Bangles: మన హిందూ మతం ప్రకారం మహిళలు గాజులు ధరించడం ఒక సంప్రదాయం. గాజులు వేసుకోవడం వల్ల అందం మాత్రమే కాదు… ఆరోగ్య పరంగా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గాజులు సౌభాగ్యం యొక్క చిహ్నంగా పరిగణించబడతాయి. అమ్మవారి గాజులు ధరించి ఆశీర్వదించి భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేస్తుందని అంటారు. ఈ గాజులు.. స్త్రీకి రక్షా కంకణం వంటిది. గాజుల శబ్దం ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది.
కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులు వేసుకోవడమే మర్చిపోతున్నారు. ఏదో పల్లె టూరుల్లోనే, సిటీల్లో ఉండే కొందరూ ఆడవారు మాత్రమే ఖచ్చితంగా గాజులను వేసుకుంటున్నారు. ఇక ఆఫీసులకు వెళ్లే ఆడవారు మాత్రం ఒక చేతికి ఒక గాజును, మరో చేతికి వాచ్ పెట్టుకుంటున్నారు. మరికొందరు ఆడవారైతే కేవలం పెళ్లిళ్లు, పండగలు, ఫంక్షన్లకు మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కానీ గాజులు వేసుకోవడం మన హిందువు సాంప్రదాయం.. మన మతాన్ని మనమే గౌరవించుకోవాలి.
రక్త ప్రసరణ:
అడవారు చేతిలకు గాజులు ధరించడం వల్ల మణికట్టు ప్రాంతంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. ఇది వారిని మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా గాజులు వేసుకోవడం వల్ల నరాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అలసట, ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే నొప్పులను భరించే శక్తి కూడా లభిస్తుంది. మరి ముఖ్యంగా గాజలు వేసుకోవడం వల్ల శరీరంలో వేడిని తొలగిస్తుందని చెబుతున్నారు.
గర్భిణీ స్త్రీలకు ఉత్తమం:
గర్భిణీ స్త్రీలు రెండు చేతులకు గాజులు వేసుకోవాలి. దీనికి ప్రధాన కారణం గాజుల శబ్ధం కడుపులోని బిడ్డకు ఊరటనిస్తుంది. అంతేకాకుండా గర్భిణులకు ఐదు నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది. ఆ సమయంలో గర్భిణులు అలసటకు గురవుతారు. ఆ అలసటను తగ్గించడంలో గాజులు ఎంతో సహాయపడతాయని కొందరు నమ్ముతున్నారు. కాగా గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు గాజులను వేసుకోవడం వల్ల డెలివరీ టైం వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు వెల్లడిస్తున్నారు.
శిశువుల జననం తరువాత శబ్ధ ప్రభావం:
సంతానం కలిగిన తరువాత మహిళలు వారి దైనందిన కార్యక్రమాలలో ఉన్నప్పుడు శిశువులని ఒకచోట విడిచి, ఆయా పనులు చేసుకోవలసి వస్తుంది. ఆ సమయాలలో నవజాత శిశువులకి ఒంటరితనమూ, దాన్నుంచీ రాగల అభద్రతా కలగకుండా, తమ అమ్మ అక్కడే చుట్టుపక్కలే ఉంది అనే ధైర్యాన్ని అమ్మ చేతి గాజుల శబ్దం ఇస్తుంది.
స్త్రీలు పాదాలకి మువ్వలు ధరించటం వెనుక కూడా ఇది ఒక బలమైన కారణం అని భావిస్తున్నారు. ఇదే కారణం వలన పాకటం మొదలు పెట్టిన శిశువుల చేతులకి మురుగులూ, కాళ్ళకి చిరుమువ్వలూ వేస్తారు. ఆ విధంగా, ప్రతి క్షణం చూడకపోయినా స్త్రీలకి పిల్లల జాడ తెలుస్తూనే ఉంటుంది. శిశువులు దూరంగా వెళ్లినా, లేక వెళ్ళకూడని వైపులకి వెళ్లినా తల్లులకి వెంటనే తెలుస్తుంది. అలాగే, స్త్రీల గాజుల శబ్దం శిశువులకి ఆకర్షణీయంగా ఉండి, వారి దృష్టి అమ్మ మీదే ఉండేలా చేస్తుంది. శబ్దానికి ఈ శక్తి ఉంది కాబట్టే, వివిధ రకాలైన శబ్దాలను చేసే బొమ్మలని శిశువులకు కానుకలుగా ఇవ్వటం మన ఆనవాయితీ.
వైవాహిక బంధం:
చేతికి నిండుగా గాజులు వేసుకోవడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు. అలాగే గాజులు కేవలం అందం కోసం మాత్రమే కాకుండా, మన సంస్కృతి మరియు వారసత్వంలో భాగం అని అంటున్నారు. మరి ముఖ్యంగా గాజులు ధరించడం వల్ల వైవాహిక జీవితంలో దంపతుల మధ్య బంధం బలపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా జాతకంలో ఏవైనా గ్రహాల ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పుడు గాజులు వేసుకోవడం వల్ల వాటి ప్రభావం తగ్గుతుంది అని జ్యోతీష్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: బొట్టు పెట్టుకోకుంటే తలనొప్పిగా అనిపిస్తుందా? ఎందుకో తెలుసుకోండి
ముఖ్య అంశాలు:
మన పెద్దలు ఏదైనా ఒక నియమాన్ని చెబితే దాని వెనుక ఉన్న శాస్త్రీయుత గురించి తెలుసుకోవాలి. ప్రతి అంశాన్ని సైన్స్‌తో జోడించి చెబితే కానీ నమ్మని ఆధునిక అమ్మాయిలకు ఆ నియమం వెనుక ఉన్న శాస్త్రీయతను వివరించి చెప్పాలి. అప్పుడు వారి దాని పట్ల అవగాహనతో పాటు గౌరవాన్ని కూడా పెంపొందించుకోగలరు. ప్రతి ఆచారాన్ని మూఢ నమ్మకం అని కొట్టి పారేయకుండా దాని వెనుక ఉన్న ప్రయోజనం గురించి తెలుసుకొని పాటిస్తే.. అందంతో పాటు సామాజిక ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.