ఆధునిక జీవితంలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడు, ఎవరికి గుండెపోటు వస్తుందో చెప్పలేని పరిస్థితి. అధిక కొలెస్ట్రాల్ సమస్య కూడా వేగంగా పెరగడం వల్ల గుండెపోటు బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయి గుండెకు రక్తాన్ని సరఫరా కాకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల కూడా గుండెపోటు వస్తుంది.
ఏ పండు తినాలి?
అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలంటే ఆహారం, జీవనశైలి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలను తగ్గించాలి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించే ఆహారాన్ని కూడా తినాలి. మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించే శక్తి దానిమ్మ పండుకు ఉంది. ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు తినేందుకు ప్రయత్నించండి. ఇది కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే సిరలో పేరుకున్న కొలెస్ట్రాల్ కూడా కరిగిపోయే అవకాశం ఉంటుంది.
దానిమ్మలో పాలీఫెనాల్స్, ఎలాజిక్ ఆమ్లం అధికంగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తాయి. ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణం చెంది క్రమంగా ధమనులలో పేరుకుపోయి అడ్డంకిగా ఏర్పడతాయి. కాబట్టే దీనివల్ల ధమనులు మూసుకుపోతాయి. గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచేస్తాయి. కాబట్టి ఈ ప్రక్రియను ఆపడానికి దానిమ్మ ఎంతో ఉపయోగపడుతుంది.
అనేక పరిశోధనలు కూడా దానిమ్మలో కొలెస్ట్రాల్‌ను కరిగించే శక్తి ఉందని నిరూపించాయి. దానిమ్మను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెజబ్బులు రాకుండా ఉంటాయి. ఇది గుండెపై పడే ఒత్తిడి తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
ఎప్పుడు తినాలి?
దానిమ్మ పండు తినడానికి ఉత్తమ సమయం ఉదయమే. మీ రోజును నేరుగా దానిమ్మ పండుతో ప్రారంభించవచ్చు. అయితే దీన్ని జ్యూస్ చేసి తాగడం వంటివి చేయవద్దు. నేరుగా దానిమ్మ గింజలను తినండి. ఇది ఎంతో మంచిది.
దానిమ్మ గింజలు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ గింజలలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఆకలి వేయకుండా అడ్డుకుంటుంది. అలాగే బరువు పెరగకుండా కూడా నిరోధిస్తుంది. దానిమ్మ గింజలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది.
చర్మ అందానికి
దానిమ్మ గింజలు చర్మాన్ని మృదువుగా మార్చడానికి సహాయపడతాయి. కాబట్టి మీ చర్మం అందంగా మెరవాలన్నా కూడా ప్రతిరోజు దాన్ని మనం తినాల్సిందే. దానిమ్మ గింజలు తినడం వల్ల క్యాన్సర్ కణాలు పెరుగుదలకు కూడా తగ్గుతుంది. కాబట్టి భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా ఉండాలనుకుంటే ఈ రోజు నుంచే దానిని పండును తినడం అలవాటు చేసుకోవాలి.