BigTV English
Advertisement

Chia Seeds: చియా సీడ్స్ తింటున్నారా ? ఈ విషయాలు తెలుసుకోకుంటే ప్రమాదం

Chia Seeds: చియా సీడ్స్ తింటున్నారా ? ఈ విషయాలు తెలుసుకోకుంటే ప్రమాదం

Chia Seeds: ప్రస్తుతం చియా సీడ్స్ తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ చిన్న చిన్న విత్తనాల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా జీర్ణ క్రియతో పాటు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇదిలా ఉంటే..  వీటిని తినే పద్దతి తెలుసుకున్నప్పుడు మాత్రమే బెనిఫిట్స్ పూర్తిగా పొందగలుగుతాము. అంతే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి. మరి చియా సీడ్స్ తినడానికి సరైన మార్గం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


చియా సీడ్స్ తినడానికి సరైన మార్గం:

చియా సీడ్స్ ఎప్పుడూ నేరుగా లేదా ఎండబెట్టి అస్సలు తినకూడదు. వాటిని నీటిలో లేదా పాలు, కొబ్బరి నీళ్లు వంటి వాటితో కలిపి తీసుకోవాలి. వీటిని కనీసం 30 నిమిషాల నుండి 2 గంటల పాటు నానబెట్టి తీసుకోవడం ముఖ్యం. ఇలా చేయడం వల్ల అవి జెల్ లాగా మారిపోతాయి. ఇలా మారిన చియా సీడ్స్ తినడం వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. అంతే కాకుండా శరీరం వాటిలోని పోషకాలను గ్రహించగలుగుతుంది.


ఖాళీ కడుపుతో తీసుకోకండి:
చాలా మంది చియా సీడ్స్ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిదని భావిస్తారు. కానీ ఇది అందరికీ సరైనది కాదు. వీటిని భోజనంతో పాటు , స్నాక్‌గా తీసుకోవడం మంచిదే. ముఖ్యంగా కడుపులో గ్యాస్ లేదా అసిడిటీ సమస్యలు ఉన్న వారు చియా సీడ్స్ ఖాళీ కడుపుతో తీసుకోకుండా ఉండటం మంచిది.

సరైన మోతాదులో తీసుకోండి:
చియా సీడ్స్ లో అనేక పోషకాలు ఉంటాయి. కానీ వీటిని ఎక్కువగా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి హానికరం. రోజుకు 1 నుండి 2 టేబుల్ స్పూన్లు (సుమారు 20 గ్రాములు) కంటే ఎక్కువ అస్సలు తీసుకోకండి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి.

నీటి మొత్తాన్ని పెంచండి:
చియా సీడ్స్‌ను నీటిలో నానబెట్టిన్పుడు ఇవి సైజ్ పెరుగుతాయి. వీటిని తిన్న తర్వాత నీరు సరిగ్గా తీసుకోకపోతే.. శరీరం డీ హైడ్రేట్ బారిన పడుతుంది. దీని వల్ల మలబద్ధకం వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కవగా ఉంటుంది. కాబట్టి.. వీటితో పాటు నీరు పుష్కలంగా త్రాగడం ముఖ్యం.

కూరగాయలు, పండ్లతో చియా విత్తనాలు:
చియా సీడ్స్, స్మూతీ, పెరుగు, సలాడ్ లేదా పండ్లతో తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఆహార పదార్థాల యొక్క రుచిని మెరుగుపరచడమే కాకుండా పోషకాల కలయికను సమతుల్యంగా ఉంచుతుంది. చియా సీడ్స్ ను సాధారణ నీటిలో నానబెట్టి తాగడం కంటే.. స్మూతీ, పెరుగతో కలిపి తీసుకోవడం మంచిది.

Also Read: బ్లాక్ రైస్ తింటే.. ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోవడం గ్యారంటీ !

డయాబెటిస్, బీపీ రోగులు:
చియా సీడ్స్ రక్తంలో చక్కెర , రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. కానీ మీరు ఇప్పటికే మందులు వాడుతున్నట్లయితే.. డాక్టర్ సలహా లేకుండా వీటిని తినకండి. ఈ విత్తనాలు తక్కువ రక్తపోటు లేదా చక్కెర తగ్గుదలకు కారణమయ్యే మందుల ప్రభావాన్ని పెంచుతాయి.

Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×