Wrinkles: ముడతలు, మచ్చులు లేని ముఖం కావాలని చాలా మందికి ఉంటుంది. కానీ, చెడు ఆహారపు అలవాట్లు, పొల్యూషన్, నీళ్లు సరిగా తాగకపోవడం వంటి కారణాల వల్ల చాలా మందికి చిన్న వయసులోనే చర్మంపై ముడతలు వచ్చేస్తాయి. దీని వల్ల వృద్ధాప్య ఛాయలు వచ్చినట్టుగా అనిపిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు అలాంటి సమయంలో కొన్ని టిప్స్ పాలిస్తే సరిపోతుందని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు. ముఖంపై ముడతలు సహజంగా తగ్గించడానికి కొంచెం శ్రద్ధ పెడితే చర్మం మృదువుగా, యవ్వనంగా కనిపిస్తుందట. ఆ టిప్స్ ఏంటంటే..
నీళ్లు
నీళ్లు తక్కువైతే ముడతలు ఎక్కువ కనిపిస్తాయట. అందుకే చర్మం మృదువుగా ఉండాలంటే నీళ్లు తప్పనిసరిగా తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ 8–10 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా మారుతుందట. అలాగే, కీరదోస, పుచ్చకాయ, హెర్బల్ టీ లాంటివి తీసుకుంటే చర్మం తేమగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మంచి ఆహారం
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. బెర్రీలు, పాలకూర, గింజలు లాంటివి తింటే చర్మం బాగుంటుందట. సాల్మన్ చేప, చియా గింజల్లో ఉండే కొవ్వులు చర్మాన్ని మెరుగుపరుస్తాయని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆరెంజ్, క్యాప్సికమ్‌లో విటమిన్-సి ఉంటుంది.ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జంక్ ఫుడ్, ఎక్కువ తీసుకుంటే చర్మం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సహజ నూనెలు
కొబ్బరి నూనె, బాదం నూనె, జోజోబా నూనె లాంటివి ముఖానికి రాస్తే చర్మం తేమగా ఉంటుందట. ముఖం కడిగాక కొన్ని చుక్కలు రాసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. అలోవెరా జెల్ కూడా ముడతలు తగ్గించడానికి సూపర్‌గా పని చేస్తుందట. రాత్రిపూట వీటిని వాడితే బెటర్ రిజల్ట్ వస్తుందని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు.
ఎండ నుంచి రక్షణ
ఎండ వల్ల ముడతలు త్వరగా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సూర్యుడి నుంచి వచ్చే UV కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయట. బయటకు వెళ్తున్నప్పుడు జింక్ ఆక్సైడ్ ఉండే సహజ సన్‌స్క్రీన్ వాడాలని నిపుణులు చెబుతున్నారు. ఎండ నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి టోపీ, సన్‌గ్లాస్‌లు వాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: లిప్‌స్టిక్ వాడితే ప్రాణాలకే ముప్పు
మంచి నిద్ర
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే బాగా నిద్ర పోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట 7–8 గంటలు నిద్రపోతే చర్మం రిపేర్ అవుతుందట. సిల్క్ దిండు వాడితే చర్మంపై ఒత్తిడి తగ్గుతుందట. దీని వల్ల ముడతలు కూడా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ముఖానికి మసాజ్
రోజూ 5–10 నిమిషాలు ముఖానికి సున్నితంగా మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నూనెతో మసాజ్ చేస్తే ఇంకా మంచిది. నుదురు, కళ్ల చుట్టూ ఎక్కువగా శ్రద్ధ పెట్టడం ఉత్తమం.
ఇంట్లో ఫేస్ మాస్క్‌లు
తేనె, పెరుగు కలిపి మాస్క్ వేస్తే చర్మం మృదువవుతుందని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు. అవకాడో, నిమ్మరసం కలిపిన మాస్క్ కూడా మంచిది. వారానికి 1–2 సార్లు 15 నిమిషాలు వేసి, గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుందట.