Janhvi Kapoor: ప్రమాదం అంటేనే ఊహించని సంఘటన. నేడు సమాజంలో ప్రతినిత్యం యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. యువత నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఓవర్ స్పీడు, రాష్ డ్రైవింగ్, మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి మత్తులో డ్రైవ్ చేయడం. ఇలా అనేక రకాల కారణాలతో యువత నిర్లక్ష్యంగా నిండి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇటువంటి ఘటన జైపూర్ లో జరిగింది. దీనిపై బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ స్పందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానితో ఈ ఘటన బయటకు వచ్చింది. అసలు జాన్వీ ఏమని పోస్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం..
తాగేసి ప్రాణాలు తీసేస్తారా.. ప్రాణాలంటే లెక్క లేదా..
రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది మరణిస్తున్నారు. ఒక్కోసారి యువత నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణంగా మారుతుంది. ముఖ్యంగా 18 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగిన వారి వలన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అనుభవం లేకపోవడం, రిస్క్ టేకింగ్ తెలియకపోవడం, ట్రాఫిక్ నియమాలు పట్టించుకోకపోవడం, ఏం జరిగినా వెనకాల పెద్దలు చూసుకుంటారని నిర్లక్ష్యం, ఇలా అనేక రకాల కారణాలతో యువత రోడ్డు ప్రమాదాలు సంభవించడానికి కారణం అవుతున్నారు. తాజాగా జైపూర్ లో జరిగిన ఓ సంఘటన పై ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వి కపూర్ స్పందించారు. తాగి వాహనం నడుపుతున్న మహిళను ఉద్దేశించి ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ‘ఇలాంటి ప్రవర్తనకు ఏమి సమాధానం చెప్తారు? మద్యం సేవించి వాహనం నడపడం, నీతోపాటు చుట్టుపక్కల వారిని ప్రమాదంలో పడవేయడం కరెక్ట్ అని ఎవరైనా ఎలా అనుకుంటారు? త్రాగి వాహనం నడపడం వల్ల సంభవించే మరణాలు వాటి గాయాలు ఎక్కువ. తాగేసి ప్రాణాలు తీస్తున్నారు. ప్రాణాలంటే లెక్క లేదా అని ఇది చట్టవిరుద్ధం యువతకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి’ అని జాన్వి జైపూర్ లో జరిగిన యాక్సిడెంట్ పై ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదం జరిగింది ఇలా ..
జైపూర్ లో మద్యం మత్తులో కారు వేగంగా నడుపుతూ ఒక మహిళ బైకును ఢీ కొట్టింది. బైకు పైన ఒక తండ్రి మైనర్ బాలిక ఉన్నారు. ఆ బాలిక అక్కడికక్కడే మరణించింది. అది గమనించి కారు నడుపుతున్న మహిళ అక్కడి నుంచి పారిపోవడానికి రాంగ్ సైడ్ లో ప్రయత్నించింది. కానీ ఆమె మరో బైక్ ని ఢీకొట్టడంతో పోలీసులు కారును వెంబడించి ఆమెని పట్టుకున్నారు. మద్యం మత్తులో కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విషయంపై జాన్వీ స్పందించిన తీరు ప్రశంసనీయం.
ఇక జాన్వి కపూర్ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో దేవరతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ. ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది లో నటిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న పెద్ది సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
https://www.instagram.com/stories/janhvikapoor/3622161216552277538?utm_source=ig_story_item_share&igsh=eXl0Nm9jaTk3MDJm