Highest paying countries 2025| విదేశాల్లో ఉద్యోగం చేయాలని భావించే వారికి వచ్చే జీతం చాలా ముఖ్యమైన అంశం. అయితే ఎక్కువ జీతం వస్తుందని మాత్రమే దేశాన్ని ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదు. జీతంతో పాటు అక్కడి జీవన వ్యయం అంటే ఖర్చులు కూడా తప్పకుండా పరిశీలించాలి.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జీతాలు చెల్లించే దేశాల జాబితా చూస్తే.. స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్ వంటి దేశాల్లో సగటు జీతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో ఈ దేశాల్లో ఇళ్లు, అద్దెలు, ఆహారం, రవాణా వంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి.
అందువల్ల అధిక జీతం ఉన్నంత మాత్రాన ఎక్కువ పొదుపు చేయగలమని చెప్పలేం. స్థానిక జీవన వ్యయాలను జీతంతో పోల్చి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం.
అంతర్జాతీయంగా ఉద్యోగం కోసం వెళ్లేవారు కేవలం జీతాన్నే చూడకూడదు. ఆ దేశంలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలి. భవిష్యత్తులో కెరీర్ ఎదుగుదలకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో పరిశీలించాలి. ఆదాయంపై విధించే పన్నులు కూడా జీతంలో మిగిలే మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. పని చేసే వాతావరణం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య సేవలు కూడా ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా కుటుంబంతో జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా అని కూడా చూడాలి. జీతం, ఖర్చులు, పన్నులు, కెరీర్ అవకాశాలను కలిపి పరిశీలిస్తే సరైన నిర్ణయం తీసుకోవచ్చు.
స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అత్యధిక సగటు జీతం అందిస్తోంది. 2025 ర్యాంకింగ్ ప్రకారం స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ సగటు వార్షిక జీతం 131,416 అమెరికన్ డాలర్లుగా నమోదైంది. అధిక వేతనాలతో పాటు ఇక్కడ జీవన వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది.
లక్సెంబర్గ్ సగటు వార్షిక జీతం 108,672 అమెరికన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. దేశంలోని బలమైన ఆర్థిక వ్యవస్థ అనేక ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది. అయితే ఇక్కడ కూడా జీవన వ్యయం ఎక్కువగా ఉండటాన్ని ఉద్యోగులు పరిగణించాలి.
అమెరికా 105,482 డాలర్లతో సగటు వార్షిక జీతంతో మూడో స్థానంలో ఉంది. టెక్నాలజీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి. అయితే జీతాలు ఉద్యోగం, పరిశ్రమ, రాష్ట్రాన్ని బట్టి గణనీయంగా మారవచ్చు.
డెన్మార్క్ 93,305 డాలర్లు సగటు జీతంతో నాలుగో స్థానంలో నిలిచింది.
ఐస్‌లాండ్ 89,075 డాలర్లతో ఐదో స్థానాన్ని పొందింది.
ఆస్ట్రేలియా 87,156 డాలర్లతో ఆరో స్థానంలో ఉంది.
బెల్జియం 86,773 డాలర్లతో ఏడో స్థానంలో నిలిచింది.
యునైటెడ్ కింగ్‌డమ్ 82,403 డాలర్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ) 82,076 డాలర్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మిడిల్ ఈస్ట్ దేశం యుఎఈ (దుబాయ్).
81,534 డాలర్లు సగటు వార్షిక జీతంతో పదో స్థానంలో జర్మనీ ఉంది.
స్విట్జర్లాండ్ – రూ.1,25,37,112
లక్సెంబర్గ్ – రూ. 1,03,67,330
అమెరికా – రూ. 100,63,003
డెన్మార్క్ – రూ. 89,01,315
ఐస్‌లాండ్ – రూ. 84,97,772
ఆస్ట్రేలియా – రూ. 83,14,699
బెల్జియం – రూ. 82,78,161
యునైటెడ్ కింగ్‌డమ్ – రూ.78,61,262
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – రూ.78,30,066
జర్మనీ – రూ. 77,78,359
Also Read: ఇంటర్వ్యూలో కళ్లుమూసుకుని సమాధానం చెప్పాలి.. షాక్ అయిన ఏఐ ఇంజనీర్
అయితే అధిక జీతం వచ్చినంత మాత్రాన సంపాదన బాగుంటుందని గ్యారెంటీ ఉండదు. స్థానిక ఖర్చులు, పన్నులు, ఉద్యోగ అవకాశాలు, కెరీర్ వృద్ధి, జీవన ప్రమాణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.