Jio Fiber Technician Fraudster| దేశంలో సైబర్ మోసాల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆర్బిఐ నివేదిక చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. సైబర్ నేరాలకు పాల్పడే వారు ఎక్కువగా బాధితులకు పరిచయస్తులుగా లేదా ఏదైనా ఉద్యోగిగా, అధికారిగా నమ్మించి వారి బ్యాంకు ఖాతా నుంచి లక్షలు కోట్లు దోచుకుంటారు. తాజాగా ఇలాంటిదే ఓ కేసులో హైదరాబాద్ పోలీసులు ఒక సైబర దొంగను పట్టుకున్నారు. ఈ కేసులో షాకింగ్ విషయమేమిటంటే ఆ దండగుడు జియో ఫైబర్ ఇంటర్నెట్ విభాగంలో ఉద్యోగి. పైగా అతను ఒక టెక్నీషియన్. అందుకే ఈజీగా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరానికి చెందిన 78 ఏళ్ల ఒక రిటైర్డ్ ఉద్యోగి బ్యాంకు ఖాతా నుంచి రూ.1,11,589 మాయమయ్యాయి. ఆయన క్రెడిట్ కార్డు నుంచి ఆ మొత్తం పేమెంట్ జరిగిందని.. క్రెడ్ యాప్ ద్వారా మెసేజ్ వచ్చింది. అది చూసిన బాధితుడు ఆశ్చర్యపోయాడు. ఆ మొత్తం డ్యూ డేట్ లోగా చెల్లించాలని మెసేజ్ లో ఉంది. దీంతో ఆ రిటైర్డ్ ఉద్యోగి.. వెంటనే తన అకౌంట్ ఉన్న యాక్సిస్ బ్యాంకు కు సంప్రదించాడు. అక్కడ తనకు ఈ మెసేజ్ వచ్చిందని.. కానీ తాను ఎలాంటి పేమెంట్లు, కొనుగోళ్లు చేయలేదని తెలిపాడు. అందుకే ఈ లావాదేవి గురించి తనకు వివరాలు కావాలని అడిగారు. కానీ బ్యాంకు ఉద్యోగులు మాత్రం ఆ బిల్లు వివరాలన్నీ ఈ మెయిల్ ద్వారానే తెలుసుకోవాలని.. ఈ మెయిల్ పంపిచామని చెప్పారు.
Also Read: అమ్మాయిలకు లక్షల్లో జీతాలిచ్చి ఆఫీసులో ‘అలాంటి’ పనులు.. నొయిడాలో భారీ స్కామ్
యాక్సిస్ బ్యాంకు కు పలుమార్లు తిరిగి విసిగిపోయిన ఆ పెద్దాయన చివరికి డెస్క్ ఆఫీసర్ సూచన మేరకు ఆ పేమెంట్ చేశాడు. అయితే ఆ తరువాత ఆ క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేసి.. కొత్త క్రెడిట్ కార్డు తీసుకున్నాడు. అయితే కొన్ని రోజుల తరువాత కొత్త క్రెడిట్ కార్డు కూడా వినియోగించారని క్రెడ్ యాప్ ద్వారా మెసేజ్ వచ్చింది. ఈసారి కూడా ఈ రెండో క్రెడిట్ కార్డుని బాధితుడు ఉపయోగించలేదు. అయినా ఆయన క్రెడిట్ కార్డు నుంచి పేమెంట్ జరిగింది. అయితే ఈసారి బ్యాంకు అధికారులతో ఆ పెద్దాయన గట్టిగా ప్రశ్నించాడు. దీంతో అక్కడ ఒక ఉద్యోగి ఆయనకు మోసం ఎలా జరిగిందో వివరించాడు. ఎవరో ఆయన క్రెడిట్ కార్డు వివరాలు సేకరించి.. పేటియం ద్వారా పేమెంట్ చేశారని తెలిపాడు. దీంతో బాధితుడు ఈసారి సైబర పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆ ఫిర్యాదు మేరకు విచారణ వెంటనే ప్రారంభించి ఆ పేటిఎం పేమెంట్ తో ఏం లావాదేవీ జరిగింది.. ఆ వస్తువులు ఎవరు కొన్నారో తెలుసుకొని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతను ఎవరో కాదు.. బాధితుడికి పరిచయస్తుడే.
ఆ దొంగ పేరు ముదికె బాల్ రాజ్. అతను వరంగల్ కు చెందిన వాడు. జియో ఫైబర్ ఇంటర్నెట్ కెనెక్షన్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. తరుచూ ఈ పెద్దాయన ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ లో సమస్యలు సృష్టించి వాటిని పరిష్కరించేందుకు వచ్చేవాడు. అలా రెండు మూడు సార్లు వచ్చాక.. పెద్దాయన పేరుతో ఉన్న ఆ కనెక్షన్ మళ్లీ ప్రారంభించాలంటే ఆయన క్రెడిట్ కార్డు వివరాలు కావాలని అడిగాడు. దీంతో ఆయన ఆ వివరాలు బాల్ రాజ్ కు చెప్పాడు. అలా ఆ వివరాలు సేకరించిన నిందితుడు బాల్ రాజ్ దాంతో ఆయన క్రెడిట్ కార్డులోని డబ్బులు ఖాళీ చేసేశాడు.
సైబర్ మోసాతో జాగ్రత్త..
ఇలాంటి మోసాల బారిన పడే బాధితులు సైబర్ పోలీసులకు వెంటనే సంప్రదించాలి. 1930కు కాల్ చేయండి లేదా సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి. ఎవరితోనూ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఫోన్ నెంబర్ కు వచ్చే ఓటిపీ నెంబర్లు చెప్పకూడదు.