BigTV English

Face Mask For Pimples: ముఖంపై మొటిమలా ? ఈ ఒక్క ఫేస్ ప్యాక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్

Face Mask For Pimples: ముఖంపై మొటిమలా ? ఈ ఒక్క ఫేస్ ప్యాక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్

Face Mask For Pimples: ప్రస్తుతం చాలా మంది మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మొటిమలు ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తాయి. అంతే కాకుండా ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఇలాంటి సమయంలో చాలా మంది రకరకాల ఫేస్ క్రీములు వాడుతుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో హోం మేడ్ ఫేస్ ప్యాక్ వాడటం మంచిది. ఇవి మొటిమలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ అందిస్తాయి. ముఖం కాంతివంతంగా కనిపించడానికి అంతే కాకుండా మొటిమలు తొలగిపోవడానికి ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


మొటిమలను తగ్గించే బెస్ట్ ఫేస్ ప్యాక్స్:

1. తేనె, దాల్చినచెక్క పొడితో మాస్క్:
తేనెలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. దాల్చినచెక్క పొడిలో యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ రెండింటి కలయిక మొటిమలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.


తయారీ విధానం: 1 చెంచా తేనె , 1/2 చెంచా దాల్చినచెక్క పొడిని తీసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రదేశంలో లేదా మొత్తం ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఈ మాస్క్‌ను వారానికి 2-3 సార్లు వాడవచ్చు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

2. పసుపు, శనగపిండితో మాస్క్:
పసుపులో కుర్కుమిన్ అనే క్రియాశీలక పదార్ధం ఉంటుంది. ఇది యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాలను కలిగి ఉంటుంది. శనగపిండి చర్మంలోని అదనపు నూనెను గ్రహించి, చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది.

తయారీ విధానం:
1 చెంచా శనగపిండి, 1/2 చెంచా పసుపు పొడి, కొద్దిగా నీరు లేదా రోజ్ వాటర్‌ని కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. తర్వాత ఈ పేస్ట్‌ను ముఖానికి మాస్క్‌లా వేసి, అది ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయండి.
ఈ మాస్క్‌ను వారానికి 2 సార్లు వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.

3. ముల్తానీ మట్టి, వేప ఆకుల పొడితో మాస్క్:
ముల్తానీ మట్టి జిడ్డు చర్మానికి చాలా మంచిది. ఇది చర్మంలోని అదనపు నూనె, మలినాలను తొలగిస్తుంది. వేప ఆకులలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయ. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.

Also Read: ఇలాంటి ఫుడ్ తింటే.. కంటి అద్దాల అవసరమే ఉండదు తెలుసా ?

తయారీ విధానం:1 చెంచా ముల్తానీ మట్టి, 1/2 చెంచా వేప ఆకుల పొడి, సరిపడినంత రోజ్ వాటర్‌ని కలపండి. ఇలా తయారు చేసిన పేస్ట్‌ను ముఖానికి మాస్క్‌లా వేసి, 15 నిమిషాల తర్వాత లేదా అది ఆరిపోయిన తర్వాత కడిగేయండి.
ఈ మాస్క్‌ను వారానికి 1-2 సార్లు వాడవచ్చు. దీనిని తరచుగా వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ముఖ్యమైన సూచనలు:

ఏదైనా కొత్త మాస్క్ వాడే ముందు, ఒకసారి మీ చేయి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

మొటిమలను గిల్లడం లేదా తాకడం మానుకోండి.

ఈ మాస్క్‌లతో పాటు, సరైన ఆహారం, తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా చర్మాన్ని శుభ్రపరచడం కూడా ముఖ్యం.

Tags

Related News

Malaria Fever: మలేరియా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !

TFM – Skin: TFM అంటే ఏమిటి? దీని వల్ల స్కిన్ సమస్యలు ఎలా వస్తాయో తెలుసా?

Plastic Cups: ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ, టీలను తాగుతున్నారా? వెంటనే మానేయండి.. లేదంటే?

Foods For Eye Health: ఇలాంటి ఫుడ్ తింటే.. కంటి అద్దాల అవసరమే ఉండదు తెలుసా ?

Makhana: వీళ్లు.. పొరపాటున కూడా మఖానా తినకూడదు !

Big Stories

×