BigTV English

Hair Care: పసుపుతో జుట్టు రాలిపోకుండా అడ్డుకోవచ్చు.. ఇదిగో ఇలా వాడాలి

Hair Care: పసుపుతో జుట్టు రాలిపోకుండా అడ్డుకోవచ్చు.. ఇదిగో ఇలా వాడాలి

పసుపును ఆయుర్వేదంలో ఔషధంగా చూస్తారు. దీన్ని హిందీలో హల్దీ అని పిలుస్తారు. ఇది సాంప్రదాయ భారతీయ వైద్యంలో అత్యంత శక్తివంతమైన పదార్థం. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ. శతాబ్దాలుగా చర్మం, జుట్టు సమస్యలకు పసుపు ఔషధంలా ఉపయోగపడుతోంది. అయితే జుట్టుకు పసుపును ఎలా వాడాలో మాత్రం చాలామందికి తెలియదు. పసుపును జుట్టుకు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మేము చెప్పిన పద్ధతిలో పసుపు పానీయాన్ని తయారు చేసుకొని తాగేందుకు ప్రయత్నించండి చాలు. దీన్ని హల్డీ షాట్ అని పిలుస్తారు. ఈ పసుపు పానీయాన్ని తాగడం వల్ల జుట్టుకు రక్షణ లభిస్తుంది. జుట్టు పెరుగుతుంది. జుట్టు రాలిపోయే సమస్య కూడా అదుపులో ఉంటుంది.


జుట్టు పెరుగుదల కోసం పానీయాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. ఇది చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. పసుపులోని సమ్మేళనం కర్కుమిన్ వైద్య లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కర్కుమిన్ జుట్టు ఆరోగ్యంపై అనేక రకాలుగా ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రతిరోజు పసుపు పానీయాన్ని తాగడం వల్ల నెత్తి మీద ఉన్న ప్రాంతంలో రక్త ప్రవాహం సవ్యంగా జరుగుతుంది. హెయిర్ ఫోలికల్స్ లోనే మురికి పోయి అవి దృఢంగా తయారవుతాయి. జుట్టుకు కావలసిన పోషకాలు ఆక్సిజన్ ను అందిస్తాయి. అలాగే చుండ్రు కూడా జుట్టు పల్చబడడానికి కారణంగా మారుతుంది. చుండ్రు వల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. కాబట్టి పసుపులోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు తలపై ఉన్న మాడును శుభ్రపరుస్తాయి. ఆరోగ్యంగా జుట్టు పెరగడంలో ప్రోత్సాహాన్ని అందిస్తాయి.


పసుపులో ఉన్న యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేషన్ తలపై ఉన్న ఇన్ఫెక్షన్ లను తగ్గిస్తాయి. అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పడేలా చేస్తాయి. మాడుపై ఉత్పత్తి అయ్యే సహజ నూనె అయినా సెబమ్‌ను నియంత్రించడంలో పసుపు సహాయపడుతుంది. సెబమ్ అధికంగా ఉత్పత్తి అయితే అక్కడ ఏర్పడే చర్మ రంధ్రాలకు మూసుకుపోతాయి. దీనివల్ల జుట్టు పెరుగుదల పరిమితమవుతుంది. జుట్టు రాలడానికి కారణం అవుతుంది. కాబట్టి సెబమ్ ఉత్పత్తిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. పసుపు ఆ పని చేయగలదు. పసుపును ప్రతిరోజు రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల జుట్టు మొదళ్లు ఆరోగ్యంగా మారుతాయి. చివర్లు చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.

పసుపు పానీయాన్ని ఇలా తయారు చేయండి
పసుపు పానీయాన్ని తయారు చేయడానికి ఇంట్లో ఉన్న వస్తువులని ఉపయోగించాలి. ఒక స్పూను పసుపు పొడి, చిటికెడు మిరియాల పొడి, ఒక స్పూను తేనె, ఒక స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. ఒక చిన్న గ్లాసులో గోరువెచ్చగా నీరు వేసుకోవాలి. పైన చెప్పిన పదార్థాలు అన్నింటిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిని తాగేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల జుట్టు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.

తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మానికి, జుట్టుకు మేలు చేస్తాయి. అలాగే నిమ్మరసం కూడా శరీరాన్ని శుభ్రపరచడంతో పాటు మాడు పై ఉండే పీహెచ్ బ్యాలెన్స్ ఉండేలా చూస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఇలా పసుపు పానీయాన్ని తయారు చేసుకునే చూడండి. నెల రోజుల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.

Also Read: పసుపుతో ఇలా చేశారంటే.. తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారడం పక్కా..

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×