E-Paper
Advertisement

PCOS సమస్యకు గుమ్మడి గింజలతో చెక్.. హార్మోన్ల సమతుల్యత కోసం ప్రకృతి ఇచ్చిన వరం!

PCOS సమస్యకు గుమ్మడి గింజలతో చెక్.. హార్మోన్ల సమతుల్యత కోసం ప్రకృతి ఇచ్చిన వరం!
Advertisement

Pumpkin Seeds For Pcos: తల్లి కావడం ప్రతి స్త్రీ కల, కానీ కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వారి మార్గంలో పెద్ద అడ్డంకిగా మారతాయి. ఈ సమస్యలలో ఒకటి PCOS అంటే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. PCOSను పాలీసిస్టిక్ ఓవరీ డిజార్డర్ అని కూడా అంటారు. గత కొన్ని సంవత్సరాలుగా మహిళల్లో ఈ సమస్య వేగంగా పెరుగుతోంది. PCOS కారణంగా మహిళలు గర్భం దాల్చడంలో ఇబ్బంది పడతారు. ఇది మహిళల హార్మోన్లను ప్రభావితం చేసే ఒక పరిస్థితి. దీని కారణంగా..ఇర్రెగ్యులర్ పీరియడ్స్ , మొటిమలు , వంధ్యత్వం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే.. సకాలంలో దీనిని గుర్తించి చికిత్స చేయడం ద్వారా దీనిని నయం చేయవచ్చు. PCOS తో బాధపడుతున్న మహిళలు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.PCOS ఉన్నవారికి గుమ్మడి గింజలు తినడం మంచిది. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PCOS అంటే ఏంటి?
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేది అండాశయాలు అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు సంభవించే ఒక హార్మోన్ల అసమతుల్యత. ఒక మహిళకు PCOS ఉంటే.. ఆమె అండాశయాలు ఆండ్రోజెన్లు అనే హార్మోన్లను అసాధారణ పరిమాణంలో ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. దీని వల్ల  పునరుత్పత్తి హార్మోన్లు అసమతుల్యంగా మారతాయి. PCOS ఉన్న మహిళలకు తరచుగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అనూహ్య అండ విడుదల వంటి సమస్యలు ఉంటాయి.

Advertisement

PCOS ఏ వయస్సులో వస్తుంది?
ఆయుర్వేదంలో PCOD, PCOS లకు ఒక సర్వరోగ నివారిణి ఉంది. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హార్మోన్ల సమతుల్యతను మెరుగు పరుస్తుంది.

PCOD-PCOS కు ఆయుర్వేద నివారణ:

Advertisement

చాలా మంది మహిళలు తమ 20 లేదా 30 ఏళ్ల వయస్సులో.. ముఖ్యంగా గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఊబకాయంతో ఉన్న మహిళలకు లేదా వారి కుటుంబంలో ఈ సమస్య ఉన్నవారికి ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Also Read: జిమ్ అవసరం లేకుండానే ఫిట్‌గా ఉండటం ఎలా?

PCOSలో గుమ్మడి గింజలు:
PCOS తో బాధపడుతున్న మహిళలు తమ ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చుకోవాలి. ఈ సమస్యకు సర్వరోగ నివారిణిలా పని చేసే కొన్ని పదార్థాలు ఉన్నాయి. ఉదాహరణకు.. గుమ్మడి గింజలు. గుమ్మడి గింజలు పోషకాలకు నిధి లాంటిది. అవి మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఒకవేళ మహిళ PCOS తో బాధపడుతుంటే.. గుమ్మడి గింజలను తినడం వల్ల హార్మోన్ల స్థాయి సమతుల్యం అవుతుంది. ఇది మెగ్నీషియంకు కూడా చాలా మంచి మూలంగా చెబుతారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని కూడా సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా గుమ్మడి గింజలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే.. వీటిని తినడం వల్ల ఎముకలు బలపడతాయి. ఇది కాకుండా.. అవి నిద్ర విధానాన్ని మెరుగు పరచడానికి కూడా పని చేస్తాయి.

PCOS ఉన్నవారయితే. మీ ఆహారంలో కనీసం ఒక టీస్పూన్ గుమ్మడి గింజలను చేర్చుకోండి. మీరు వాటిని సూప్‌లు లేదా స్మూతీలలో కలుపుకోవడం వంటి వివిధ మార్గాల్లో కూడా తినవచ్చు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×