E-Paper
Advertisement

మీరు రోజుకు ఎన్ని స్క్వాట్స్ చేయాలి? మీ ఫిట్‌నెస్ లెవెల్ తెలిపేందుకు గుంజీల పరీక్ష

మీరు రోజుకు ఎన్ని స్క్వాట్స్ చేయాలి? మీ ఫిట్‌నెస్ లెవెల్ తెలిపేందుకు గుంజీల పరీక్ష
Advertisement

స్క్వాట్స్ (గుంజీలు) అంటే చాలా మంది జిమ్‌లో చేసే వ్యాయామంగా మాత్రమే భావిస్తారు. కానీ నిజానికి ఇది మన రోజువారీ జీవితంలో భాగంగా ఉంటుంది. కుర్చీలో కూర్చోవడం, లేవడం లేదా నేలపై ఉన్న వస్తువును ఎత్తుకోవడం వంటి పనుల్లో కూడా స్క్వాట్ కదలికే ఉపయోగపడుతుంది.

అందుకే శరీర బలం, సమతుల్యత, కదలిక సామర్థ్యాన్ని అంచనా వేసే ముఖ్యమైన వ్యాయామంగా గుంజీలను నిపుణులు భావిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ ఈ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి స్క్వాట్స్ చేయగల సామర్థ్యం మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో ఉపయోగపడుతుంది.

గుంజీలు ఆరోగ్యానికి ఎందుకు ముఖ్యమైనవి?

Advertisement

గుంజీలు మీ బాడీవెయిట్ ఆధారంగా చేసే వ్యాయామం. అందుకే దీని ద్వారా ఒకేసారి అనేక శారీరక సామర్థ్యాలను పరీక్షించవచ్చు. కాళ్ల బలం, కీళ్ల కదలిక, సమతుల్యత, శరీర నియంత్రణను అంచనా వేస్తుంది. స్క్వాట్ చేసే సమయంలో మోకాళ్లు, చీలమండలు, నడుము, కీలక కండరాలు కలిసి పనిచేస్తాయి. శరీరంలో ఏదైనా బలహీనత లేదా కదలికలో సమస్య ఉంటే గుంజీలు చేసే సమయంలో సులభంగా గుర్తించవచ్చు. ఈ వ్యాయామం రోజువారీ పనులకు దగ్గరగా ఉండటం వల్ల స్వతంత్రంగా జీవించే సామర్థ్యాన్ని కూడా సూచిస్తుంది. ముఖ్యంగా వృద్ధులలో మంచి స్క్వాట్ సామర్థ్యం ఉండటం వల్ల నడక, సమతుల్యత మెరుగుపడవచ్చు. అలాగే పడిపోవడం వంటి ప్రమాదాలను కూడా తగ్గించవచ్చు.

వయసును బట్టి ఎన్ని స్క్వాట్స్ చేయాలి?

ప్రతి ఒక్కరికీ ఒకే సంఖ్య సరిపోదు. వయసు, బరువు, శారీరక సామర్థ్యం, వ్యాయామ అనుభవం వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ కొన్ని సాధారణ ప్రమాణాలు ఉన్నాయి.

వయసు ఆధారంగా పురుషులు రోజుకు ఎన్ని గుంజీలు చేయవచ్చంటే

  • 18 – 25 సంవత్సరాలు ఉన్నవారు 44 నుంచి 49 గుంజీలు
  • 26 – 35 సంవత్సరాలు.. 40 నుంచి 45 స్క్వాట్స్
  • 36 – 45 సంవత్సరాలు.. 35 నుంచి 41 స్క్వాట్స్
  • 46 – 55 సంవత్సరాలు.. 29 నుంచి 35 స్క్వాట్స్
  • 56 – 65 సంవత్సరాలు: 25 నుంచి 31 స్క్వాట్స్
  • 65 ఏళ్లు పైబడినవారు.. 22 నుంచి 28 స్క్వాట్స్

మహిళలు

  • 18 – 25 సంవత్సరాలు: 37 నుంచి 43 స్క్వాట్స్
  • 26 – 35 సంవత్సరాలు: 33 నుంచి 39 స్క్వాట్స్
  • 36 -45 సంవత్సరాలు: 27 నుంచి 33 స్క్వాట్స్
  • 46 -55 సంవత్సరాలు: 22 నుంచి 27 స్క్వాట్స్
  • 56 -65 సంవత్సరాలు: 18 నుంచి 24 స్క్వాట్స్
  • 65 ఏళ్లు పైబడినవారు: 17 నుంచి 23 స్క్వాట్స్
Advertisement

అయితే సంఖ్య కంటే సరైన పద్ధతిలో చేయడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

సరైన విధంగా స్క్వాట్ ఎలా చేయాలి?

పాదాలను భుజాల వెడల్పుతో ఉంచి నిలబడాలి. శరీర బరువును పాదాల మధ్య భాగంలో సమానంగా ఉంచాలి. నెమ్మదిగా నడుమును వెనక్కి తీసుకెళ్లి మోకాళ్లను వంచాలి. కుర్చీలో కూర్చున్నట్లు కిందికి వెళ్లాలి. ఈ సమయంలో ఛాతీని నిటారుగా ఉంచాలి. వెన్ను వంగకుండా జాగ్రత్త పడాలి. తర్వాత పాదాలపై ఒత్తిడి పెట్టి మళ్లీ నిలబడాలి. ప్రతి కదలికను నెమ్మదిగా, నియంత్రణతో చేయాలి.

Also Read: తేనె కాదు డ్రగ్స్.. కిలో రూ.10000.. ఈ తేనె కావాలంటే ప్రాణాలు ఫణంగా పెట్టాలి..

బలాన్ని ఎలా పెంచుకోవాలి?

సాధారణ స్క్వాట్స్ కష్టంగా అనిపిస్తే కుర్చీ లేదా బెంచ్ సహాయంతో ప్రారంభించవచ్చు. ఇది శరీర నియంత్రణను పెంచుతుంది. అలాగే లంజెస్, స్టెప్-అప్స్, గ్లూట్ బ్రిడ్జెస్, వాల్ సిట్స్ వంటి వ్యాయామాలు కూడా కాళ్ల బలాన్ని పెంచుతాయి.

డంబెల్స్ తో గుంజీలు

బాడీవెయిట్ స్క్వాట్స్ సులభంగా చేయగలిగిన తర్వాత డంబెల్స్ లేదా కెటిల్‌బెల్స్‌తో వ్యాయామం చేయడం ప్రారంభించాలి. బరువును క్రమంగా పెంచాలి. అలాగే రెండు స్క్వాట్ సెషన్ల మధ్య విశ్రాంతి తీసుకోవాలి. సరైన విశ్రాంతి వల్ల కండరాలు బలపడతాయి, గాయాల ప్రమాదం తగ్గుతుంది.

Related News

ముఖంపై చిరునవ్వు, మనసులో ఎన్నో రహస్యాలు.. ‘స’ అక్షరంతో పేరు ఉన్నవారి స్వభావం చాలా క్లిష్టం

ఏటిఎం నుంచి డబ్బులు డ్రా చేసి స్లిప్ అక్కడే పారేస్తున్నారా? సైబర్ మోసాల ప్రమాదం జాగ్రత్త

తల్లిదండ్రులను లవ్ మ్యారేజ్‌కు ఎలా ఒప్పించాలి? మీ కోసమే ఈ టిప్స్

పొట్ట చుట్టూ వేగంగా కొవ్వు కరగడానికి మసాలా వాటర్.. రాత్రి రోజూ తాగితే ఫ్యాట్ బర్న్

కుక్క మాంసం సూప్ తాగాలని చెప్పిన కొరియా ప్రభుత్వం.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వంట చేస్తున్నప్పుడు ఈ 10 తప్పులు అస్సలు చేయకండి

రీల్స్ చూస్తున్నారా..? అయితే ఇది ఒక్కసారి చదవండి

ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం ప్రమాదకరమా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×