OTT Movie : మలయాళం అగ్ర నటుడు సురేష్ గోపి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో యాక్షన్ సినిమాలంటే ఇతనే గుర్తుకు వచ్చేవాడు. తన నటనతో ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అయితే ఇతని వారసుడు మాధవ్ సురేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ హీరో నటించిన ఒక యాక్షన్ మూవీ, థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుని, 6 నెలల తరువాత ప్రస్తుతం ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ మూవీ స్టోరీ ఒక సాంప్రదాయ నృత్యం చుట్టూ తిరుగుతుంది. ఎమోషన్స్, యాక్షన్స్ సన్నివేశాలతో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
మనోరమ మ్యాక్స్ (Manorama MAX) లో
ఈ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కుమ్మాట్టికలి’ (Kummatikali). 2024 లో విడుదలైన ఈ సినిమాకి ఆర్.కె. విన్సెంట్ సెల్వ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సురేష్ గోపి కుమారుడు మాధవ్ సురేష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ డ్రామా జానర్‌లో రూపొందింది. ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2025 ఏప్రిల్ 25 నుంచి, ఈ మలయాళం సినిమా మనోరమ మ్యాక్స్ (Manorama MAX) లో అందుబాటులోకి వచ్చింది.
స్టోరీలోకి వెళితే
ఈ సినిమా స్టోరీ సముద్ర తీరంలో జరిగే ‘కుమ్మట్టికలి’ పండుగ నేపథ్యంలో సాగుతుంది. ‘కుమ్మటి బాయ్స్’ అనే నలుగురు యువకుల చుట్టూ తిరుగుతుంది. ఇందులో మాధవన్ అనేయువకుడు దూకుడు స్వభావం కలిగి ఉంటాడు. కేరళలో ఒక సముద్ర తీర ప్రాంతంలో ఉండే ఒక గ్రామంలో ‘కుమ్మాట్టికలి’ అనే గౌరవించదగిన సాంప్రదాయ డాన్స్ ఉంటుంది. అయితే ఆ గ్రామంలో కుట్రలు, కుతంత్రాలతో మాధవన్ విసిగిపోతాడు. ఓవైపు ఆంతరించిపోతున్న కళకు రూపు దిద్దుతూ, మరోవైపు గ్రామంలోని కుట్ర దారులతో పోరాడుతూ, ఒక యోధుడిలా ముందుకు సాగుతాడు. ఈ క్రమంలో శక్తివంతమైన శత్రువులను మాధవన్ ఎదుర్కోవలసి వస్తుంది. అదే సమయంలో తన కుటుంబం, సమాజంలోని సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది.
చివరికి మాధవన్ ‘కుమ్మట్టికలి’ పండుగ రోజు, సాంప్రదాయ కళను వెలుగులోకి తెస్తాడా ? అందరి చేత గౌరవింపబడతాడా ? గ్రామంలోని ముఠా కక్షలను రూపుమాపుతాడా ? అనే విషయాలను ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీని చూసి తెలుసుకోవాలి. సాంప్రదాయ విలువలను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా, మాధవన్ పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు, ఒక ఆసక్తికరమైన అనుభూతి కలుగుతుంది. థియేటర్లలో రిలీజైన 6 నెలల తరువాత , ఈ రోజునుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఆలస్యం చేయకుండా ఈ మూవీ పై కూడా ఓ లుక్ వేయండి.
Read Also : ముస్లింలకు వారసత్వంగా హిందూ దేవతల వేషాలు … నేషనల్ అవార్డ్ విన్నర్ తెరకెక్కించిన మస్ట్ వాచ్ మూవీ