E-Paper
Advertisement

816 కోట్ల క్లాసిక్ సూపర్ హిట్ వార్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా… ఏ ఓటీటీలో ఉందంటే ?

816 కోట్ల క్లాసిక్ సూపర్ హిట్ వార్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా… ఏ ఓటీటీలో ఉందంటే ?
Advertisement

Black Hawk Down OTT : 2001లో విడుదలై ప్రపంచ సినిమా చరిత్రలో యుద్ధ చిత్రాలకు కొత్త ప్రమాణం సృష్టించిన మూవీ ‘బ్లాక్ హాక్ డౌన్’. అప్పుడెప్పుడో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. దిగ్గజ దర్శకుడు రిడ్లీ స్కాట్ (గ్లాడియేటర్, బ్లేడ్ రన్నర్) తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా 9 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలోకి రీ-ఎంట్రీ ఇచ్చి టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. రియల్ యుద్ధ ఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమా యుద్ధం క్రూరత్వం, సైనికుల మధ్య అనుబంధం, మానసిక ఘర్షణలను అత్యంత వాస్తవికంగా చూపించి ఇప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. మరి ఈ మూవీకి సంబంధించిన విశేషాలు ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నిజ ఘటన ఆధారంగా రూపొందిన మాస్టర్‌పీస్

1993లో సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన నిజమైన అమెరికన్ మిలిటరీ ఆపరేషన్ (Battle of Mogadishu) ఆధారంగా మార్క్ బౌడెన్ రాసిన నాన్-ఫిక్షన్ పుస్తకం నుంచి ఈ చిత్రం తెరకెక్కింది. రిడ్లీ స్కాట్ ఈ సినిమాలో యుద్ధభూమి గందరగోళాన్ని, సైనికుల ధైర్యాన్ని, భయాన్ని, సహచరుల మధ్య బంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. 144 నిమిషాల రన్ టైమ్‌లో ఒక్క క్షణం కూడా బోర్ కొట్టని ఇంటెన్స్ నెరేషన్ ఈ చిత్రం ప్రత్యేకత. IMDbలో 7.7 రేటింగ్ సాధించిన ఈ సినిమా వార్ డ్రామాలలో ఒక క్లాసిక్‌ గా నిలిచిపోయింది.

Advertisement

జోష్ హార్ట్‌నెట్, ఇవాన్ మెక్‌గ్రెగర్, ఎరిక్ బానా, టామ్ సైజ్‌మోర్, విలియం ఫిచ్ట్‌నర్, జేసన్ ఐజాక్స్, జెరెమీ పివెన్, ఓర్లాండో బ్లూమ్ వంటి హాలీవుడ్ స్టార్లు ఈ సినిమాలో నటించారు. ఆ సమయంలో యంగ్ ఆర్టిస్ట్‌ గా ఉన్న టామ్ హార్డీ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించాడు. ప్రతి నటుడి పర్ఫార్మెన్స్ యుద్ధ భయానకత్వాన్ని, సైనికుల మధ్య బంధాన్ని సహజంగా చూపిస్తుంది.

92 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ తో తీసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 173 మిలియన్ డాలర్లు వసూలు చేసి భారీ విజయం సాధించింది. ఆస్కార్ బరిలో 4 నామినేషన్లు సాధించి, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ విభాగాల్లో 2 అవార్డులు గెలుచుకుంది. యుద్ధ సన్నివేశాల ఎడిటింగ్, సౌండ్ డిజైన్ ఇప్పటికీ హైలెట్ గా ఉంటాయి.

9 ఓటీటీలలోకి రీఎంట్రీ

Advertisement

రిడ్లీ స్కాట్ తదుపరి సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ది డాగ్ స్టార్స్’ 2026 ఆగస్టు 28న విడుదల కానుంది. ఈ మూవీపై వస్తున్న బజ్ కారణంగా అతని పాత మాస్టర్‌పీస్‌లకు డిమాండ్ పెరిగింది. కొత్తతరం యూత్ ఈ క్లాసిక్‌ పై కన్నేశారు. వార్ లో జరిగే వాస్తవికత, రాజకీయాల వల్ల జరిగే విపత్తులు వంటి అంశాలు ఇందులో సందర్భోచితంగా ఉండడం అన్నది కట్టిపడేస్తోంది. ఈ సినిమాను Peacock, Amazon Prime Video, Apple TV, Zee5, Philo, Kanopy, Hoopla వంటి 9 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సబ్‌స్క్రిప్షన్, రెంట్ లేదా ఉచిత లైబ్రరీ ఆప్షన్లతో చూడవచ్చు.

Read Also : పూర్వీకుల ఇంట్లో చిన్నారిని వెంటాడే పురాతన శాపం… మలయాళం ఫాంటసీ హారర్ థ్రిల్లర్

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×