈ మాస్కును జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు అప్లై చేయవచ్చు. తర్వాత మీరు అరగంట పాటు మీ జుట్టును షవర్ క్యాప్‌తో కప్పి, చివరిగా మీరు వాడే షాంపూతో తలస్నానం చేయండి.
గుడ్డు పచ్చసొన , బాదం నూనె:
ఈ హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం ద్వారా మీ జుట్టుకు మూలాల నుండి బలంగా మారుతుంది. ఈ మాస్క్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల మీ జుట్టు కూడా మృదువుగా, మెరుసేలా చేసుకోవచ్చు. తరుచుగా జుట్టుకు ఎగ్ వాడటం వల్ల కూడా కావాల్సిన పోషణ లభిస్తుంది. అంతే కాకుండా ఇందులోని ప్రొటీన్ జుట్టు రాలకుండా చేస్తుంది. జుట్టు మృదువుగా మారేలా చేస్తుంది.
Also Read: ఇంట్లోనే ఇలా హెయిర్ కలర్ తయారు చేసుకుని వాడితే.. తెల్ల జుట్టు క్షణాల్లోనే మాయం
ఈ హెయిర్ మాస్క్‌ను తాయారు చేయడానికి, మీరు రెండు గుడ్ల పచ్చ సొనలను రెండు చెంచాల బాదం నూనెతో కలపాలి. తర్వాత దీనిని బాగా కలపాలి. ఈ మాస్క్‌ని మీ స్కాల్ప్ , హెయిర్‌పై బాగా అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. చివరగా చల్లటి నీటితో జుట్టును వాష్ చేసుకోండి.