Face Packs: చర్మం తెల్లగా , మెరుస్తూ అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం చాలా మంది రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. మార్కెట్‌లో లభించే రసాయన పదార్థాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ కంటే ఇంట్లో సహజ పదార్థాలతో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్‌లు సురక్షితమైనవి. ఇవి గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ఫేస్ ప్యాక్‌లు చర్మాన్ని లోపలి నుండచి శుభ్రం చేసి.. దాని సహజ సౌందర్యాన్ని పెంచడానికి సహాయపడతాయి. ఇక్కడ చర్మాన్ని తెల్లగా చేయడానికి సహాయపడే కొన్ని బెస్ట్ ఫేస్ ప్యాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హోం మేడ్ ఫేస్ ప్యాక్స్:
1. పసుపు, శనగపిండి, పెరుగు ఫేస్ ప్యాక్:
కావలసినవి:
2- చెంచాల శనగపిండి
1/2- చెంచా పసుపు
1 చెంచా- పెరుగు.
తయారీ: ఈ పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఈ ప్యాక్‌ను ముఖానికి , మెడకు అప్లై చేసి 15-20 నిమిషాలు ఉంచండి. అది ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి.
ప్రయోజనాలు: శనగపిండి చర్మంపై ఉండే మృత కణాలను తొలగిస్తుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి సహాయపడుతుంది.
2. బంగాళదుంప, నిమ్మరసం ఫేస్ ప్యాక్:
బంగాళదుంప రసం సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
కావలసినవి:
1 టేబుల్ స్పూన్ – బంగాళదుంప రసం
1/2 చెంచా- నిమ్మరసం.
తయారీ:
బంగాళదుంపను తురిమి దాని రసాన్ని తీయండి. దానికి నిమ్మరసం కలిపి ఒక దూదితో ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేయండి.
ప్రయోజనాలు: ఈ ప్యాక్ చర్మంపై ఉండే నల్ల మచ్చలను, పిగ్మెంటేషన్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.
3. పాలు, తేనె, బియ్యం పిండితో ఫేస్ ప్యాక్:
ఇది చర్మానికి మంచి స్క్రబ్బర్‌గా, వైటెనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
కావలసినవి:
2 చెంచాల- బియ్యం పిండి,
1 చెంచా – పచ్చి పాలు
1/2 చెంచా- తేనె.
తయారీ: ఈ పదార్థాలను బాగా కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయండి. 20 నిమిషాల తర్వాత నీటితో వృత్తాకార కదలికలతో మసాజ్ చేస్తూ కడిగేయండి.
ప్రయోజనాలు: బియ్యం పిండి చర్మాన్ని స్క్రబ్ చేసి మృత కణాలను తొలగిస్తుంది. పాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. తేనె తేమను అందించి, చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది.
3. పాలు, పసుపు, గంధం పొడి ఫేస్ ప్యాక్:
కావలసినవి:
1 చెంచా- గంధం పొడి
1/2 చెంచా -పసుపు,
పచ్చి పాలు- తగినంత
Also Read: ఈ పండ్లు తిన్నారంటే చాలు.. 50 ఏళ్లలో కూడా యవ్వనంగా కనిపిస్తారు
తయారీ: ఈ మూడింటిని కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి అప్లై చేయండి. ఆరిన తర్వాత శుభ్రం చేయండి.
ప్రయోజనాలు:
గంధం చర్మాన్ని చల్లబరిచి.. కాంతివంతంగా మారుస్తుంది. ఇది మొటిమల మచ్చలను కూడా తగ్గిస్తుంది.
ఈ ఫేస్ ప్యాక్‌లను వారానికి రెండు లేదా మూడు సార్లు వాడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే.. ఏదైనా ప్యాక్‌ను అప్లై చేసే ముందు.. మీ చర్మంపై చిన్న భాగంలో పరీక్షించి చూడండి. ఎందుకంటే కొన్ని పదార్థాలు కొంత మందికి సరిపడకపోవచ్చు. ఈ సహజ పద్ధతులు చర్మానికి ఎటువంటి హాని కలిగించకుండా.. దానిని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయి.