E-Paper
Advertisement

కోరుకున్న వాడిని దక్కించుకోవడానికి ఇవేం మెంటల్ పనులు… ‘అబ్సెషన్’ చూసి ఆగమైనోళ్ల కోసమే ఈ థ్రిల్లర్ సిరీస్

కోరుకున్న వాడిని దక్కించుకోవడానికి ఇవేం మెంటల్ పనులు… ‘అబ్సెషన్’ చూసి ఆగమైనోళ్ల కోసమే ఈ థ్రిల్లర్ సిరీస్
Advertisement

Psychological Thriller Series on OTT: ‘అబ్సెషన్’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రేమ కోసం ఆ అబ్బాయి చేసే పిచ్చి పని చివరికి అతడి ప్రాణాలనే బలి తీసుకుంటుంది. హర్రర్ మూవీ అయినప్పటికీ ఈ సినిమా స్టోరీ లైన్ మూవీ లవర్స్ కి పిచ్చపిచ్చగా నచ్చేసింది. అచ్చం అలాగే ప్రేమ పేరుతో చేసే పనులు ఎంత దారుణంగా ఉంటాయో చూపించే మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘యే కాళీ కాళీ ఆంఖేన్’ (Yeh Kaali Kaali Ankhein Season 1). ఒక యువకుడు ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటాడు. కానీ ఓ పవర్‌ఫుల్ రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయి అతడిపై పెంచుకున్న పిచ్చి ప్రేమ, అతని జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది. ప్రేమ, అబ్సెషన్, క్రైమ్, పవర్ గేమ్‌లతో సాగే ఈ సిరీస్ ప్రస్తుతం Netflixలో సీజన్ 1, 2తో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…

విక్రాంత్ ఒక చిన్న పట్టణానికి చెందిన సాధారణ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. తన జీవితంలో పెద్దగా ఆశలు లేకపోయినా, తనకు నచ్చిన అమ్మాయి శిఖతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. ఇద్దరూ ప్రేమించుకుంటూ తమ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటుంటారు. కానీ విక్రాంత్ జీవితంలోకి పూర్వ రావడంతో అతని కలలన్నీ ఒక్కసారిగా చెదిరిపోతాయి. పూర్వ ఎవరో మామూలు అమ్మాయి కాదు. ఆ ప్రాంతంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుడు, గ్యాంగ్‌స్టర్ అయిన అఖిరాజ్ అవస్థి కుమార్తె.

Advertisement

చిన్నప్పటి నుంచే విక్రాంత్‌పై ఆమెకు విపరీతమైన ఆకర్షణ ఉంటుంది. విక్రాంత్ తనను ప్రేమించడం లేదని తెలిసినా, అతడిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని పూర్వ నిర్ణయించుకుంటుంది. మొదట్లో విక్రాంత్ ఆమెను దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు అతను. తనకు శిఖపై ప్రేమ ఉందని, తన జీవితంలోకి పూర్వ రావడం తనకు ఇష్టం లేదని స్పష్టంగా చెబుతాడు. కానీ పూర్వ మాత్రం అతని రిజెక్షన్ తో మరింత మొండిగా మారుతుంది.

తన తండ్రికున్న రాజకీయ పలుకుబడి, డబ్బు, గ్యాంగ్‌స్టర్ల బలాన్ని ఉపయోగించి విక్రాంత్ జీవితాన్ని తనకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తుంది. విక్రాంత్ ఆమెను ఎంతగా తప్పించుకోవాలని చూస్తే, సమస్య అంతకంతకూ పెద్దదవుతుంది. అతని కుటుంబం, స్నేహితులు, చివరకు అతను ప్రాణంగా ప్రేమించే శిఖ కూడా పూర్వ అబ్సెషన్‌కు బలయ్యే పరిస్థితి వస్తుంది. తన వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించిన విక్రాంత్, తాను కోరుకోని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.

Advertisement

చివరకు పూర్వను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితిలో చిక్కుకుంటాడు. కానీ పెళ్లితో సమస్య ముగియదు. అసలు ప్రమాదం అక్కడి నుంచే మొదలవుతుంది. పూర్వ నుంచి బయటపడటానికి, తన ప్రేమను తిరిగి దక్కించుకోవడానికి విక్రాంత్ వేసే ప్రతి అడుగు అతడిని మరింత పెద్ద నేరాల వైపు నెట్టేస్తుంది. ఒకవైపు పూర్వ అబ్సెషన్, మరోవైపు తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆలోచన, ఇంకోవైపు శిఖతో తన ప్రేమను నిలబెట్టుకోవాలనే ప్రయత్నం అతడిని తీవ్రమైన మైండ్ గేమ్‌లోకి నెట్టేస్తాయి. పూర్వ నిజంగా విక్రాంత్‌ను ప్రేమిస్తుందా ? లేక అతడిని తన సొంత ఆస్తిలా భావిస్తుందా ? విక్రాంత్ ఆమె నుంచి బయటపడేందుకు వేసే ప్లాన్ ఎంత దూరం వెళ్తుంది ? చివరికి శిఖతో తన ప్రేమను తిరిగి పొందగలిగాడా ? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సిరీస్‌ను చూడాల్సిందే.

తెలుగులో చూడొచ్చా ?

తాహిర్ రాజ్ భాసిన్, ఆంచల్ సింగ్, శ్వేతా త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు సిద్ధార్థ్ సేన్‌గుప్తా దర్శకత్వం వహించారు. ప్రేమకథతో పాటు క్రైమ్, అబ్సెషన్, రాజకీయ శక్తి, మైండ్ గేమ్స్ కలిసిన కథలను ఇష్టపడేవారికి ‘యే కాళీ కాళీ ఆంఖేన్’ సూపర్ ఆప్షన్. రెండు సీజన్లు Netflixలో అందుబాటులో ఉన్నాయి.

Read Also: ఒకరిని ప్రేమించాడు… ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతుండగా షాకింగ్ ట్విస్ట్… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ

Tags

Related News

మనుషుల్ని వేటాడే కోటీశ్వరులు… వేటలో చిక్కుకున్న అమ్మాయే వేటగాళ్లను వేటాడితే ? బ్లడీ సర్వైవల్ థ్రిల్లర్

బిగ్ బాస్ తరహాలో మరో రియాలిటీ షో.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సైకోతో ఇంటర్వ్యూ… ట్విస్టులతో మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

టీవీ రేటింగ్స్ కోసం నేరస్థులను లైవ్‌ లో పట్టుకునే రియాలిటీ షో… హై-టెన్షన్ థ్రిల్లర్

11 ఏళ్ల క్రితం మాయమైన కూతురు… కట్ చేస్తే క్రేజీ ట్విస్ట్… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్

శోభనం అయ్యాక మ్యాటర్ లేదంటూ రూమర్స్… పిల్లల్ని కని చూపిస్తే పొలం మొత్తం అతనికే… తెలుగులోనే ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ

రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్

ఎడారిలో తప్పిపోయిన బాలుడి సాహసం… ఈ అడ్వెంచర్ మూవీని తెలుగులోనూ చూడవచ్చు

Big Stories

Advertisement
×