Big Tv Live Originals: అరటి పండు తొక్కను ఒలిచే విషయంలో చాలామంది గందరగోళానికి గురవుతారు. దీనికి సరైన పద్ధతి ఏమిటి, ఎటువైపు నుంచి ఒలవడం సులభం, సహజమో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది అరటి పండును పై భాగం నుంచే ఒలుస్తారు. కాండం భాగం గట్టిగా ఉండటం వల్ల, దాన్ని పట్టుకుని సులభంగా ఒలిచేస్తారు. అయితే పండు బాగా పండిపోతే ఇలా ఒలిచినప్పుడు పాడైపోతుంది. కొన్ని సార్లు అయితే పండు చిదిమిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. దీంతో లోపలి భాగం చేతికి అంటుకునే అవకాశం ఉంది.
అందుకే అరటిపండును పైభాగం నుంచి కాకుండా కింద నుంచి ఒలవడం మంచిది. నిజానికి ఇదే సహజమైన పద్ధతి. ఎప్పుడైనా కోతులకు అరటిపండు దొరికితే అవి పండు కింద భాగం నుంచే తొక్కను ఒలుస్తాయి. ఇదే చాలా సులువైన పద్ధతి కూడా. పండు కింది భాగం సాధారణంగా మృదువుగా ఉంటుంది. ఈ పద్ధతిలో అరటి పండు చిదిమే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే, కాండం భాగం చివరిలో ఉండటం వల్ల, దాన్ని సులభంగా విసిరేయవచ్చు.
ఏది సరైన పద్ధతి?
అరటి పండును కొస వైపు నుంచి ఒలవడం సులభమని ఆహార నిపుణులు సూచిస్తారు. ఈ విధానం తొక్కను సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే పండు కూడా చిదిమిపోకుండా ఉంటుంది.
అయితే, ఇది వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. కాండం వైపు నుంచి అరటి తొక్కను ఒలిచే అలవాటు కొందిరికి ఉంటుంది. బాగా అలవాటు ఉంటుంది కాబట్టి అది వారికి సౌకర్యంగానే ఉంటుంది.
తొక్కను ఒలిచిన తర్వాత, చేతులను కడుక్కోవడం మంచిది, ఎందుకంటే తొక్కలో ఉండే కెమికల్స్ చేతులకు అంటుకునే అవకాశం ఉంటుంది.
ALSO READ: చిన్న వయసులోనే నిద్రలేమి సమస్యలా?
నిజానికి కూడా అరటి పండు చాలా మెత్తగా ఉన్నట్లయితే, కొస వైపు నుంచి ఒలవడం మంచిది. ఎందుకంటే ఇది చిదిమే అవకాశాన్ని తగ్గిస్తుంది. కాండం వైపు నుంచి పండును ఒలిస్తే అది చిదిమిపోయే అవకాశం ఉంటుంది. అందుకే కింద భాగం నుంచి ఒలవడమే మంచిదని ఆహార నిపుణులు చెబుతారు.
అసలు పద్ధతి ఇదే అయినప్పటికీ అలవాట్లను బట్టి, సౌకర్యంగా ఉండే దాన్ని బట్టి చాలా మంది అరటి తొక్కను తమను నచ్చినట్టుగానే ఒలుస్తారు. ఈ రెండు పద్ధతుల్లో ఏది సరైనది అనేది వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడుతుంది.
అరటి పండు తొక్కను ఏ వైపు నుంచి ఒలిచినా పోషక విలువల్లో ఎలాంటి మార్పు ఉండదు. అయితే, కింది నుంచి ఒలిచే పద్ధతి కొంచెం సులభంగా, త్వరగా ఉంటుందని కొందరు నిపుణులు అంటారు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.