E-Paper
Advertisement

బిగ్ బాస్ షోను రిజెక్ట్ చేసిన మల్లికా షెరావత్ .. కారణం అదే..!

బిగ్ బాస్ షోను రిజెక్ట్ చేసిన మల్లికా షెరావత్ .. కారణం అదే..!
Advertisement

Mallika Sherawat:ఈమధ్యకాలంలో ఎక్కువగా కామెడీ గేమ్ షోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే..మరీ ముఖ్యంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి.. టీవీలకే కట్టిపడేస్తూ.. టిఆర్పి రేటింగ్లను పెంచుకోవడానికి పలు టీవీ ఛానల్స్ వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రియాల్టీ షోలు కూడా ఒకటి. ఇప్పటికే బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ గా నిలిచిన మరో రియాలిటీ షో బిగ్ బాస్. త్వరలో హిందీతో పాటు ఏకంగా ఆరు భాషలలో ఒకేసారి బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతుండడంతో దేశవ్యాప్తంగా ఈ బిగ్ బాస్ ఫీవర్ పట్టుకుంది.

బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన మల్లికా షెరావత్..

చాలామంది ఈ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాలి అని, డబ్బు సంపాదించాలని, గుర్తింపు తెచ్చుకోవాలని పరితపిస్తుంటే.. మరికొంతమంది మాత్రం బిగ్ బాస్ ఆఫర్ ను తేలికగా తిరస్కరిస్తున్నారు. అలాంటివారిలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ (Mallika Sherawat) కూడా ఒకరు. ఇప్పటికే పలుమార్లు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చినప్పటికీ ఆమె రిజెక్ట్ చేశారు.. అయితే తాజాగా మరోసారి అవకాశం లభించినా.. తిరస్కరించడంపై తాజాగా ఒక టాక్ షోలో పాల్గొని పంచుకున్నారు.

Advertisement

also read:రామాయణ మూవీను ఫస్ట్ చూసేది ఎవరో తెలుసా?

అసలు విషయం ఏమిటంటే?

అయితే తరచూ తాను బిగ్ బాస్ ఆఫర్ ను తిరస్కరించడం పై మల్లికా షెరావత్ మాట్లాడుతూ.. ఒక నటిగా బిగ్ బాస్ రియాలిటీ షో ఫార్మాట్ నాకు నచ్చలేదు. అందుకే అక్కడి నుంచి ఎప్పుడు ఆఫర్ వచ్చినా నేను తిరస్కరిస్తున్నాను. బిగ్ బాస్ తో పాటు ఖత్రోన్ కే ఖిలాడీ నుంచి కూడా నాకు పిలుపు వచ్చింది. దానిని కూడా నేను తిరస్కరించాను. డబ్బు కోసమే రియాలిటీ షోలకు నేను వెళ్లలేను. మంచి ప్రాజెక్ట్ ఎంచుకునే స్వేచ్ఛ నాకుంది. అందుకే నేను బిగ్ బాస్ ఆఫర్ ను తిరస్కరించాను” అంటూ స్పష్టం చేసింది మల్లికా షెరావత్.

మల్లికా షెరావత్ కెరియర్..

Advertisement

మల్లికా షెరావత్ విషయానికి వస్తే.. అందం, అభినయంతో అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. బోల్డ్ సన్నివేశాలు, స్పెషల్ సాంగ్ లతో ఇండియన్ స్క్రీన్ ని ఒక ఊపు ఊపిన ఈమె.. గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్..హిందీతో పాటు దక్షిణాది చిత్రాలలో కూడా నటించింది. కానీ అనూహ్యంగా వెండితెరకు దూరం అయింది. జీనా సిర్ఫ్ మేరే లియే చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన ఈమె..ఆ తర్వాత మర్డర్, ఆప్ కా సరూర్, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ ఇలా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది . ఇక ముఖ్యంగా సినిమాలకంటే కూడా వివాదాల్లోనే ఈమె పేరు ఎక్కువగా వినిపించింది. భారతదేశంలో మీటూ ఉద్యమం మొదలైన సమయంలో పలువురు స్టార్స్ , దర్శక నిర్మాతల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు భారత దేశంలో అత్యాచారాలు జరుగుతాయని , పరువు హత్యల్లో కన్నబిడ్డల్ని సైతం చంపడానికి వెనుకాడరు అంటూ వ్యాఖ్యానించింది మల్లిక.

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×