BigTV English

Health Tips: మీరు తిన్న వెంటనే ఈ 5 పనులు చేస్తున్నారా ? చాలా ప్రమాదం

Health Tips: మీరు తిన్న వెంటనే ఈ 5 పనులు చేస్తున్నారా ? చాలా ప్రమాదం

Health Tips: ఆహారం మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అంతే కాకుండా ఇది శరీరం సక్రమంగా పనిచేయడానికి, ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు తినే ఆహారం అందులో లభించే ఆరోగ్య ప్రయోజనాలను నిర్ణయిస్తుంది. కానీ పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న తర్వాత కూడా శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి.


మీరు ఎంత పోషకాలు ఉన్న ఆహారం తీసుకున్నా.. తిన్న తర్వాత కొన్ని అలవాట్లను మార్చుకోకపోతే అది మీ జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. తరచుగా మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాము. ఇవి జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి. అంతే కాకుండా తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీస్తాయి. భోజనం తర్వాత సరైన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా.. మీరు జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. సాధారణంగా ఆహారం తిన్న తర్వాత చాలా మంది చేసే తప్పులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వెంటనే నీరు తాగడం:
కొంతమంది ఆహారం తిన్న వెంటనే నీరు తాగుతారు. ఇది జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. మీరు ఆహారం తిన్న వెంటనే నీరు తాగితే.. ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతే కాకుండా ఆమ్లత్వం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు పెరుగుతాయి. తిన్న 30 నిమిషాల తర్వాత నీరు తాగడం సరైన మార్గం. మీకు చాలా దాహం వేస్తే మాత్రం గోరువెచ్చని నీటిని చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది.


వెంటనే నిద్రపోవడం లేదా పడుకోవడం:
చాలామంది తిన్న వెంటనే విశ్రాంతి తీసుకోవడానికి పడుకుంటారు. ఇలా తిన్న తర్వాత పడుకోవడం వల్ల కడుపులోని ఆమ్లాలు ఆహారంతో పాటు పైకి వెళ్లి, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలకు కారణమవుతాయి. మీరు ఈ సమస్యలను నివారించాలనుకుంటే.. తిన్న తర్వాత కనీసం 30-40 నిమిషాలు కూర్చోండి కాస్త నడవండి.

ధూమపానం:
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ.. తిన్న వెంటనే సిగరెట్ తాగడం వంటివి ఆరోగ్యానికి మరింత ప్రాణాంతకం. ఇది నికోటిన్ శోషణను రెట్టింపు చేస్తుంది. అంతే కాకుండా పేగులను దెబ్బతీస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. అందుకే ధూమపానం పూర్తిగా మానేయడం మంచిది. ముఖ్యంగా భోజనానికి ముందు, తర్వాత ఒక గంటలోపు అస్సలు సిగరెట్ తాగకూడదు.

వ్యాయామం:
మీరు తిన్న కాస్తయినా సాధారణ వేగంతో నడవండి. కానీ వ్యాయామం గురించి లస్సలు ఆలోచించకండి. భోజనం చేసిన తర్వాత వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీని కారణంగా.. వాంతులు, వికారం, కడుపు నొప్పి , జీర్ణక్రియకు సంబంధించిన అనేక ప్రధాన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు వ్యాయామం చేయాలనుకుంటే.. భోజనం చేసిన ఒకటి నుండి ఒకటిన్నర గంటల తర్వాత వ్యాయామం చేయండి.

Also Read: వీళ్లు.. లెమన్ వాటర్ అస్సలు తాగకూడదు !

స్నానం చేయడం:
భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల రక్త ప్రవాహంలో మార్పులు వస్తాయి. ఇది జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది. భోజనం చేసిన తర్వాత జీర్ణవ్యవస్థ చాలా చురుగ్గా ఉంటుంది. కానీ స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత మారుతుంది . అంతే కాకుండా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×