BigTV English

Pimple Problem: వీటితో ముఖంపై మచ్చలు పోతాయ్

Pimple Problem: వీటితో ముఖంపై మచ్చలు పోతాయ్

Pimple Problem: ముఖం అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. అలాంటి వారిలో చాలా మంది హోం రెమెడాస్ వాడుతూ ఉంటారు. చాలా హోం రెమెడీస్ ముఖంపై మెరుపును పునరుద్ధరించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.


ముఖం కాంతివంతంగా ఉండేందుకు మార్కెట్లో అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా ఖరీదైనవి, వీటి ఉపయోగం శాశ్వత సౌందర్యాన్ని అందించదు. అటువంటి పరిస్థితిలో, కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. అటువంటి వాటిలో ఒకటి చర్మంపై బంగాళదుంపను ఫేస్‌కు ఉపయోగించడం.

బంగాళదుంపలో ఉండే గుణాలు చర్మ సంరక్షణకు చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే సమ్మేళనం ముఖంలోని మృతకణాలను తొలగించి, చర్మంలోని పాత మెరుపును పునరుద్ధరించి చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.


బంగాళదుంపలో ఉండే గుణాలు చర్మ సంరక్షణకు చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే సమ్మేళనం ముఖంలోని మృతకణాలను తొలగించి, చర్మంలోని పాత మెరుపును పునరుద్ధరించి చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.

బంగాళదుంపను ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ముఖ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది: బంగాళదుంపలో 80% నీరు ఉండటం వల్ల ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసస్తుంది. అంతే కాకుండా చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

వాపును తగ్గిస్తుంది: బంగాళాదుంపలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ముఖంపై ఎరుపును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

డార్క్ సర్కిల్స్ తో పాటు పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది: బ్లీచింగ్ ఏజెంట్లు బంగాళదుంపలో ఉంటాయి. ఇవి పిగ్మెంటేషన్‌ ,డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి.

మొటిమలతో పోరాడుతుంది: బంగాళదుంపలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తాయి.

ముడతలు ,ఫైన్ లైన్లను తగ్గిస్తుంది: బంగాళదుంపలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా ముడతలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది: బంగాళదుంపలో ఉండే ఎంజైమ్‌లు చర్మంపై మృత చర్మ కణాలను తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

బంగాళాదుంపను ముఖానికి ఎలా ఉపయోగించాలి ?

పచ్చి బంగాళాదుంప:
ముందుగా ఒక బంగాళాదుంపను కడిగి తురుముకోవాలి. అనంతకం వాటి రసాన్ని తీసి ముఖానికి పట్టించాలి. ఈ రసాన్ని 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు ఈ ఫేస్ ప్యాక్ లో తేనె లేదా పెరుగును కూడా కూడా కలుపుకోవచ్చు.

Also Read:  ఈ ఫేస్ ప్యాక్స్‌తో మీ అందం రెట్టింపు

ఉడకబెట్టిన బంగాళదుంపలు:
ఒక బంగాళాదుంపను ఉడికించి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొంచెం పాలు, తేనెను కలపండి. దీన్ని ముఖం, మెడపై రాయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో కడగేయాలి.

బంగాళదుంప రసం:
ముందుగా ఒక బంగాళాదుంపను కడిగి తురుముకోవాలి. రసాన్ని తీసి దూదిలో ముంచి ముఖానికి పట్టించాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి ఆపై చల్లటి నీటితో కడగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×