Kingdom Song: ఈరోజుల్లో సాంగ్ రిలీజ్‌లను కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒక సినిమాలో నుండి ఒక సాంగ్ విడుదల అవుతుందంటే.. ముందుగా దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అవుతోంది. ఆ ప్రోమో రిలీజ్ అవ్వడం కోసం ఒక అప్డేట్ బయటికొస్తుంది. ఆ తర్వాత ఆ ప్రోమోలోనే పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందో రివీల్ అవుతోంది. ప్రస్తుతం ఇదే ఫార్ములాను అందరూ ఫాలో అవుతున్నారు. అయితే ప్రోమోతోనే సాంగ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం మేకర్స్ చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారు. తాజాగా ‘కింగ్‌డమ్’ సాంగ్ విషయంలో కూడా అదే జరిగింది. విజయ్ దేవరకొండ సినిమాలోని పాట నుండి ప్రేక్షకులు ఏదైనా ఊహిస్తారో.. ఈ పాట ప్రోమో అచ్చం అలాగే ఉంది.
ప్రేమకథ కూడా
రౌడీ హీరోగా గుర్తింపు సాధించిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఒక్క హిట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఎన్నో అంచనాల మధ్య తన నుండి విడుదలయిన ప్రతీ సినిమా కూడా ప్రేక్షకులను చాలానే డిసప్పాయింట్ చేసింది. అందుకే ఈసారి ఎక్కువగా మాట్లాడకుండా కేవలం తన సినిమానే మాట్లాడాలి అన్నట్టుగా సైలెంట్‌గా ‘కింగ్‌డమ్’ కోసం కష్టపడుతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్‌డమ్’ కోసం విజయ్ పూర్తిగా మారిపోయాడు. తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. షార్ట్ హెయిర్‌తో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలయిన సినిమా టీజర్ ద్వారా ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. ఇక తాజాగా విడుదలయిన పాట ప్రోమో చూస్తుంటే ఇందులో ఒక అందమైన ప్రేమకథ కూడా ఉందని తెలుస్తోంది.
ప్రేమతో ముద్దు
‘కింగ్‌డమ్’ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరూ అని ఇప్పటివరకు మేకర్స్ ప్రస్తావించలేదు. ఇక తాజాగా మొదటి పాట ప్రోమో విడుదల అవుతుంది అన్న సమయంలో ఇందులో హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse) అన్న విషయం బయటపడింది. ఇక ఈ పాట ప్రోమోలో విజయ్, భాగ్యశ్రీ ఇద్దరూ బీచ్‌లో కూర్చొని ఉండగా ముందుగా భాగ్యశ్రీ విజయ్‌పై ప్రేమను చూపించడానికి ముద్దుపెడుతుంది. ఆ తర్వాత విజయ్ కూడా ఒక గాఢమైన ముద్దుతో తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. విజయ్ దేవరకొండ సినిమా అంటే హీరోయిన్‌తో లిప్‌లాక్ ఉండడం కామన్ అని ప్రేక్షకులు అనుకుంటారు. అలా అనుకున్నట్టుగా ఈ ప్రోమో రిలీజ్ అయ్యింది.
Also Read: ప్రియాంక, మహేష్ పాట.. ప్యాకప్‌తో నెలరోజులు రెస్ట్ అంటున్న మహేష్
అందమైన క్యాప్షన్
‘కింగ్‌డమ్’ (Kingdom) మూవీలో హృదయం లోపల అంటూ సాగే ఈ పాట వెంటనే మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. అనిరుధ్ అందించిన సంగీతానికి ఆడియన్స్ ఫిదా అయ్యేలా ఉన్నారు. ‘మోసపు నీడల్లో, ఒక బంధం పేరుతో ఒక గాఢమైన ఆకర్షణ ఉంది’ అంటూ ఈ పాట గురించి చిన్న గ్లింప్స్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఆ క్యాప్షన్ లాగానే పాట కూడా చాలా అందంగా ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. మొత్తానికి ‘లైగర్’ లాంటి డిశాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ కాస్త టైమ్ తీసుకొని చేస్తున్న సినిమా కాబట్టి ‘కింగ్‌డమ్’ బాగుంటుందని చాలామంది నమ్ముతున్నారు.
They fake love to survive,
but soon, it feels all too real.#HridayamLopala Promo out now ❤️An @AnirudhOfficial Vibe 🎧
Full song out on May 2nd. 💕 💟
#Kingdom pic.twitter.com/oiJEtDMV77— Naga Vamsi (@vamsi84) April 30, 2025