BigTV English
Advertisement

Copper Bottle: రాగి బాటిల్‌లోని.. నీళ్లు తాగుతున్నారా ? డేంజర్‌లో పడ్డట్లే !

Copper Bottle: రాగి బాటిల్‌లోని.. నీళ్లు తాగుతున్నారా ? డేంజర్‌లో పడ్డట్లే !

Copper Bottle: ప్రస్తుతం చాలా మంది రాగి పాత్రలు, బాటిళ్లలోని నీళ్లు తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే.. రాగిలో ఉండే లక్షణాలు నీటిని శుద్ధి చేస్తాయి. అంతే కాకుండా బ్యాక్టీరియాను తొలగించడానికి, శరీరానికి ముఖ్యమైన పోషకాలను అందించడానికి సహాయపడతాయి. రాగి పాత్రలు, బాటిల్‌లో ఉంచిన నీళ్లు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. చర్మ సౌందర్యానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా బరువు తగ్గడానికి, జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. కానీ రాగి బాటిల్, పాత్రలను సరిగ్గా ఉపయోగించకపోతే.. అది ఆరోగ్యానికి కూడా హానికరం అని మీకు తెలుసా ? మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


శుభ్రం చేయని రాగి బాటిల్‌లోని నీళ్లు తాగడం వల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి. రాగి బాటిల్ లో ఎక్కువ సేపు నీటిని నిల్వ ఉంచడం వల్ల రాగి నీటిలో కరగడం ప్రారంభం అవుతుంది. ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలోకి అధిక మొత్తంలో రాగి చేరే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాగి శరీరానికి అంత మంచిది కాదు. ఇలా ఎక్కువ సార్లు రాగి కలిసిన నీటిని తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.

బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం:
రాగి బాటిల్, పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రం చేయకుండానే ఉపయోగించడం పెద్ద సమస్యగా మారుతుంది. బాటిల్ శుభ్రం చేయకపోతే.. అందులో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ నీటిని తాగడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇరుకైన బాటిల్ మొదలు ఉన్న వాటిని శుభ్రం చేయడం చాలా కష్టం. వీటిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.


కల్తీ రాగి బాటిల్‌ల వాడకం:
మార్కెట్‌లో లభించే అన్ని రాగి బాటిల్‌లు స్వచ్ఛమైన రాగితో తయారు చేయబడినవి కావని గుర్తుంచుకోండి. బయటి నుండి చూడటానికి మాత్రమే రాగితో తయారు చేసిన వాటిలాగా కనిపిస్తాయి. కానీ లోపల ఇతర లోహాలతో తయారు చేయబడతాయి. ఇలాంటి బాటిల్ లలో నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. కల్తీ లోహాలతో తయారు చేసిన బాటిల్ లోని నీళ్లు తాగడం వల్ల రసాయనాలు శరీరంలోకి చేరి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.

Also Read: ఉదయం పూట ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే.. ఏం జరుగుతుందో తెలుసా ?

రాగి బాటిల్ ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి ?

రాగి బాటిల్ ను ప్రతి రోజు శుభ్రం చేయండి. ఇందుకోసం సబ్బు, లేదా నిమ్మరసం ఉపయోగించండి. ముఖ్యంగా బ్యాక్టీరియా పెరగకుండా ఉండేందుకు బాటిల్ లోపలి భాగాన్ని తరచుగా శుభ్రం చేయండి.

రాగి బాటిల్‌లో నీటిని ఎక్కువ సేపు నిల్వ ఉంచకూడదు. ప్రతి 4-5 గంటలకు నీటిని మార్చండి.

బాటిల్ కొనేటప్పుడు తప్పకుండా మంచి బ్రాండ్ మాత్రమే ఎంచుకోండి. కల్తీ బాటిల్స్ అస్సలు కొనకండి.

రాగి బాటిల్‌లోని నీరు ఎక్కువగా తాగినా కూడా ప్రమాదమే కాబట్టి పరిమిత పరిమాణంలో మాత్రమే తాగండి.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×