Jewellery Cleaning: వెండి ఆభరణాలు, విగ్రహాలు, పాత్రలు వాడుతున్నా కొద్దీ కొన్ని రోజుల తర్వాత మెరుపును కోల్పోవడం ప్రారంభిస్తాయి. వెండి, సల్ఫర్ మధ్య రసాయన చర్య కారణంగా వెండి ఆభరణాలు నల్లగా మారతాయి. ఇలా రంగు మారిన వెండి వస్తువులు, నగలను వాడటానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో వాటిని తిరిగి తెల్లగా కొత్త వాటిలాగా మార్చాలంటే.. కొన్ని రకాల టిప్స్ పాటించడం ముఖ్యం.
క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల కూడా వెండి వస్తువులు నల్లగా మారకుండా ఉంటాయి. ముఖ్యంగా వీటిని శుభ్రం చేయడానికి ఉప్పు , బేకింగ్ సోడా వంటి హోం రెమెడీస్ కూడా ఉపయోగించవచ్చు. ఎలాంటి హోం రెమెడీస్ సహాయంతో వెండి ఆభరణాలు, వస్తువులను తెల్లగా మార్చవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్:
వెండి ఆభరణాలను శుభ్రం చేయడానికి ఇది ఉత్తమమైన, సులభమైన మార్గం. ముందుగా.. ఒక పెద్ద గిన్నె తీసుకొని దాని ఉపరితలాన్ని అల్యూమినియం ఫాయిల్‌తో కప్పి.. మెరిసే వైపు పైకి ఉండేలా చూసుకోండి. తరువాత ఒక గిన్నెలో మరిగించిన నీటిని తీసుకోండి. అందులో 1/4 కప్పు బేకింగ్ సోడా కలపండి. వెండి ఆభరణాలు అల్యూమినియం ఫాయిల్‌ను తాకే విధంగా గిన్నెలో ఉంచండి. ఆ లిక్విడ్‌లో 1 నిమిషం నుండి 5 నిమిషాలు వెండి వస్తువులను నానబెట్టండి. 5 నిమిషాల తర్వాత.. ఈ ద్రావణం నుండి ఆభరణాలను తీసివేసి.. మృదువైన మెత్తటి క్లాత్‌తో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల వెండి వస్తువులు తెల్లగా మారతాయి. అంతే కాకుండా ఇవి కొత్త వాటిలాగా మెరుస్తాయి.
నిమ్మకాయ, ఉప్పు:
నిమ్మకాయ, ఉప్పను విగ్రహాలు, పూజా పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని ఉపయోగించడానికి మీరు చేయాల్సిందల్లా ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ నుండి జ్యూస్ తీసి అందులో 3 టేబుల్ స్పూన్ల ఉప్పు , కాస్త గోరువెచ్చని నీటిని కలపండి. తర్వాత వెండి వస్తువును ఈ నీటిలో వేసి 5 నిమిషాలు నానబెట్టండి. కొంత సమయం తర్వాత..ఈ వాటిని బయటకు తీయండి. తర్వాత మెత్తని క్లాత్ తో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మీ వెండి బ్రాస్లెట్‌పై ఉన్న మరకలు తొలగిపోతాయి.
టూత్‌పేస్ట్:
టూత్‌పేస్ట్ వెండి శుభ్రపరిచేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక ప్లేట్‌లో 1 టీ స్పూన్ పరిమాణంలో టూత్‌పేస్ట్ తీసుకొని.. నగలు లేదా వెండి సామాగ్రిని పాలిష్ చేయడానికి, మరకలను తొలగించడానికి డ్రష్ తో రుద్దండి. 5 నిమిషాలు ఇలా చేయడం వల్ల నగలు తెల్లగా మెరుస్తాయి. తర్వాత వీటిని శుభ్రమైన నీటితో క్లీన్ చేయండి. తరచుగా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నల్లటి పాత్రలు కూడా తెల్లగా మెరిసిపోతాయి.
పాత్రలు కడిగే సబ్బు, నీరు:
వెండి నగలు, పాత్రలపై ఉన్న మొండి మరకలను తొలగించడానికి లాండ్రీ డిటర్జెంట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు చేయాల్సిందల్లా ఒక గిన్నె గోరువెచ్చని నీటిలో ఒక చిన్న కప్పు డిటర్జెంట్ కలపడం. తరువాత వెండి ఆభరణాలను ఆ ద్రావణంలో 5 నుండి 7 నిమిషాలు నానబెట్టండి. అనంతరం బ్రష్ సహాయంతో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల నల్లటి వెండి ఆభరణాలు అయినా కూడా తెల్లగా మెరిసిపోతాయ్.
Also Read: తెల్లజుట్టును నల్లగా మార్చడంలో.. వీటిని మించినది లేదు !
పాత్రలపై ఉన్న మురికిని తొలగించడానికి పదునైన బ్రష్‌ను ఉపయోగించండి. ఆ తరువాత.. గోరు వెచ్చని నీటితో నిండిన మరొక గిన్నె తీసుకొని దానిలో ఆభరణాలను ఉంచండి. గిన్నె నుండి నగలను 10 నిమిషాల తర్వాత తీసివేసి, బ్రష్ కు కాస్త బేకింగ్ సోడా రుద్ది క్లీన్ చేయండి. ఇలా చేయడం ద్వారా నల్లగా మారిన మీ ఆభరణాలకు మెరుపు కొత్త తిరిగి వస్తుంది.